కౌశల్ మా కళ్ళముందే పెరిగాడు.. గాజువాక భారీ సన్మానానికి ఏర్పాట్లు!
బిగ్ బాస్2 విజేతగా నిలిచిన కౌశల్ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. ఎవరూ ఊహించని విధంగా కౌశల్ కు అభిమాన గణం పెరిగిపోయింది. కౌశల్ ఆర్మీ పేరుతో కౌశల్ ఫాన్స్ అంతా గ్రూపుగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అభిమానుల సహకారంతోనే కౌశల్ సులువుగా బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. కౌశల్ కు భారీ సన్మానం జరగబోతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

మా కళ్ళముందే పెరిగాడు
కౌశల్ తో ఉన్న అనుబంధాన్ని విశాఖపట్నం గాజువాక వాసులంతా గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న కౌశల్ స్నేహితులు, సన్నిహితులు భారీ సన్మానానికి ఏర్పాట్లు చేస్తన్నారు. కౌశల్ తమ కళ్ళముందే పెరిగాడని గాజువాక వాసులు చెబుతున్నారు.

10వ తరగతి వరకు ఇక్కడే
కౌశల్ తండ్రి సుందరయ్య బీహెచ్ పీవీలో విశ్రాంత ఉద్యోగి. దీనితో కౌశల్ 10 వ తరగతి వరకు బీహెచ్ పీవీ స్కూల్ లోనే చదువుకున్నాడు. బీహెచ్ పీవీ కళావేదికపై కౌశల్ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. ఆ ఉత్సాహంతోనే సినీ రంగంలోకి, మోడలింగ్ లోకి ప్రవేశించాడు.

బిగ్ బాస్ విజేతగా
తమ కళ్ళముందు పెరిగిన కౌశల్ బిగ్ బాస్ విజేతగా నిలిచాడని, ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్నాడని కౌశల్ స్నేహితులు అంటున్నారు. కౌశల్ ఈ స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

పెరుగుతున్న అవకాశాలు
బిగ్ బాస్ తెచ్చిపెట్టిన క్రేజ్ తో కౌశల్ కు టాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. కౌశల్ బిగ్ బాస్ ముందు వరకూ కూడా పలు చిత్రాల్లో నటించాడు. కానీ కెరీర్ కు బ్రేక్ ఇచ్చే అవకాశం ఎదురుకాలేదు. దర్శక నిర్మాతలంతా కౌశల్ వైపు చూస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.


Click it and Unblock the Notifications











