For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్ చేసిన చమ్మక్ చంద్ర.. ఎవరికెంత ఇస్తారో చెప్పేశాడు.!

  By Manoj
  |

  బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి సత్తా చాటుతున్న వారిలో జబర్ధస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న 'జబర్ధస్త్' షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ కమెడియన్.. తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్కిట్లు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ మధ్య అతడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. తాజాగా చంద్ర జబర్ధస్త్ షోకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు లీక్ చేశాడు. అతడేం చెప్పాడంటే....

  చమ్మక్ చంద్ర అంటే అదే గుర్తొస్తుంది

  చమ్మక్ చంద్ర అంటే అదే గుర్తొస్తుంది

  జబర్ధస్త్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు చమ్మక్ చంద్ర. దాదాపు ఏడేళ్ల పాటు ఈ షోలో అతడు ఎన్నో రకాల స్కిట్లు చేశాడు. ఆడ వేషాలకు ఆధ్యుడు కూడా ఇతడే. ముఖ్యంగా చీర పైకెత్తే అతడి మేనరిజంకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. దీనితో పాటు స్కిట్టు స్కిట్టుకూ ప్రత్యేకమైన శైలిని చూపించడం అతడి నైజం. అందుకే చంద్ర అంతలా పాపులర్ అయ్యాడు.

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా సక్సెస్

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా సక్సెస్

  చమ్మక్ చంద్ర బుల్లితెరపైనే కాదు.. వెండితెర మీద మెరిశాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకునేలా పాత్రలు చేశాడు. ముఖ్యంగా ‘అ ఆ', ‘అరవింద సమేత', ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ', ‘రాజా ది గ్రేట్', ‘టాక్సీవాలా', ‘వెంకీ మామ' వంటి చిత్రాలతో పాటు మరెన్నింటిలోనో నటించాడు. ఇవన్నీ చంద్రకు పేరు తెచ్చి పెట్టాయి.

  పేరు తెచ్చిన దానికే గుడ్‌బై చెప్పాడు

  పేరు తెచ్చిన దానికే గుడ్‌బై చెప్పాడు

  చమ్మక్ చంద్ర అంటే అందరికీ గుర్తొచ్చేది జబర్ధస్త్ షోనే. దీని ద్వారానే అతడు వెలుగులోకి వచ్చాడు. అలాంటిది ఈ మధ్య ఈ కామెడీ షో నుంచి అతడు తప్పుకున్నాడు. కొత్తదనంతో పాటు కొద్ది రోజులు జబర్ధస్త్‌కు బ్రేక్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలోనే వెల్లడించాడు. దీంతో చంద్ర అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

  నాగబాబుతో అందులోకి వెళ్లిపోయాడు

  నాగబాబుతో అందులోకి వెళ్లిపోయాడు

  ఈ మధ్య జబర్ధస్త్‌కు మెగా బ్రదర్ నాగబాబు కూడా గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈయన మరో చానెల్‌లో ‘అదిరింది' అనే షోతో వచ్చారు. ఇదే షోకు చమ్మక్ చంద్ర కూడా ఓ టీమ్ లీడర్‌గా కనిపిస్తున్నాడు. జబర్ధస్త్‌ను డైరెక్ట్ చేసిన నితిన్, భరత్ ఈ షోను నడిపిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షోకు అంతగా రేటింగ్స్ రావడం లేదు.

  ఆ విషయాలన్నీ వెల్లడించాడు

  ఆ విషయాలన్నీ వెల్లడించాడు

  జబర్ధస్త్‌ను వీడిన తర్వాత చమ్మక్ చంద్ర ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను వెల్లడించాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్‌లో ఎవరికెంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.? దానిని ఎలాంటి ప్రాతిపదికపై ఎంపిక చేస్తారు.? అనే వాటిని వివరించాడు. దీంతో ఈ ఇంటర్వ్యూకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

  #CineBox : Jabardasth Effect On Nandamuri Balakrishna New Movie
  వివరాలు లీక్ చేసిన చమ్మక్ చంద్ర

  వివరాలు లీక్ చేసిన చమ్మక్ చంద్ర

  ఈ షోలో అందరి కంటే తనకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారని చంద్ర స్పష్టం చేశాడు. అంతేకాదు, ఒక్కో టీమ్‌కు ఒక్కోలా రెమ్యూనరేషన్ ఉంటుందని చెప్పాడు. అలాగే, ఇవి ప్రతి సంవత్సరానికి ఒకసారి పెంచుతారని తెలిపాడు. ఇక, ఆర్టిస్టుల విషయానికి వస్తే తమ తమ టీమ్‌లలో చేసే వారికి ప్రాధాన్యతను బట్టి చార్జ్ డిసైడ్ చేస్తామని చమ్మక్ చంద్ర పేర్కొన్నాడు.

  English summary
  Chammak Chandra is an Indian comedian and actor, known for the Jabardast comedy show. Chandra was born in Venkatapur in Nizamabad, Telangana. He made his film debut in the Teja movie Jai. Later he performed skits with actor Dhanraj and Venu and earned the attention of producer Mallemala.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X