జోష్ యాప్ కమ్యూనిటీలో మేఘన సునీల్ అదుర్స్.. కంటెంట్ క్రియేషన్‌లో టాప్ రేపుతున్న బాలనటి
ఇండియాలో మోస్ట్ ఎంగేజింగ్ షార్ట్ వీడియో యాప్‌గా ఘనతను సాధించిన జోష్ యాప్ కంటెంట్ క్రియేషన్ రంగంలో సరికొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్నది. సృజనాత్మక ఆలోచనలుతో అతి తక్కువ కలాలంలోనే కంటెంట్ క్రియేషన్ రంగంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఆడియెన్స్‌కి విభిన్నమైన వినోదాన్ని అందిస్తూ దూసుకెళ్లున్నది.
సృజనాత్మకత పుష్కలంగా ఉన్న ప్రతిభావంతులు తమకు తాము రాణించడానికి, గొప్ప పేరు సంపాదించుకోవడానికి జోష్ యాప్ చక్కటి వేదికగా నిలిచింది. గొప్ప సంస్థలు, సెలబ్రిటీలతో అనుసంధానం అవుతూ ప్రపంచ కంటెంట్ రంగాన్ని శాసిస్తూ.. దేశంలోనే నెంబర్ వన్ యాప్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నది.

దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిన జోష్ యాప్‌లో బాల నటి మేఘన సునీల్ అద్భుతమైన వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించుకొంటున్నారు. యూట్యూబర్‌గా, డ్యానర్స్ మల్టీ టాలెంటెడ్ మేఘన జోష్ తెలుగు కమ్యూనిటిలో టాప్ కంటెంట్ క్రియేటర్‌గా నిలిచారు.

జోష్ యాప్‌లో ఎవరూ ఊహించని విధంగా అతి తక్కువ సమయంలో మేఘన 1.5 మిలియన్ల మంది ఫ్యాన్స్‌తో, 8.5 మిలియన్ల మంది లైక్స్‌తో అందరి హృదయాలను దోచుకొంటున్నది. దక్షిణాది సూపర్ స్టార్ నాగార్జునతో కలిసి డాబర్ చవన్‌ప్రాష్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్; నిశ్చల్ ఎడ్యుకేషన్ యాడ్ ఫిల్మ్, ఇతర ప్రభుత్వ విద్యా రంగానికి సంబంధిన ప్రకటనల్లో మేఘన భాగస్వామ్యమైంది.

ఇక మేఘన విషయానికి వస్తే.. జీ తెలుగు టెలివిజన్ సీరియల్ గుండమ్మ కథలో గుండమ్మగా అందరికి సుపరిచితులైన మేఘన జోష్ యాప్ ద్వారా తన అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నారు. ఈ సీరియల్ ఉత్తమ సీరియల్ అవార్డును సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. వేదిక తెలుగు నంది అవార్డుల్లో మేఘన ఉత్తమ బాలనటిగా అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా ఇంకా పలు అవార్డులను దక్కించుకొన్నారు. ఇలా ప్రతిభను చాటుకొంటున్న మేఘన ప్రస్తుతం అలియెన్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవమరిస్తున్నారు. మేఘన ప్రతిభపై తెలుగు టీవీ అండ్ టెక్నిషియన్స్ అసోసియేషన్ ప్రశంసల వర్షం కురిపించింది.

విభిన్నమైన టాలెంట్‌తో దూసుకెళ్తున్న మేఘన సినీ రంగంలో కూడా విశేషంగా రాణిస్తున్నారు. విక్టరీ వెంకటేష్‌తో F3 చిత్రం, అలాగే ముఖ చిత్రం, గుండె కథ వింటాటా, 11: 11, హిడింబ చిత్రాల్లో నటిస్తున్నారు. చోటా పాకెట్ బడా ధమాకా అనే షార్ట్ ఫిలింలో కూడా నటించారు. ఇలా ఎన్నో విశేషాలతో టాలెంట్‌ను చాటుకొన్న మేఘన మరెన్నో విజయాలు, మైలురాళ్లను అధిగమించాలని కోరుకొందాం.




Click it and Unblock the Notifications











