తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు కష్టం.. కన్నడ టీవీ నటుడు షాకింగ్ కామెంట్స్!
తెలుగు బుల్లితెరపై కన్నడ నటినటుల హవా ఎక్కువవుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు నటీనటులు. తెలుగు టెలివిజన్ సీనియర్ నటుడు కౌశిక్ సినిమా ఇండస్ట్రిలో కన్నడ నటినటులే ఎక్కువగా ఎందుకు ఉన్నారు? అనే ప్రశ్నకు రీసెంట్ గా ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కేవలం పని మనిషి పాత్రలే తెలుగు నటీనటులు మిగిలి ఉన్నాయి అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కన్నడ ఇండస్ట్రీ నుంచి హీరోగా తెలుగు బుల్లితెరపై అడుగు పెట్టిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి హీరో రఘు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.
కన్నడ నటుడు రఘు తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు తెలుగు ఇండస్ట్రిలో అవకాశం ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు అనే విషయాలపై ఓ ఇంటర్వ్యూలో చర్చ జరిగింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రఘు తను టెలివిజన్ రంగంలోకి ఎలా అడుగు పెట్టారో వెల్లడించారు. అసలు ఇలా ఈ ఫీల్డ్ లోకి తాను ఎంట్రీ ఇస్తాను అనుకోలేదన్నారు.

మధ్యలో కన్నడ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడంతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మంచి పాత్రలే పోషించాడు. సినిమానే చెయ్యాలి అని తను ఎప్పుడూ అనుకోలేదని, కానీ అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా వివరించారు రఘు. మరి తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్ ఇంకా ఎవరైనా ఇచ్చారా? అనే ప్రశ్నకు తనకు ఇంకా ఇక్కడ ఎలాంటి ఆఫర్లు రాలేదని, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ స్టార్ట్ అయ్యి ఇంకా మూడు నాలుగు నెలలే అవుతుందని గుర్తు చేశారు.

ఏదైనా ఒక ఇండస్ట్రీలో నటుడిగా స్థిరపడి అందరికీ దగ్గర అవ్వాలంటే కనీసం ఏడాది పడుతుందని, ఆ తర్వాతే అవకాశాలు వస్తాయని వెల్లడించారు. అలాగే తనకు కూడా ఏడాది తర్వాత అవకాశాలు వస్తాయేమో చూడాలి అంటూ తెలుగు ఇండస్ట్రీపై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక కన్నడలో బిగ్ హిట్స్ ఉన్నప్పటికీ తెలుగులోకి రావాలని ఎందుకు అనిపించింది? అనే ప్రశ్నకు రఘు స్పందిస్తూ నిజానికి తెలుగులోకి కూడా రావాలని అనుకోలేదని, కన్నడలో సీరియల్ అయిపోగానే ఇమ్మిడియట్ గా ఇక్కడ ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చారు.
తాను అస్సలు ఫ్యామిలీకి దూరంగా ఉండలేనని, ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్తే వాళ్ళు ధైర్యం చెప్పి పంపించారని చెప్పుకొచ్చారు రఘు. కాగా ప్రస్తుతం తెలుగులో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ బాగానే సాగుతూ ఉండడంతో, అందులో హీరోగా నటిస్తున్న రఘుకు కూడా నటుడిగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది.


Click it and Unblock the Notifications











