టాలీవుడ్‌లో ఆయనే లెజెండ్.. నువ్వు అంతటి వాడివి అవుతావు: ఆ కంటెస్టెంట్‌పై చిరు ప్రశంసలు
తెలుగులో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. ఈ ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో నాలుగో సీజన్ కూడా పూర్తయింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరిగాయి. అందుకే ప్రేక్షకులు దీన్ని ఆదరించారు. ఫలితంగా ఈ సీజన్ కూడా విజయవంతం అయింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు ఆశ్చర్యకర విషయాలు కొన్ని బయట పెట్టారు. అదే సమయంలో ఓ కంటెస్టెంట్‌ను టాలీవుడ్‌లో గొప్పవాడివి అవుతావు అంటూ ప్రశంసించారు. ఆ వివరాలు మీకోసం!

డ్యాన్స్‌లు... సాంగ్స్... ప్రముఖుల ఆటలు
బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఎపిసోడ్‌ను కూడా అక్కినేని నాగార్జున తనదైన శైలిలో హోస్ట్ చేశారు. మాజీ కంటెస్టెంట్లు అందరూ దీనికి హాజరవడంతో పాటు డ్యాన్స్ కూడా చేశారు. ఆ తర్వాత హీరోయిన్లు లక్ష్మీ రాయ్, మెహ్రీన్, ప్రణీత డ్యాన్స్, థమన్ మ్యూజిక్ కాన్సర్ట్, అనిల్ రావిపూడి కామెడీతో ఎపిసోడ్ సందడిగా సాగింది.

విన్నర్ విషయంలో అనుకున్నదే జరిగింది
బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ విషయంలో మొదటి నుంచీ అనుకున్నట్లుగానే ఫలితం వచ్చింది. అందరూ అనుకున్నట్లుగానే ఈ సీజన్‌ను వివాదరహితుడిగా పేరొందిన యంగ్ హీరో, మిస్టర్ కామ్ అండ్ కూల్ అభిజీత్ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫినాలే ఎపిసోడ్‌లో నాగార్జున విన్నర్‌ను ప్రకటించగా... ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి అతడికి ట్రోఫీని అందజేశారు.

ఆశ్చర్య పరిచిన మెగాస్టార్ చిరంజీవి తీరు
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా హవాను చూపిస్తూ పరిశ్రమ మొత్తానికి బిగ్ బాస్ అనిపించుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం జరిగిన బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. కొందరిపై వరాల జల్లు కురిపించడంతో పాటు కామెడీని పంచుతూ అందరిలో జోష్‌ను నింపారు.

అందరి గురించి చెబుతూ ఆకట్టుకున్నారు
మూడో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలి మేనరిజంతో అలరించారు. ప్రతిరోజూ బిగ్ బాస్ చూసినట్లు అందరి గురించి నిజాలు చెప్పారు. ఇప్పుడు అదే కొనసాగించారాయన. ఆదివారం జరిగిన ఫినాలేలో అందరు కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే కొందరిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు అనిపించింది.

ఆ కంటెస్టెంట్‌పై మెగాస్టార్ ప్రశంసల వర్షం
జబర్ధస్త్ ద్వారా మంచి గుర్తింపు అందుకుని బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు ముక్కు అవినాష్. తాజాగా జరిగిన ఫినాలే ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి.. అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. షోలో ఎంతగానో ఆకట్టుకున్నావని, బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నావని కితాబిచ్చారు. అలాగే, అవినాష్ కోపంపై పంచులు కూడా విసిరారాయన.
Recommended Video

ఆయనే లెజెండ్.. నువ్వు అంతటి వాడివి
అవినాష్ భవిష్యత్ గురించి మాట్లాడుతూ.. ‘తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజబాబు గారు లెజెండరీ కమెడియన్. నువ్వు కూడా అంతటి వాడివి కావాలని మనసారా కోరుకుంటున్నా. నీకు ఆ సత్తా ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నా' అని కామెంట్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా గట్టిగా కేకలు పెట్టారు. ఈ ప్రశంసకు ఎమోషనల్ అయిన అవినాష్.. థ్యాంక్స్ అన్నయ్య అంటూ మోకరిల్లాడు.


Click it and Unblock the Notifications











