కాపురాల్లో కలతలు సృష్టించే సీరియళ్లకు చెక్

ఇలాంటి పగప్రతీకారాల సీరియళ్లు మనదేశంలోనే కాదండోయ్.. పోయిపోయి చైనాలోనూ రీమేక్ అవుతున్నాయి. మనమంటే వేలంవెర్రిగా చూస్తున్నాంగానీ.. అక్కడ వీటివల్ల ఎవరో కీలకమైన అధికారులకే తిక్క రేగినట్టుంది. అందుకే.. ఇలాంటి సీరియళ్లను నిషేధిస్తూ ఏకంగా ఉత్తర్వులే జారీ అయిపోయాయి! అవును.. తిరుగుబాటు ప్రేరేపించే, కుటుంబాల్లో కలతలకు కారణమయ్యే విదేశీ రీమేక్ సీరియల్స్‌పై నిషేధం విధిస్తూ 'స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిలిం, రేడియో అండ్ టెలివిజన్' విభాగం ఆరు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రెండు రకాల సీరియల్స్‌పైనే కాదు.. ఆన్‌లైన్ నవలలు, గేముల ఆధారంగా తీసే సీరియళ్లపైనా వేటు పడింది.
మనదేశంలో పాపులర్ అయిన కొన్ని అత్తాకోడళ్ల ప్రతీకారాల సీరియళ్లు కూడా చైనాలో రీమేక్ అయిపోతున్నాయి. స్థానిక తారలను పెట్టి వాటిని రీమేక్ చేస్తున్నారు. తాజా ఆంక్షల నేపథ్యంలో మన సీరియల్స్ రీమేకులు కూడా చైనాలో ఆగిపోనున్నాయి.


Click it and Unblock the Notifications











