twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూరగాయలు అమ్ముతున్న చిన్నారి పెళ్లికూతురు డైరెక్టర్.. కోలుకోలేని దెబ్బ పడటంతో

    |

    కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించాయి. దాంతో రోజువారి సినీ కార్మికులు, నటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. రోజువారీ జీవితం గడిచే పరిస్థితులేని ఎందరో సినీ జీవులు కార్మికులుగా మారడం, కిరాణ షాపులు పెట్టుకొని బతకడం కనిపించింది. తాజాగా టెలివిజన్ దర్శకుడు సైకిల్‌పై కూరగాయలు అమ్ముతున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దర్శకుడు ఎవరంటే..

     కూరగాయలు అమ్ముతున్న సీరియల్ డైరెక్టర్.

    కూరగాయలు అమ్ముతున్న సీరియల్ డైరెక్టర్.

    దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన డైలీ సీరియల్‌ బాలిక వధూ (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు). ఈ చిత్రానికి దర్శకుడిగా రామ్ వ్రిక్ష గౌర్ వ్యవహరించారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడటంతో ఎవరిని సహాయం కోరలేక ఉత్తర ప్రదేశ్‌లోని ఆజామ్‌గఢ్ జిల్లాలో కూరగాయలు అమ్ముతూ కనిపించారు.

     లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక కష్టాలు

    లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక కష్టాలు

    లాక్‌డౌన్‌లో తన జీవితం ఎలా సమస్యల్లో కూరుకపోయిందనే విషయంపై గౌర్ వెల్లడిస్తూ.. ఓ సినిమా షూటింగ్ కోసం లొకేషన్స్ వెతకడంలో భాగంగా రెక్కి నిర్వహించేదుకు అజమ్ గఢ్‌కు వచ్చాను. ఆ సమయంలోనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అజమ్‌గఢ్ నుంచి తిరిగి వెళ్లడం సాధ్యం కాలేదు. ఈ లోపు నా వద్ద ఉన్న డబ్బు ఖర్చు అయిపోయింది. ముంబైకి వెళ్లే పరిస్థితి లేదు. సినిమా మొదలయ్యే అవకాశం కనిపించలేదు అని గౌర్ తెలిపారు.

     మరో ఏడాదిపాటు సినిమాలు మొదలయ్యే ఛాన్స్

    మరో ఏడాదిపాటు సినిమాలు మొదలయ్యే ఛాన్స్

    లాక్‌డౌన్ కారణంగా తాము ప్రారంభించాల్సిన ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. నిర్మాత ఇప్పట్లో సినిమాను ప్రారంభించడం సాధ్యం కాదని చేతులెత్తాశాడు. మరో ఏడాదిపాటు సినిమా పట్టాలెక్కే పరిస్థితిని లేదని చెప్పారు. దాంతో మా నాన్న వ్యాపారానికి సహాయం అందించాలని భావించాను. వెంటనే సైకిల్‌పై కూరగాయల వ్యాపారం మొదలపెట్టాను. నా కుటుంబానికి సంబంధించిన, నాకు తెలిసిన పనిని చేయడంలో ఎలాంటి తప్పు లేదనిపించింది అని గౌర్ చెప్పారు.

    Recommended Video

    Central Government intends to lift the lock-down restrictions
    నా స్నేహితుడి ద్వారా సినిమా పరిశ్రమలోకి

    నా స్నేహితుడి ద్వారా సినిమా పరిశ్రమలోకి

    సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడం గురించి గౌర్ తెలియజేస్తూ.. సినీ రచయిత షనావాజ్ ఖాన్ నాకు స్నేహితుడు. అతడి వల్లే నేను 2002లో ముంబైకి వెళ్లాను. అతడి ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను. లైట్ బాయ్‌గా పనిచేశాను. ఆ త్వాత టీవీ సీరియల్స్‌కు సంబంధించిన ప్రొడక్షన్ విభాగంలోకి మారాను. ఆ తర్వాత చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. బాలిక వధూ యూనిట్ డైరెక్టర్‌గా, ఎపిసోడ్ డైరెక్టర్‌గా పనిచేశాను అని రామ్ వ్రిక్ష గౌర్ తెలిపారు.

    రామ్ వ్రిక్ష గౌర్ కెరీర్ ఇలా

    రామ్ వ్రిక్ష గౌర్ కెరీర్ ఇలా

    బాలీవుడ్‌లో సునీల్ శెట్టి, రణ్‌దీప్ హుడా, రాజ్‌పాల్ యాదవ్, మిలింద్ గునాజీ, యష్‌పాల్ యాదవ్ నటించిన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఇప్పుడు ఓ భోజ్‌పురి, హిందీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం పనిచేస్తున్న సమయంలోనే లాక్‌డౌన్ విధించారు. నాకు ముంబైలో సొంత ఇల్లు ఉంది. త్వరలోనే ముంబైకి వెళ్లిపోతాను అని గౌర్ అన్నారు.

    English summary
    Chinnari Pellikuthuru (Popular Hindi serial Balika Vadhu) director Ram Vriksha Gaur becomes vegetable vendor. Gaur revealed that, He came to recce for a movie to his native place Azamgarh. Then lockdown was imposed and then it was not possible to return. I then decided to take on my father's business and started selling vegetables on a handcart.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X