హాట్ సీట్లో నాగ్‌తో చిరంజీవి: ప్రోమోల హల్‌చల్
హైదరాబాద్: మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో మెగాస్టార్ చిరంజీవి ఆగస్టులో కనిపించనున్నారు. నాగార్జునతో పాటు చిరంజీవి ఈ షోలో కనిపించనున్నారు. చిరంజీవితో నాగార్జున మాట్లాడుతున్న ఈ టీవీ షోకు సంబధించిన ప్రోమోలను నిర్మాతలు ప్రసారం చేస్తున్నారు. ఇవి మాటీవీలో హల్‌చల్ చేస్తున్నాయి.
నాగార్జున, చిరంజీవి మంచి మిత్రులు కావడమే కాకుండా వ్యాపార భాగస్వాములు కూడా. ఈ స్నేహాన్ని మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో చూడవచ్చు. నాగార్డున చిరంజీవిని ఈ షోలో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవితో మల్టీస్టారర్‌తో తాను నటించడానికి ఇష్టాన్ని నాగార్జున వ్యక్తం చేసినట్లు కూడా చెబుతున్నారు. దీనికి చిరంజీవి ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసుకోవడానికి ఆగక తప్పడు. మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో గెస్ట్‌గా చిరంజీవి కనిపించనున్నారు.
ఇటీవల ఈ షోలో రానా గెస్ట్‌గా కనిపించారు. పలువురు హీరోయిన్లు, హీరోలు కూడా అలా ఈ షోలో కనిపించారు. రానాకు నాగార్డున కాస్తా క్లిష్టమైన ప్రశ్నలు వేశారు. కాకతీయ పాలనకు సంబంధించిన చారిత్రక ఘట్టాల గురించి రానాను ఆయన ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











