అనసూయ గుట్టురట్టు చేసిన జబర్దస్త్ కమెడియన్
ఓ న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ సెలబ్రెటీ స్థాయికి చేరుకున్నారు అనసూయ భరద్వాజ్. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న అనసూయ జీవితం మలుపు తిరిగింది . నాగబాబు, రోజా వంటి స్టార్లు స్టేజ్‌పై జడ్జిలుగా ఉన్నప్పటికీ.. అనసూయ తన అంద చందాలతో ఈ కామెడీ షోకు గ్లామర్ అద్దారు. జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీతో సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు హోస్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. తద్వారా తెలుగు నాట స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు సినిమాల్లోనూ ఆమెకు ఆఫర్లు క్యూకట్టాయి.
రంగస్థలం , క్షణం, విన్నర్, గాయత్రి, ఎఫ్2, యాత్ర, కథనం, చావు కబురు చల్లగా, భీష్మ పర్వం, ఖిలాడీ, విమానం, పెద్దకాపు, రజాకార్ వంటి సినిమాల్లో అనసూయ నటించింది. నటిగానే కాకుండా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి హీరోయిన్లకు పోటీ ఇచ్చారు. ఇక పుష్ప పార్ట్ 1, పార్ట్ 2లలో ద్రాక్షాయణిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం తమిళంలో ఫ్లాష్ బ్యాక్, ఉల్ఫ్ సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు.

అయితే ఆమెకు ఇంతటి క్రేజ్, స్టార్ డమ్ తీసుకొచ్చిన జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడాన్ని అనసూయ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ దీని గురించి పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూనే ఉంటారు. ఆమె జబర్దస్త్‌ను వీడటంపై రకరకాల గాసిప్స్ వచ్చినా ఫలానా కారణమంటూ ఏది బయటికి రాలేదు. అయితే అనసూయ ఏ వేదికపై మాట్లాడినా తనకు జీవితాన్ని ఇచ్చింది జబర్దస్తేనని ఖచ్చితంగా చెబుతుంటారు.
అనసూయ జబర్దస్త్‌కు యాంకరింగ్ చేసే రోజుల్లో ఆమెపై సెటైర్లు, పంచ్‌లు వేసేవాళ్లు .. కొన్నిసార్లు హద్దు మీరినప్పటికీ వాటిని సరదాగానే, వృత్తిలో భాగంగానే తీసుకున్నారు . ఓ రోజున చమ్మక్ చంద్ర .. అనసూయ డైలీ లైఫ్, వ్యక్తిగత జీవితంపై ఓ స్కిట్ చేసి బాగా నవ్వించాడు. ఇందులో అనసూయ గెటప్‌లో చంద్ర నటించగా.. సత్తిపండు అనసూయ భర్త భరద్వాజ్ పాత్రను పోషించాడు. ఇద్దరు అబ్బాయిలు వచ్చి నువ్వు రంగస్థలం చేసినప్పటి నుంచి నన్ను చిట్టిబాబు అని, అన్నయ్యని కుమార్ బాబు అని పిలుస్తున్నావ్ అనడంతో అంతా నవ్వేస్తారు.

ఇంతలో సత్తిపండు వచ్చి నువ్వు పిల్లలని రెడీ చేయ్ నేను పప్పు వండుతానని అంటాడు.. మధ్యలో రోజా కలగజేసుకుని పాపం భరద్వాజ్ అని అంటుంది. ఇంతలో మీడియా ప్రతినిధుల మంటూ ఇద్దరు వచ్చి చమ్మక్ చంద్రని కుమారి అని పిలవడంతో నువ్వు శ్రీమతివి కదా అని సత్తిబాటు అంటాడు. అనసూయ 16 ఏళ్లకే ఎంతో పేరు తెచ్చుకున్నారని విలేకరి అనగా నీ వయసు 36 ఏళ్లు కదా అనడంతో యాంకర్ సీట్లో కూర్చొన్న అనసూయ నో నో అంటూ గగ్గోలు పెడుతుంది.
ఇక నిద్రలోనూ జబర్దస్త్ అని.. చమ్మక్ చంద్ర టీమ్‌కి ఎన్ని మార్కులు ఇస్తున్నారంటూ కలవరించి మరిన్ని నవ్వులు పూయించాడు చంద్ర. మమ్మీ టార్చర్ తట్టుకోలేకపోతున్నామని ఇక మేం హాస్టల్‌కు వెళ్లిపోతామని పిల్లలు చెప్పడంతో స్కిట్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది. ప్రస్తుతం ఈ స్కిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











