యాక్సిడెంట్ చేసిన టీవీ హీరోయిన్-బాలుడి మృతి

కారు వెళ్లే సన్నివేశం చిత్రీకరిస్తుండగా, కారు అదుపు తప్పి పక్కనే పార్కులో ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా...అప్పటికే సాత్విక్ రెడ్డి అనే బాలుడు మరణించాడు. మరొక చిన్నారి సాత్విక కు కాలు, చెయ్యి ఫ్యాక్టర్ అయింది. జెమిని టీవీలో ఇంద్రాని సీరియల్ చిత్రీకరణ జరుగపుతుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లనే ఈ సంగటన చోటు చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. డ్రైవింగులో శిక్షణ లేకుండా కారు నడిపిన నటి అపర్ణ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కారు అదుపు తప్పిందని, తన తప్పేమీ లేదని, తప్పులేకున్నా డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధమని అపర్ణ వాదిస్తుండటంపై చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అనుమతి లేకుండా షూటింగ్ జరుపుతున్నారని పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











