కేక పెట్టిస్తున్న ‘మా టీవీ’ కాంచన గంగ

ఇక ఈ సీరియల్ లో ప్రధాన కధాంశం విషయానికి వస్తే... దేవదాసి తెగకు చెందిన దేవయాని జమీందారు నరేంద్రవర్మకి ఉంపుడుగత్తెగా మారుతుంది. తన కూతురు కాంచన జీవితం తనలా మారకూడదని, పెళ్లి చేసుకుని గౌరవప్రదమైన జీవితం గడపాలని కోరుకుంటుంది దేవయాని. జమీందారు కూతురి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అందవిహీనురాలని మాట దాటేస్తుంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఆ కూతురిపై జమీందారు దృష్టి పడుతుంది. ఈ కామంధుడి బారి నుంచి కూతుర్ని కాపాడుకోవడానికి దేవయాని ఏం చేస్తుంది? కూతురి జీవితం విషయంలో ఆమె కన్న కలలు ఫలిస్తాయా? అనే కథాంశం చుట్టూ తిరుగుతుంది.
ఈ సీరియల్ లో ప్రదాన పాత్ర చేస్తున్న ఛాయా సింగ్ గతంలో తిరుడా తిరుడీ అనే తమిళ చిత్రంలో చేసి పేరు తెచ్చుకుంది. అంతేగాక అనేక తమిళ,మళయాళ,కన్నడ సినిమాలు కూడా చేసింది. తొలిసారిగా ఆమె కాంచన గంగతో సీరియల్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సీరియల్ తనకు మంచి పేరు తెచ్చి పెట్టి అనేక ఆఫర్స్ సంపాదిస్తుంది ఆమె ఆశిస్తోంది.
పృథ్వీరాజ్, ఛాయాసింగ్, మంజుల, భావన, బేబి లిఖిత, బేబి యాని తదితరులు నటిస్తున్న ఈ సీరియల్‌ని విజయకృష్ణ దర్శకత్వంలో అశోక్ నిర్మిస్తున్నారు. మా టీవీలో సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఈ సీరియల్ ప్రసారమవుతుంది.


Click it and Unblock the Notifications











