Bigg Boss: మరో కంటెస్టెంట్‌కు చిరంజీవి భారీ ఆఫర్.. కల నిజమైందంటూ బిగ్ బాస్ భామ పోస్ట్

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ఆ వెంటనే టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాను ప్రారంభించి.. ఈ మధ్యనే దాన్ని పూర్తి చేసేశారు. ఇది ప్రేక్షకుల ముందుకు రాకుండానే మెగాస్టార్ మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. ఇప్పుడు వాటినే ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా చేస్తూ వస్తున్నారు. ఇలా ఈ సీనియర్ హీరో తీరిక లేకుండా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తన సినిమా కోసం చిరంజీవి.. మరో బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం!

ఆచార్యతో రెడీగా ఉన్న చిరంజీవి

ఆచార్యతో రెడీగా ఉన్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కాంబినేషన్‌లో నటించిన చిత్రం 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

వరుస సినిమాలు... అది మాత్రం

వరుస సినిమాలు... అది మాత్రం

'ఆచార్య' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్'తో పాటు కేఎస్ రవీంద్ర/బాబీ తెరకెక్కిస్తోన్న ఓ చిత్రం ఉన్నాయి. వీటితో పాటు వేదాళం మూవీకి రీమేక్‌గా తెరకెక్కనున్న 'భోళా శంకర్' కూడా ఉంది. దీన్ని ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ తీస్తున్నాడు.

భోళా శంకర్ అలా వస్తున్నాడుగా

భోళా శంకర్ అలా వస్తున్నాడుగా

సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో పూర్తి స్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న 'భోళా శంకర్' సినిమాలో హీరో సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం సమకూర్చుతున్న విషయం తెలిసిందే.

శరవేగంగా జరుగుతోన్న షూటింగ్

శరవేగంగా జరుగుతోన్న షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ దిగ్విజయంగా పూర్తైందని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఇందులో ఓ భారీ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ గ్రాండ్ సాంగ్‌ను కూడా పూర్తి చేసినట్లు తెలిపింది. అలాగే, రెండో షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే మొదలు పెట్టేసినట్లు కూడా వెల్లడించింది.

బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు అవకాశం

బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు అవకాశం


ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీని శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. ఇందులో ఎంతో మంది పరిచయం ఉన్న నటీనటులను తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి పేర్లను కూడా ప్రకటించారు. అలాగే, బిగ్ బాస్ కంటెస్టెంట్ లోబో కూడా ఇందులో నటిస్తున్నాడు. అతడి పాత్ర చిరంజీవి పక్కనే ఉంటుందని చెప్పాడు.

మరో కంటెస్టెంట్‌కూ చిరు ఆఫర్

మరో కంటెస్టెంట్‌కూ చిరు ఆఫర్

క్రేజీ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవిని గతంలో ఎన్నడూ చూడనంత మాస్‌గా చూపించబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఇందులో మాస్ నెంబర్‌లను కూడా పెడుతున్నారట. అందుకే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆనీ మాస్టర్‌కు కొరియోగ్రాఫర్‌గా ఆఫర్ ఇచ్చారట చిరంజీవి.

నా కల నిజమైంది అంటూ పోస్ట్

నా కల నిజమైంది అంటూ పోస్ట్

చాలా కాలంగా టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా ఉన్న ఆనీ మాస్టర్ చాలా చిత్రాలకు పని చేసింది. ఈ క్రమంలోనే 'భోళా శంకర్' ఆఫర్‌ను అందుకుంది. దీంతో ఆమె 'భోళా శంకర్ మూవీలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. చిరంజీవి గారితో పని చేసే అవకాశం కల్పించి నా కల నిజం చేసిన మెహర్ రమేష్ సార్‌కు థ్యాంక్స్' అంటూ తన ఆనందాన్ని పంచుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X