దివి వద్యా ముద్దులు..గుండెల్లో దాచుకొన్న చిరంజీవి..నీ ఆ యాంగిల్‌లో చూస్తున్నా అంటూ మెగాస్టార్ బంపర్ ఆఫర్

బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే కన్నుల పండువగా ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా రావడంతో వేదిక మొత్తం వైబ్రెంట్‌గా మారిపోయింది. ఇంటి సభ్యులందరితో మాట్లాడుతూ తనదైన శైలిలో రొమాంటిక్‌గా, ఫన్‌గా కనిపించారు. వేదిక మీద నాగ్ సహాయంతో ఇంటి సభ్యుల్లో జోష్ పుట్టించారు. ఇక ఇంటి సభ్యుల్లోని దివి వద్యాతో చిరంజీవి మాట్లాడూతూ...

రొమాంటిక్ మూడ్‌లో చిరంజీవి

రొమాంటిక్ మూడ్‌లో చిరంజీవి

బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్లతో ముచ్చటిస్తూ.. దివి వద్యా వద్దకు రాగానే చిరంజీవి ఓ రకంగా మెలికలు తిరిగారు. దివి అంటూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లాడు. వేదిక మీద నాగ్‌తో పోటీ పడుతూ కంటెస్టెంట్లను నవ్విస్తూ ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారు. దివి గురించి చెబుతూ.. నీ నడవడిక, ప్రవర్తన చూసిన తర్వాత మా టీం సభ్యులు నీ గురించి బాగా చెప్పారు అంటూ చిరంజీవి తెలిపారు.

మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వేదాళం రీమేక్

మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వేదాళం రీమేక్

త్వరలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్‌లో నటిస్తున్నాను. ఆ చిత్రంలో దివి వద్యాకు ఏదైనా క్యారెక్టర్ ఇద్దామని అనుకొన్నాం. అప్పటికే నటీనటులు ఎంపిక పూర్తి కావడం జరిగింది. అయితే అప్పటి వరకు తెలుగు సినిమాల్లో ప్రామినెంట్ పాత్రను పోషించలేదు. కొన్ని సినిమాల్లో చేసింది కానీ ఇంకా ప్రూవ్ కాలేదు. ఏమిద్దామని ఆలోచిస్తుండగా ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇద్దామని యూనిట్ సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు.

చిరంజీవి పక్కన దివి వద్యా‌కు ఆఫర్

చిరంజీవి పక్కన దివి వద్యా‌కు ఆఫర్

అయితే దివి లాంటి అమ్మాయికి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరా? నేను మరో యాంగిల్‌లో చూస్తున్నాను. కానీ మీరు పోలీస్ ఆఫీసర్ అంటే నాకు నచ్చడం లేదు. అలాంటి పాత్రలకు పరిమితం చేయకు. సరే మరో యాంగిల్ గురించి మరోసారి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కార్యెక్టర్‌తో సరిపెడుదాం అంటూ దివికి చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చారు.

మరో తొమ్మిది నెలల్లో స్టార్ట్ అంటూ

మరో తొమ్మిది నెలల్లో స్టార్ట్ అంటూ

వేదాళం సినిమా షూటింగ్ మరో ఎనిమిది, తొమ్మిది నెలల్లో స్టార్ట్ కాబోతున్నది. అప్పుడు మనం సెట్లో కలుసుకొందాం. అప్పటి వరకు వేచి చూద్దాం అంటూ చిరంజీవి కామెంట్ చేశాడు. దివి వద్యా థ్యాంక్యూ సార్ అంటూ ఇచ్చిన ఫ్లయింగ్ కిస్‌ను చిరంజీవి స్టైలిష్‌గా గుండెలో దాచుకొంటూ వేదిక మీద కనిపించారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
చిరంజీవికి దివి వద్యా ఫ్లయింగ్ కిస్

చిరంజీవికి దివి వద్యా ఫ్లయింగ్ కిస్

మహర్షి చిత్రంలో మహేష్ బాబు పక్కన చిన్న పాత్రలో నటించిన దివి వద్యా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయం, ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొన్నది. అయితే కొన్ని కారణాల వల్ల బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. అయితే బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత దివికి మంచి ఆఫర్లు దక్కుతున్నాయి. తాజాగా అఫీషియల్‌గా వేదాళం రీమేక్‌లో దివికి మంచి పాత్రను ఇచ్చినట్టు చిరంజీవి వెళ్లడించడం విశేషంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X