For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్‌బాస్ తమిళం 3 కంటెస్టెంట్స్ వీరే... తెలుగు నిర్మాత కూతురు కూడా!

|
Biggboss Tamil Season 3 Contestants Complete Details | Biggboss Tamil 3 | Kamal Haasan | Filmibeat

తమిళ వెర్షన్ బిగ్ బాస్ షోను ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో..... ఆదివారం(జూన్ 23)న మూడోసీజన్ గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఈ సారి షోలో ఎవరు భాగం కాబోతున్నారనే ఉత్కంఠకు తెరదించుతూ 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో ఎంటయ్యారు.

గతంతో పోలిస్తే ఈ సారి సినీ ప్రముఖుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గత సీజన్లలో సామాన్యులకు చోటు కల్పించినా.. ఈ సారి మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. పాపులారిటీ, గ్లామర్ ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చేస్తూ కంటెస్టెంట్స్ ఎంపిక జరిగింది. 15 మంది పోటీదారుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

కంటెస్టెంట్ నెం.1.. ఫాతిమా బాబు

కంటెస్టెంట్ నెం.1.. ఫాతిమా బాబు

బాలచందర్ ‘కల్కి' సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై తమిళం, మలయాళ చిత్రాల్లో ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించడంతో పాటు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న ఫాతిమా బాబు... కంటెస్టెంట్ నెం.1‌గా బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళం, మలయాళంలో ఆమె పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

కంటెస్టెంట్ నెం.2... లోస్లియా మరియనేసన్

కంటెస్టెంట్ నెం.2... లోస్లియా మరియనేసన్

ఈ షోలో లోస్లియా మరియనేషన్ కంటెస్టెంట్ నెం.2గా ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆమె శ్రీలంకకు చెందిన మోడల్, టీవీ యాంకర్.

కంటెస్టెంట్ నెం.3... సాక్షి అగర్వాల్

కంటెస్టెంట్ నెం.3... సాక్షి అగర్వాల్

తమిళ మదర్, రాజస్థానీ ఫాదర్‌కు ఉత్తరాఖండ్‌లో జన్మించిన సాక్షి అగర్వాల్... తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. కన్నడ చిత్రం ద్వారా నటన మొదలు పెట్టి తమిళంలో యోగాన్ అనే చిత్రం చేసింది. రజనీకాంత్ ‘కాలా', అజిత్ ‘విశ్వాసం'లో నటించింది. ఇప్పటి వరకు వందకు పైగా యాడ్స్ ఫిల్మ్స్ చేసింది.

కంటెస్టెంట్ నెం. 4... జంగిరి మధుమిత

కంటెస్టెంట్ నెం. 4... జంగిరి మధుమిత

తమిళ కామెడీ నటీమణుల్లో జంగిరి మధుమిత ఒకరు. కోలీవుడ్లో దాదాపు 50కిపైగా చిత్రాల్లో నటించారు. 41 ఏళ్ల ఈ నటి విజయ్, రాఘవ లారెన్స్, కార్తి, విక్రమ్ తదితర హీరోల చిత్రాల్లో నటించారు. తక్కువ సమయంలోనే తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కామెడీ యాక్టర్లలో ఈవిడ ఒకరు.

కంటెస్టెంట్ నెం.5.. కెవిన్

కంటెస్టెంట్ నెం.5.. కెవిన్

విజయ్ టీవీలో యాక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన కెవిన్... పలు పాపులర్ తమిళ సీరియళ్లలో నటించారు. కింగ్స్ ఆఫ్ డాన్స్ రెండో సీజన్‌కు హోస్ట్ గా వ్యవహరించారు. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కొన్ని చిత్రాల్లో హీరోగా నటించాడు.

కంటెస్టెంట్ నెం. 6... అభిరామి వెంకటాచలం

కంటెస్టెంట్ నెం. 6... అభిరామి వెంకటాచలం

తమిళ టీవీ, సినీ నటి అభిరామి వెంకటాచలనం...‘లవ్ మి లవ్లీ లేడీ' అనే మ్యూజిక్ వీడియో ద్వారా తన కెరీర్ మొదలు పెట్టారు. ‘కలవు' అనే సినిమా ద్వారా నటిగా కెరీర్ మొదలు పెట్టింది. అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నేర్కొండ పార్వాయ్'లో కీలక పాత్ర పోషించింది.

కంటెస్టెంట్ నెం.7... శరవణన్

కంటెస్టెంట్ నెం.7... శరవణన్

90ల్లో తమిళ సినిమాల్లో లీడ్ రోల్స్ చేసిన శరవణన్... నటుడిగా తన కెరీర్ తగ్గుముఖం పట్టడంతో దర్శకుడిగా మారారు. అయితే అది కూడా కలిసి రాక పోవడంతో సపోర్టింగ్ రోల్ష్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు.

కంటెస్టెంట్ నెం.8.. వనితా విజయ్ కుమార్

కంటెస్టెంట్ నెం.8.. వనితా విజయ్ కుమార్

తమిళంలో వివాదాస్పద నటీమణుల్లో ఒకరైన వనితా.... ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్ కూతురు. విజయ్ మూవీ చంద్రలేఖ ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి.... కొన్ని సినిమాల తర్వాత నటనకు దూరమైంది. గత కొంతకాలంగా తన తండ్రితో గొడవ పడుతూ వార్తల్లోకి ఎక్కింది.

కంటెస్టెంట్ నెం.9...చేరన్

కంటెస్టెంట్ నెం.9...చేరన్

తమిళంలో 4 జాతీయ అవార్డులు దక్కించుకున్న తమిళ దర్శకుల్లో చేరన్ ఒకరు. 10 సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు 15 సినిమాల్లో నటించారు. పోర్కాలమ్, పాండవార్ భూమి, వెట్రి కోడి కట్టు లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.

కంటెస్టెంట్ నెం.10..షెరిన్ శ్రింగర్

కంటెస్టెంట్ నెం.10..షెరిన్ శ్రింగర్

షెరిన్ శ్రింగర్ బెంగులూరులో పుట్టిపెరిగింది. మోడలింగ్ రంగంలో తన కెరీర్ మొదలు పెట్టి నటిని కావాలనే డ్రీమ్ నిజం చేసుకుంది. తమిళంతో పాటు పలు తెలుగు చిత్రాల్లో కూడా షెరిన్ శ్రింగర్ నటించారు.

కంటెస్టెంట్ నెం.11... మోహన్ వైద్య

కంటెస్టెంట్ నెం.11... మోహన్ వైద్య

మోహన్ వైద్య... తమిళ ఇండస్ట్రీకి చెందిన సింగర్, వయోలిన్ వాద్యకారుడు, డాన్స్ కొరియోగ్రాఫర్, టెలివిజన్ ప్రజంటర్, వోకలిస్ట్. ప్రముఖ వీణా వాద్యకారుడు రాజేష్ వైద్యకు సోదరుడు.

కంటెస్టెంట్ నెం. 12... థర్శన్ త్యాగరాజన్

కంటెస్టెంట్ నెం. 12... థర్శన్ త్యాగరాజన్

థర్శన్ త్యాగరాజన్ శ్రీలంకకు చెందిన మోడల్, నటి. భారీ వేతనం వచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి నటనారంగం వైపు వచ్చింది. దాదాపు నాలుగేళ్ల స్ట్రగులింగ్ తర్వాత అవకాశాలు దక్కించుకుంది. ఆమె నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

కంటెస్టెంట్ నెం.13.. డాన్స్ మాస్టర్ సాండీ

కంటెస్టెంట్ నెం.13.. డాన్స్ మాస్టర్ సాండీ

తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్లలో ఒకరైన సాండీ కంటెస్టెంట్ నెం.11గా ఎంట్రీ ఇచ్చాడు. కాలా, సాహసం, కాకాకాపో, జంబులింగం 3డి, జితన్ 2, గీతు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు. కింగ్ ఆఫ్ డాన్స్ షో సెకండ్ సీజన్ జడ్జిగా వ్యవహరించారు.

కంటెస్టెంట్ నెం.14... ముగెన్ రావు

కంటెస్టెంట్ నెం.14... ముగెన్ రావు

ముగెన్ రావు.. మలేషియాకు చెందిన మల్టీ టాలెంటెడ్ క్రియేటివ్ ఆర్ట్ ప్రాక్టీషనర్. నటనతో పాటు... హోస్టుగా, గాయకుడిగా, లిరిసిస్టుగా, రచయితగా తన టాలెంట్ నిరూపించుకుంటున్నారు.

కంటెస్టెంట్ నెం.15... రేష్మా పసుపులేటి

కంటెస్టెంట్ నెం.15... రేష్మా పసుపులేటి

ఒకప్పుడు ఎయిర్ హోస్టెస్‌గా పని చేసిన రేష్మా పసుపులేటి... టీవీ సీరియల్స్ ద్వారా నటిగా మారింది. తమిళ సీరియల్స్‌తో పాటు కో 2, మసాలా పాదం తదితర చిత్రాల్లో నటించింది. ఆమె తండ్రి ప్రసాద్ పసుపులేటి తెలుగు ప్రొడ్యూసర్.

English summary
Bigg Boss Tamil Season 3, the mega reality show which has a wide fan base among the Tamil audiences, has started its journey from today onwards. The excitement and craze for the next 100 days would be at their peak and TRP records are expected to be shattered. Hosted by Kamal Haasan, Bigg Boss Tamil 3 will be as starry as the previous seasons with a good number of celebrity contestants eyeing the coveted title. After a whole lot of rumours that came up regarding the contestants, now an official update on the confirmed contestants have come out. Read Bigg Boss Tamil 3 contestants list to know the complete details.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more