స్టార్ హీరోయిన్‌కి మరదలు.. దారుణంగా బుల్లితెర నటి జీవితం.. బట్టలు అమ్ముకుంటూ
ఒక్క నిర్ణయం చాలు హ్యాపీగా సాగిపోతున్న జీవితం తలక్రిందులు కావడానికి . అర్ధం పర్థం లేని నిర్ణయాలతో మంచి జీవితాన్ని నాశనం చేసుకుని కష్టాలు కోరి కొన్ని తెచ్చుకున్న వారి ఉదంతాలు ఎన్నో చూశాం. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా కష్టాలకు అతీతం కాదు. స్టార్ హీరోయిన్‌కు మరదలిగా, నటుడి భార్యగా ఉన్న ఓ బుల్లితెర నటి ఇప్పుడు బట్టలు అమ్ముకుంటూ జీవితాన్ని గడుపుతోంది. ఆమె ఎవరు? ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందో చూస్తే :
బుల్లితెర నటి చారు అసోప హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ .. అగ్లె జనమ్ మోహ్ బితియా హి కిజో , యె రిస్టా క్యా కెహ్లాతా హై, బడే అచ్చె లగ్తే హై, బాల్ వీర్ బుద్ధా, లడ్డూ 2, జిజి మా, విక్రమ్ బేతాల్ కీ రహస్య గత, అక్బర్ కా బాల్ బిర్బల్, కైసా హై యే రిస్టా అంజనా వంటి సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. 2011లో ఇంపేషెంట్ వివేక్‌తో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అనంతరం కాల్ ఫర్ ఫన్ , యాల్క్, జోహ్రి వంటి చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

సీరియల్స్, సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్న చారు అసోపా వ్యక్తిగత జీవితం ఒడిదొడుకులతోనే సాగింది. ఆమెకు 19 ఏళ్ల వయసులోనే రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త సోమ్‌వీర్ పూజారితో 2007లో వివాహం జరిగింది. కొన్నాళ్లు సాఫీగానే సాగిన వీరి వైవాహిక జీవితం 9 ఏళ్లు తిరిగేసరికి విడాకులకు దారి తీసింది. 2016లో చారు - సోమ్‌వీర్‌లు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన సహనటుడు నీరజ్ మాలవీయతో ప్రేమలో పడ్డ చారు ఆయనతో కొన్నాళ్లు డేటింగ్ కూడా చేసింది. పెద్దల అంగీకారంతో చారు - నీరజ్‌లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. రాజస్థాన్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. కానీ ఏం జరిగింతో ఏమో కానీ 2017లో ఈ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని షాకిచ్చింది ఈ జంట.
అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మోడల్ సుస్మితా సేన్ తమ్ముడు రాజీవ్ సేన్‌తో ప్రేమలో పడ్డ చారు ఆయనను 2019 జూన్‌లో పెళ్లాడారు. ఈ దంపతులకు కుమార్తె జియానా సేన్ సంతానం. మూడోసారి కూడా ఈమెకు పెళ్లి కలిసిరాలేదు. నాలుగేళ్లు తిరిగేసరికి రాజీవ్ సేన్‌తోనూ చారు విడాకులు తీసుకున్నారు. వీరి నిర్ణయం బాలీవుడ్‌కి షాకిచ్చింది. చారు- రాజీవ్‌ల మధ్య విడాకులకు దారి తీసిన కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.
మరోవైపు చారు అసోపకు అవకాశాలు కూడా తగ్గడంతో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. నటనను పూర్తిగా పక్కనపెట్టేసిన చారు.. కుమార్తె జియానాను తీసుకుని తన సొంతూరు రాజస్థాన్‌లోని బికనీర్‌కు వెళ్లిపోయింది. ఆన్‌లైన్‌లో బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ముంబైలో జీవితం కష్టంగా ఉందని.. దానిని భరించలేక బికనీర్‌కు వచ్చేసినట్లు చారు ఓ సందర్భంలో చెప్పారు. ప్రస్తుతం చారు అసోప వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జీవితం ఎలాంటి స్థాయి నుంచి ఎక్కడికి వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











