నాకు ఒంపు సొంపులున్నాయి చూపించా.. నీకు ఉంటే చూపించుకో.. సుస్మిత సేన్ మరదలు షాకింగ్‌గా
ప్రపంచ సుందరి సుస్మిత సేన్ మరదలు, టెలివిజన్ నటి చారు అసోపాకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె పోస్టు చేసిన ఓ హాట్ ఫోటోను టార్గెట్ చేస్తూ నెటిజన్లు భారీగా కామెంట్లు చేశారు. తనపై వచ్చిన కామెంట్లపై ఆమె స్పందిస్తూ.. నేను ఎలా ఉండాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు.. మీకేమైనా చూపించుకోవాలంటే చూపించుకో అంటూ గట్టిగా జవాబు ఇచ్చారు. ప్రస్తుతం చారు వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ట్రోలింగ్ గురించి వివారాల్లోకి వెళితే..

టెలివిజన్ సీరియల్స్ సుస్మిత సేన్ మరదలు
టెలివిజన్ నటి అయిన చారు అసోపా అందాల సుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్‌ను వివాహం చేసుకొన్నారు. జాతీయ చానెల్స్‌లో బడె అచ్చే లగ్తే హై, దియా బంటీ హమ్, మహా రక్షక్ దేవి, లాడు 2, జీజి మా, కరన్ సంగిని లాంటి సీరియల్స్ నటించారు. ఇటీవల వచ్చిన విక్రమ్ బేతాళ్ కి రహస్య కథలో విలన్‌గా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. అలాంటి తార తాజాగా ట్రోల్స్ గురైంది.

రెడ్ జాకెట్ ధరించి సెల్పీలతో
ఇటీవల రెడ్ జాకెట్ ధరించి సెల్పీలతో చారు అసోపా ఇన్స్‌టాగ్రామ్‌లో అదరగొట్టింది. ఆమె ఫోటోలకు అభిమానులు కామెంట్లతో ప్రశంసించారు. అయితే కొందరు ఆమె ఫోటోలపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. దారుణంగా ట్రోల్ చేస్తూ హంగామా చేశారు. రకరకాల కామెంట్లతో విసిగించారు. దాంతో ఆమె స్పందించాల్సి వచ్చింది.

నీ అందాలు చూపించుకోవాలంటే
రెడ్ జాకెట్ ధరించిన చారు అసోపా అందాలతో కనువిందు చేసింది. ఆ ఫోటోపై కామెంట్ చేస్తూ నీ అందాలు చూపించాలంటే.. చూపించి.. చూపించినట్టు ఎందుకు.. మొత్తం చూపించవచ్చు గదా. మాకు మొత్తం కనిపిస్తాయిగా అని నెటిజన్ కామెంట్ పెట్టింది.

నాకు ఒంపు సొంపులున్నాయి..
శోభా గుడ్డి అనే అకౌంట్ పెట్టిన కామెంట్‌కు చారు అసోపా కామెంట్ చేస్తూ.. నాకు ఒంపు సొంపులతో మంచి శరీరం ఉంది. అందుకే నేను చూపించాలనుకొన్నాను. ఒకవేళ నీకు అలాంటి ఒంపు సొంపులు ఉంటే నీవు చూపించుకో. ఎవరు వద్దంటున్నారు అని గట్టిగా సమాధానం ఇచ్చింది.
Recommended Video

చారు జవాబుకు నెటిజన్ల ఫిదా
చారు అసోపా ఇచ్చిన రివర్స్ పంచ్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. అనవసరంగా ట్రోల్ చేసే నెటిజన్లు ఇలాగే బుద్ధి చెప్పాలి. మీరు ఉత్తమమైన జవాబు ఇచ్చారు అంటూ కామెంట్స్ వదిలారు. నీవు రెడ్ జాకెట్‌లో చాలా అందంగా ఉన్నాను. నేను డై హార్డ్ ఫ్యాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











