Bigg Boss Non Stop: బిగ్ బాస్ ఓటీటీలోకి విదేశీ సెలెబ్రిటీ.. షో చరిత్రలోనే సంచలనం

దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ స్పందనను అందుకుంటూ.. అత్యధిక టీఆర్పీని కొల్లగొడుతూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దీంతో షో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదింటిని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌తో సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు.

మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇందులోకి విదేశీ కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఎవరది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

మరో ప్రయోగానికి టీమ్ రెడీ

మరో ప్రయోగానికి టీమ్ రెడీ

తెలుగులో మాత్రమే బిగ్ బాస్ షోకు ఆదరణ విశేషంగా రావడంతో నిర్వహకులు ప్రయోగాలకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను తీసుకు రాబోతున్నారు. దీనికి ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. దీన్ని కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారన్నది తెలిసిందే.

అందులో 24 గంటల పాటు

అందులో 24 గంటల పాటు

గత ఏడాది హిందీలో, కొద్ది రోజుల క్రితమే తమిళంలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను తీసుకుని వచ్చారు. ఆ రెండు చోట్లా దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందనే దక్కింది. దీంతో ఇప్పుడు తెలుగులోకి తీసుకు వస్తున్నారు. అయితే, దీన్ని టీవీలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు అందులో ప్రసారం చేయబోతున్నారు.

డేట్, కంటెస్టెంట్లు వివరాలు

డేట్, కంటెస్టెంట్లు వివరాలు

ఇటీవలే విడుదలైన ప్రోమోలో తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 26వ తేదీ, సాయంత్రం 6 గంటల నుంచి నుంచి ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఇది మొత్తం 85 రోజుల పాటు సాగనుందని అంటున్నారు. ఇక, ఇందులో 18 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్లు క్యారంటైన్‌లోకి కూడా వెళ్లిపోయారనే టాక్ వినిపిస్తోంది.

కంటెస్టెంట్లలో వాళ్లే ఎక్కువ

కంటెస్టెంట్లలో వాళ్లే ఎక్కువ

మరో వారం రోజుల్లోనే అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇక, ఇందులో 18 మంది కంటెస్టెంట్లు వస్తుండగా.. అందులో చాలా మంది మాజీ కంటెస్టెంట్లే ఉండబోతున్నారని తెలిసింది. ఇప్పటికే కొన్ని పేర్లూ లీక్ అయ్యాయి.

షోలోకి విదేశీ సెలెబ్రిటీ రాక

షోలోకి విదేశీ సెలెబ్రిటీ రాక

ఫిబ్రవరి 26 నుంచి సరికొత్త హంగులతో ఎంతో ప్రయోగాత్మకంగా ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు సరికొత్త ప్లాన్లు చేస్తున్నారు. ఇందుకోసం కంటెస్టెంట్ల ఎంపికపై బాగా ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే విదేశీ సెలెబ్రిటీ చిచ్చా చార్లెస్‌ను కంటెస్టెంట్‌గా తీసుకున్నారని తెలిసింది.

షో చరిత్రలో తొలిసారి ఇలా

షో చరిత్రలో తొలిసారి ఇలా

ఉగాండాకు చెందిన చిచ్చా చార్లెస్ వరంగల్‌లోని ఓ కాలేజ్‌లో చదువుకునేందుకు వచ్చాడు. అప్పటి నుంచి అతడు కొంచెం కొంచెం తెలుగు మాట్లాడుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. దీంతో అతడికి ఓటీటీలో ఆఫర్ ఇచ్చారు. ఈ విషయం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడైంది. ఇక, బిగ్ బాస్ చరిత్రలో విదేశీయుడిని ఎప్పుడూ షోలోకి తీసుకు రాకపోవడం విశేషం.

Recommended Video

Bigg Boss OTT Telugu : Contestants List Updates, Starting Date | Filmibeat Telugu
చిచ్చా ప్రొఫైల్‌ను పరిశీలిస్తే

చిచ్చా ప్రొఫైల్‌ను పరిశీలిస్తే

2017లో ఇండియాకు వచ్చిన చార్లెస్ వచ్చీ రాని తెలుగు, ముద్దు ముద్దు మాటలు, ముచ్చటైన పాటలతో అలరిస్తుంటాడు. ఈ క్రమంలోనే తెలుగులో ఎన్నో షోలలో కూడా కనిపించాడు. అలాగే, పలు చిత్రాల్లో కూడా మెరిశాడు. ఈ క్రమంలోనే వీసా గడువు ముగిసిన కారణంగా ఓ సారి అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ తర్వాత తెలుగులో సెలెబ్రిటీగా మారిపోయి ఇప్పుడు ఆఫర్ పట్టేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X