యువ టెలివిజన్ నటి ఆత్మహత్య.. ఛావా నటి మరణానికి కారణం ఏమిటంటే?

యువ టెలివిజన్ యాక్టర్ సంచిత ఉగాలే ఇకలేరు. బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సంపాదించుకొన్న ప్రతిభావంతురాలైన నటి అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై కనిపించారు. కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకొన్న ఆమె తన నివాసంలో ఉరి వేసుకొని మరణించడం ఆమె అభిమానులను, సినీ వర్గాలను, సన్నిహితులు, శ్రేయోభిలాషులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆమె మరణం వెనుక కారణాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

సంచలన విజయం సాధించిన ఛావా మూవీలోను, అలాగే బుల్లితెర మీద కుంకుమ్ భాగ్య, వాగ్లే కి దునియా సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన నటి సంచిత ఉగాలే ముంబైలోని నాలాసోపారా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆమె వయసు 22 సంవత్సరాలు. నాలాసోపారా తూర్పులోని ఆచోలేలో ఆమె నివాసం ఉంటున్న సాయి సంతోష్ బిల్డింగ్‌లో ఈ విషాద సంఘటన చోటు చేసుకొన్నది.

Sanchita Ugale found

ప్రాథమిక సమాచారం ప్రకారం.. తన గది తలుపు బిగించుకొన్నారు. చీరతో బెడ్ రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించారు. అయితే అనుమానం వచ్చిన కొందరు తలుపు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించగానే విగత జీవిగా కనిపించారు. వెంటనే ఆమెను సమీపంలోని వాసాయి విరార్ మున్సిపల్ కార్పోరేషన్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే వైద్యులు పరీక్షించిన వెంటనే.. ఆమె మరణించారు అని ధృవీకరించారు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

పోలీసుల వెల్లడించిన కథనం ప్రకారం.. సంచిత ఉగాల మరణం ఉదయం 7 గంటల నుంచి 7.30 మధ్య ప్రాంతంలో జరిగి ఉంటుంది. ఆమె తన గదిని లాక్ చేసుకొన్నారు. ఆ తర్వాత చీరతో ఉరి వేసుకొన్నారు. ఆ తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని వసాయి విరార్ మున్సిపల్ కార్పోరేషన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యలు తెలిపారు. మృతురాలి తండ్రి మచిందా ఉగాలే ఫిర్యాదు మేరకు యాక్సిడెంటల్ మరణం కింద కేసు నమోదు చేసుకొన్నాం అని అచోలే పోలీసులు తెలిపారు.

బుల్లితెర మీద సంచిత తన నటనతో మంచి గుర్తింపు పొంది కెరీర్ గ్రాఫ్‌ను గణనీయంగా మెరుగు పరుచుకొన్నారు. వర్థమాన తారగా పాపులారిటీ సంపాదించుకొంటున్న ఆమె అర్ధాంతరంగా జీవితాన్ని చాలించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కుంకుమ్ భాగ్య, వాగ్లే కి దునియా, దిల్ వాలీ దుల్హా లే జాయేంగే సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకొన్నారు.

బుల్లితెర మీదనే కాకుండా ఆమె ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించారు. విక్రాంత్ మెస్పీ నటించిన క్రైమ్ ఆజ్ కల్, జీ5 స్ట్రీమింగ్ అవుతున్న సైలెన్స్ 2: ది నైట్ ఓల్ బార్ షూట్‌అవుట్ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయ్‌తో కలిసి నటించారు. అలాగే విక్కీ కౌశల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛావా సినిమాలో తారాభాయ్‌గా నటించి మెప్పు పొందారు.

Read more about: chhaava
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X