Just In
- 21 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
- 2 hrs ago
అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
Don't Miss!
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జబర్ధస్త్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్ చేసిన చమ్మక్ చంద్ర.. ఎవరికెంత ఇస్తారో చెప్పేశాడు.!
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి సత్తా చాటుతున్న వారిలో జబర్ధస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న 'జబర్ధస్త్' షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ కమెడియన్.. తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్కిట్లు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ మధ్య అతడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. తాజాగా చంద్ర జబర్ధస్త్ షోకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు లీక్ చేశాడు. అతడేం చెప్పాడంటే....

చమ్మక్ చంద్ర అంటే అదే గుర్తొస్తుంది
జబర్ధస్త్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు చమ్మక్ చంద్ర. దాదాపు ఏడేళ్ల పాటు ఈ షోలో అతడు ఎన్నో రకాల స్కిట్లు చేశాడు. ఆడ వేషాలకు ఆధ్యుడు కూడా ఇతడే. ముఖ్యంగా చీర పైకెత్తే అతడి మేనరిజంకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దీనితో పాటు స్కిట్టు స్కిట్టుకూ ప్రత్యేకమైన శైలిని చూపించడం అతడి నైజం. అందుకే చంద్ర అంతలా పాపులర్ అయ్యాడు.

ఇక్కడే కాదు.. అక్కడ కూడా సక్సెస్
చమ్మక్ చంద్ర బుల్లితెరపైనే కాదు.. వెండితెర మీద మెరిశాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకునేలా పాత్రలు చేశాడు. ముఖ్యంగా ‘అ ఆ', ‘అరవింద సమేత', ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ', ‘రాజా ది గ్రేట్', ‘టాక్సీవాలా', ‘వెంకీ మామ' వంటి చిత్రాలతో పాటు మరెన్నింటిలోనో నటించాడు. ఇవన్నీ చంద్రకు పేరు తెచ్చి పెట్టాయి.

పేరు తెచ్చిన దానికే గుడ్‌బై చెప్పాడు
చమ్మక్ చంద్ర అంటే అందరికీ గుర్తొచ్చేది జబర్ధస్త్ షోనే. దీని ద్వారానే అతడు వెలుగులోకి వచ్చాడు. అలాంటిది ఈ మధ్య ఈ కామెడీ షో నుంచి అతడు తప్పుకున్నాడు. కొత్తదనంతో పాటు కొద్ది రోజులు జబర్ధస్త్‌కు బ్రేక్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలోనే వెల్లడించాడు. దీంతో చంద్ర అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

నాగబాబుతో అందులోకి వెళ్లిపోయాడు
ఈ మధ్య జబర్ధస్త్‌కు మెగా బ్రదర్ నాగబాబు కూడా గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈయన మరో చానెల్‌లో ‘అదిరింది' అనే షోతో వచ్చారు. ఇదే షోకు చమ్మక్ చంద్ర కూడా ఓ టీమ్ లీడర్‌గా కనిపిస్తున్నాడు. జబర్ధస్త్‌ను డైరెక్ట్ చేసిన నితిన్, భరత్ ఈ షోను నడిపిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షోకు అంతగా రేటింగ్స్ రావడం లేదు.

ఆ విషయాలన్నీ వెల్లడించాడు
జబర్ధస్త్‌ను వీడిన తర్వాత చమ్మక్ చంద్ర ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను వెల్లడించాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్‌లో ఎవరికెంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.? దానిని ఎలాంటి ప్రాతిపదికపై ఎంపిక చేస్తారు.? అనే వాటిని వివరించాడు. దీంతో ఈ ఇంటర్వ్యూకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

వివరాలు లీక్ చేసిన చమ్మక్ చంద్ర
ఈ షోలో అందరి కంటే తనకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారని చంద్ర స్పష్టం చేశాడు. అంతేకాదు, ఒక్కో టీమ్‌కు ఒక్కోలా రెమ్యూనరేషన్ ఉంటుందని చెప్పాడు. అలాగే, ఇవి ప్రతి సంవత్సరానికి ఒకసారి పెంచుతారని తెలిపాడు. ఇక, ఆర్టిస్టుల విషయానికి వస్తే తమ తమ టీమ్‌లలో చేసే వారికి ప్రాధాన్యతను బట్టి చార్జ్ డిసైడ్ చేస్తామని చమ్మక్ చంద్ర పేర్కొన్నాడు.