మెగాస్టార్ చిరంజీవితో క్లోజ్ చేస్తున్నారు (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ షోను అద్భుతంగా నడిపిస్తున్న అక్కినేని నాగార్జునతో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిథిగా 40వ ఎపిసోడ్ ప్రేక్షకులకు కన్నుల పండువ కాబోతోంది. ఈ ఇద్దరు స్టార్స్ తెలుగు టెలివిజన్ తెరపై కలిసి కనిపించడం చాలా అరుదు.

వీరిద్దరూ పాల్గొన్న ఆ అపురూప సందర్భం 'మీలో ఎవరు కోటీశ్వరు' 40వ ఎపిసోడ్ లో ప్రేక్షకులు అనుభూతి చెందబోతున్నారు. మాటీవీలో ఆగస్టు 7 (గురువారం) రాత్రి 9 గం.లకు ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఫస్ట్ సీజన్ ఈ అద్భుతమైన కలయికతో ముగుస్తుంది. ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఆదరించి ఆశీర్వదించిన ప్రేక్షకుల కోసం సెకండ్ సీజన్ త్వరలోనే ప్రారంభమవుతుందని 'మీలో ఎవరు కోటీశ్వరుడు' వాద్దానం చేస్తోంది.

చిరంజీవికి నాగార్జున ఆహ్వానం

చిరంజీవికి నాగార్జున ఆహ్వానం


మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమో కూడా విడుదలైంది. అందులో నాగార్జున చిరంజీవిని ఇలా ఆహ్వానిస్తున్నారు.

చిరంజీవితో మంచి అనుబంధం

చిరంజీవితో మంచి అనుబంధం


చిరంజీవితో నాగార్జునకు ముందు నుండి మంచి అనుబంధం ఉంది.

ఆడియన్స్ కు చిరంజీవి సెల్యూట్

ఆడియన్స్ కు చిరంజీవి సెల్యూట్


మీలో ఎవరు కోటీశ్వరుడు షో చూస్తున్న ఆడియన్స్ కు సెల్యూట్ చేస్తున్న చిరంజీవి

చిరంజీవి నాగార్జున

చిరంజీవి నాగార్జున


చిరంజీవి, నాగార్జున ఈ షో ద్వారా ప్రేక్షకులను అలరించనున్నారు.

చిరంజీవి, నాగార్జున కన్వర్జేషన్

చిరంజీవి, నాగార్జున కన్వర్జేషన్


చిరంజీవి, నాగార్జున మధ్య సాగే సంబాషణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది.

హాట్ సీట్లో...

హాట్ సీట్లో...


చిరంజీవిని హాట్ సీట్లో కూర్చోవాలని ఆహ్వానిస్తున్న నాగార్జున.

హాట్ సీట్లో చిరంజీవి

హాట్ సీట్లో చిరంజీవి


హాట్ సీట్లో కూర్చున్న తర్వాత చిరంజీవి ఇలా ఆనందం వ్యక్తం చేసారు.

నాగార్జున ప్రశ్నలు

నాగార్జున ప్రశ్నలు


మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో భాగంగా చిరంజీవికి నాగార్జున పలు ప్రశ్నలు సంధించారు.

ఆత్మీయ ఆలింగనం

ఆత్మీయ ఆలింగనం


చిరంజీవి, నాగార్జున మధ్య ఆత్మీయ ఆలింగనం ఇలా...

ఆడియన్స్ చీర్స్...

ఆడియన్స్ చీర్స్...


మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పాల్గొన్న ఆడియన్స్ ఇలా చీర్స్ కొట్టారు.

భారతదేశమంతటా 'కౌన్ బనేగా కరోడ్ పతి'(కెబిసి)గా ఈ గేమ్ షో ఫార్మాట్ ప్రాచుర్యం పొందినా మాటీవీ నిర్వహించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సామాన్యుడి కలలను నిజం చేస్తూ, జీవితానుభవాలను ప్రతిభింబిస్తూ...జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొని నిలదొక్కుకున్న ఎందరివో బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత సాధించింది.

మీలో ఎవరు కోటీశ్వరుడు కేవలం భారత దేశంలోనే కాదు విదేశాల్లోని తెలుగు వారిలో వయసులతో సంబంధం లేకుండా, సాఘీక ఆర్థిక పరిస్థితులకు అతీతంగా ప్రతి ఒక్కరికీ దగ్గరైంది. జూన్ 9న ప్రారంభమైన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో ప్రజాదరణ సంచలనం రేపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాలలో ట్యామ్ మానిటరింగ్ లెక్కల ప్రకారం మొత్తం 1.74 కోట్ల టీవీ వ్యూయింగ్ యూనివర్స్ అయితే ఈ షో 1.38 కోట్ల మందికి చేరింది. టెలివిజన్ కార్యక్రమాల్లో అత్యున్నతంగా రీచ్ సాధించిన షో ఇదే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X