Bigg Boss Telugu 8: విష్ణుప్రియకు బిగ్ షాక్.. మణికంఠ కంటే తక్కువగా.. దీనికంటే ఎలిమినేషనే బెస్ట్

కొత్త కొత్త టాస్కులు, కంటెస్టెంట్ల మధ్యన గొడవలు, అప్పుడప్పుడూ మసాలా సన్నివేశాలు ఇలా ఎన్నో రకరకాల పరిణామాలతో సాగుతున్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే అసలేమాత్రం పరిచయం కాన్సెప్టుతో వచ్చినా.. తెలుగు ప్రేక్షకుల దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్‌‌ షోగా మారిపోయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో దాన్ని ప్రసారం చేస్తున్నారు. ఇందులో తాజా ఎపిసోడ్‌లో విష్ణుప్రియకు షాక్ తగిలింది. అసలేమైంది? ఆ సంగతులేంటో చూద్దామా!

అదిరిపోయే కంటెంట్‌తో
తెలుగు బిగ్ బాస్‌ షోలో గతంలో వచ్చిన సీజన్లు అన్నీ మంచి ఆదరణను అందుకోవడంతో ఎనిమిదో దానిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను చూపిస్తూ వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లను ప్లాన్ చేసుకున్నారు.

Chiefs Gives Big Shock To Vishnupriyaa Bhimeneni In Bigg Boss Telugu 8 Show

విష్ణు టైటిల్ ఫేవరెట్‌గా

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, అందులో అతి తక్కువ మంది మాత్రమే స్పెషల్ ఫోకస్ అయ్యారు. ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియ మాత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎందుకంటే షోలోకి వచ్చిన వారిలో ఆమెకు మాత్రమే ఎక్కువగా ఫాలోయింగ్ ఉండడమే. అందుకే టైటిల్ ఫేవరెట్‌గా ఆమెను చెప్తున్నారు.

ముగ్గురికి సైన్యం కావాలి
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ 'ఇంట్లో ముగ్గురు చీఫ్‌లు ఉన్నారు కాబట్టి వీళ్లకి సైన్యం కూడా కాాలి. కాబట్టి మీరు మీ టీమ్‌లని రెడీ చేసుకోవాలి' అని చెప్పాడు. అదే సమయంలో నబీల్, శేఖర్, బేబక్కలు చీఫ్‌లు అయ్యే అవకాశం కోల్పోయారు కాబట్టి వాళ్లకి నచ్చిన చీఫ్ టీమ్‌లో చేరే అవకాశం ఇచ్చాడు. మిగిలిన వాళ్లను చీఫ్‌లు ఎంపిక చేయాలని కూడా మరో కండీషన్ పెట్టాడు.

ముగ్గురు మూడు టీమ్స్

బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ముందుగా శేఖర్ బాషా తాను యష్మీ గౌడ టీమ్‌లోకి వెళ్తున్నానని చెప్పాడు. ఆమెకు తన సీక్రెట్లు అన్నీ తెలుసు అని, తర్వాత ఏమీ ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. బేబక్క మాత్రం నిఖిల్ జట్టులోకి వెళ్లిపోయింది. ఇక, నబీల్ మాత్రం నైనిక తన బడ్డీ అని అందుకే ఆమె టీమ్‌ను ఎంచుకున్నాని అన్నాడు.

మణికంఠపై నిఖిల్ లవ్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో మొదటి వారంలోనే బాగా హైలైట్ అయిన వారిలో మణికంఠ ఒకడు. తన ఫ్లాష్‌బ్యాక్ స్టోరీతో తరచూ వార్తల్లో ఉంటోన్న అతడి కోసం చీఫ్‌లు ఎవరూ ముందుకు రారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా నిఖిల్ అతడిని తన జట్టులోకి తీసుకున్నాడు. చాలా ఇబ్బందుల్లో ఉన్న మణికంఠకు ఒక ఛాన్స్ ఇస్తున్నానని తన రీజన్‌ను కూడా చెప్పాడు.

విష్ణుప్రియకు బిగ్ షాక్

చాలా మంది కంటెస్టెంట్లు అయిపోయిన తర్వాత విష్ణుప్రియ వంతు వచ్చింది. కానీ, ఆమెను మాత్రం ఎవరూ తీసుకోడానికి ముందుకు రాలేదు. దీంతో బిగ్ బాస్ ఏం చెప్తాడా అని ఆమెతో పాటు కంటెస్టెంట్లు అందరూ చూశారు. ఆ సమయంలో నైనిక ఆమెను ఎంపిక చేసుకుంది. విష్ణుప్రియ పరిస్థితి చూసిన వాళ్లంతా 'ఆమె కంటే మణికంఠనే బెస్ట్', 'ఇది ఎలిమినేషన్‌తో సమానం' అనుకోకుండా ఉండరని చెప్పొచ్చు. మరి ఇప్పటి నుంచైనా విష్ణుప్రియ ఆటలో స్పీడ్ పెంచుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Read more about: bigg boss telugu 8 nainika
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X