God Father మూవీలో హైలైట్ అదే.. చిరంజీవి, నయనతార ఊహించని విధంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ.. అప్పటికీ, ఇప్పటికీ ఒకేలా సత్తా చాటుతూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చాలా కష్టనష్టాలను అనుభవించిన తర్వాత స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నారు. అయితే, మధ్యలో రాజకీయాల కోసం గ్యాప్ తీసుకున్న చిరంజీవి.. కొన్నేళ్ల క్రితమే 'ఖైదీ నెంబర్ 150' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఇక, అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలను లైన్‌లో పెట్టుుకుంటున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని సినిమాలను కూడా ప్రేక్షకులకు అందించిన ఆయన.. మరింత జోష్‌తో కనిపిస్తున్నారు.

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత యమ దూకుడు ప్రదర్శిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే 'ఆచార్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో కలెక్షన్లు అనుకున్న రీతిలో వసూలు కాలేదు. ఫలితంగా ఈ చిత్రం సుమారు రూ. 80 కోట్లకు పైగా నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా చిరంజీవి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే పలు సినిమాలను మొదలు పెట్టేశారు. అందులో 'గాడ్ ఫాదర్' మూవీ ఒకటి. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్‌ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా వస్తుంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులోకి అనువాదం చేస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ గత ఏడాదే మొదలైంది. అంతేకాదు, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసుకుంటోంది.

Chiranjeevi and Nayanthara Scenes Highlight in God Father Movie

'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవి చెల్లెలి పాత్ర గురించి ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ రోల్‌ను నయనతార పోషిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి - నయనతార కాంబినేషన్ సీన్స్ హైలైట్‌గా వచ్చాయట. ఇద్దరూ పోటీ పడి మరీ నటించారని తెలుస్తోంది. అంతేకాదు, ఒరిజినల్ మూవీలో కంటే ఇందులో అన్నా చెల్లి సెంటిమెంట్‌ను బలంగా చూపించారని సమాచారం. ఒకరకంగా చాలా గ్యాప్ తర్వాత చిరంజీవిని ఇందులో బాగా ఎమోషనల్‌గా చూపించారనే టాక్ వినిపిస్తోంది.

'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే శక్తిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X