చమ్మక్‌చంద్రకు అంతిచ్చుకుంటున్నారా? నాగబాబు రికమండేషన్ వర్క్ అవుట్!
బుల్లితెర పాపులారిటీ షో జబర్దస్త్‌కి సంబంధించిన వార్తలు, ఆ షో నుంచి బయటకొచ్చిన వారి గురించిన విశేషాలు గత కొన్నిరోజులుగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడేళ్ల అనుభవమున్న జబర్దస్త్‌కి పోటీగా కొత్తగా అదిరింది ప్రోగ్రాం రావడంతో ఈ ప్రోగ్రాముల తాలూకు విషయాలు జనాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చమ్మక్‌చంద్రకు సంబంధించిన రెమ్మ్యూనరేషన్ వ్యవహారం బయటకొచ్చింది. వివరాల్లోకి పోతే..

భారీ పాపులారిటీ.. చమ్మక్ చంద్ర స్కిట్స్ అంటేనే
జబర్ధస్త్ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించాడు కమెడియన్ చమ్మక్ చంద్ర. ఎప్పుడూ ఏదో ఒక ఊతపదం చెబుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చమ్మక్ చంద్ర స్కిట్స్ అంటేనే క్షణం మిస్ కాకుండా బుల్లితెరకు అతుక్కునేలా చేశాడు ఈ కమెడియన్. దీంతో ఈయనకు సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కాయి.

జబర్దస్త్ నుంచి రాబట్టడానికి అదిరింది టీం
చమ్మక్ చంద్ర ఇప్పుడు జబర్దస్త్ వీడి అదిరింది షోలో చేరిపోయాడు. చంద్ర స్కిట్స్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది పైగా ఫ్యామిలీ స్కిట్స్ చేయడంలో అతనికి తిరుగేలేదు. అలాంటి కమెడియన్ని జబర్దస్త్ నుంచి రాబట్టడానికి అదిరింది టీం బాగానే ప్రయత్నం చేసి చివరకు సక్సెస్ అయింది. ఈ మేరకు ఆయన రెమ్మ్యూనరేషన్ కూడా డబుల్ చేసేశారట.

నాగబాబు రికమండేషన్.. ఇన్‌సైడ్ టాక్
ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆ ఛానెల్ మారడానికి గాను చమ్మక్ చంద్ర చేసిన డిమాండ్ అదిరింది టీమ్ తీర్చేసిందట. ఈయనకు డబుల్ రెమ్మ్యూనరేషన్ ఇవ్వాలని నాగబాబు కూడా రికమండ్ చేశారని ఇన్‌సైడ్ టాక్. చమ్మక్ చంద్ర లాంటి కమెడియన్ ద్వారా అదిరింది షోకి బాగా లబ్ది చేకూరుతుందని నాగబాబు అన్నారట.

డబుల్ రెమ్మ్యూనరేషన్.. ఒక్కో కాల్షీట్ కోసం ఎంతంటే
జబర్దస్త్ కామెడీ షోలో చమ్మక్ చంద్రకు నాలుగు కాల్షీట్స్ ఉండేవని, ఈయనకు ఒక్కో కాల్షీట్ కోసం దాదాపు 3 లక్షల వరకు చెల్లించేవారని తెలుస్తోంది. అలాంటిది ఇప్పుడు అదిరింది కోసం ఒక్కో కాల్షీట్ కోసం దాదాపు 5 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే జబర్ధస్త్‌కు డబుల్ అందుకుంటున్నాడు చమ్మక్ చంద్ర.

హైయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టు
ఇకపోతే ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాము జబర్దస్త్ వీడటంపై క్లారిటీ ఇచ్చాడు చమ్మక్ చంద్ర. నాగబాబు చెప్పిన కారణంగానే తాము మారాం కానీ మల్లెమాలతో ఎలాంటి గొడవల్లేవని అన్నాడు. ప్రస్తుతం అదిరిందిలో చమ్మక్ చంద్ర హైయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్టుగా ఉన్నట్లుగా సమాచారం.


Click it and Unblock the Notifications











