twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ స్టేజ్‌పై ఆమెకు ప్రపోజ్ చేసిన చిరంజీవి.. సుదీర్ఘ అనుబంధం ఉందంటూ కామెంట్

    |

    తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. అందుకే ఇక్కడ మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో నాలుగోది కూడా పూర్తయిపోయింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తనదైన మేనరిజమ్‌తో అందరికీ మజాను పంచిన ఆయన.. ఓ లేడీ కంటెస్టెంట్‌కు ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశారు. అంతేకాదు, దానితో సుదీర్ఘ అనుబంధం ఉందంటూ కామెంట్ చేశారు. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? పూర్తి వివరాలు మీకోసం!

    ఫినాలే స్టేజ్‌పై తళుక్కుమన్న తారలు

    ఫినాలే స్టేజ్‌పై తళుక్కుమన్న తారలు

    బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. దీంతో ముగింపు కూడా అదే రీతిలో ఉండాలని గ్రాండ్ ఫినాలేను డిజైన్ చేశారు. ఇందులో భాగంగానే ఆదివారం జరిగిన ఎపిసోడ్‌ సందడిగా సాగింది. మాజీ కంటెస్టెంట్లు, హీరోయిన్లు లక్ష్మీ రాయ్, మెహ్రీన్, ప్రణీత డ్యాన్స్‌లతో అలరించగా.. థమన్ మ్యూజిక్ కాన్సర్ట్‌, అనిల్ రావిపూడి అప్పీరెన్స్ అదరగొట్టేసింది.

     బిగ్ బాస్ విన్నర్‌గా మిస్టర్ కూల్ అభి

    బిగ్ బాస్ విన్నర్‌గా మిస్టర్ కూల్ అభి

    ఈ సీజన్‌లో ఆరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్‌లు టాప్ - 5లోకి వచ్చారు. వీరిలో ఎవరు గెలుస్తారన్న దానిపై అందరిలో మొదటి నుంచీ ఒకే అభిప్రాయం ఉంది. అందుకు తగ్గట్లుగానే ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో అభిజీత్ గెలుపొందాడు. దీంతో అతడికి బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ. 25 లక్షల ప్రైజ్ మనీ సొంతమైంది.

    మైమరపించిన గెస్ట్ చిరంజీవి మేనరిజం

    మైమరపించిన గెస్ట్ చిరంజీవి మేనరిజం

    సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. గత సీజన్ ఫినాలేకు గెస్టుగా వచ్చిన ఆయన.. ఆదివారం జరిగిన బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆద్యంతం ఆయన అద్భుతమైన మేనరిజంతో ఆకట్టుకున్నారు. ఇదే ఎపిసోడ్‌లో కొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లపై వరాల జల్లు కురిపించారు చిరు.

    అందరితో మాట్లాడి.. అభిప్రాయాలు చెప్పి

    అందరితో మాట్లాడి.. అభిప్రాయాలు చెప్పి

    ఫినాలే ఎపిసోడ్ చివర్లో మెగాస్టార్ చిరంజీవి హైలైట్ అయ్యారు. గ్రేస్‌ఫుల్ స్టెప్ వేస్తూ ఎంట్రీ ఇచ్చిన అయన.. ఆ తర్వాత అదిరిపోయే టైమింగ్‌తో మెప్పించారు. అంతేకాదు, ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ను దగ్గర నుంచి చూసినట్లు వాళ్లపై అభిప్రాయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే కొందరి సీక్రెట్లు కూడా బట్టబయలు చేశారు. అలాగే, పలువురికి కాంప్లిమెంట్లు ఇచ్చి ఉత్సాహ పరిచారు.

    స్టేజ్‌పై ఆమెకు ప్రపోజ్ చేసేసిన చిరంజీవి

    స్టేజ్‌పై ఆమెకు ప్రపోజ్ చేసేసిన చిరంజీవి

    బిగ్ బాస్ స్టేజ్‌పై ఉన్న సమయంలో హోస్ట్ అక్కినేని నాగార్జున.. ముందుగా టాప్ - 5 కంటెస్టెంట్లను మెగాస్టార్ చిరంజీవికి పరిచయం చేశారు. అలా ఒక్కొక్కరు అయిపోయిన తర్వాత చివర్లో దేత్తడి హారిక వంతు వచ్చింది. అప్పుడు ఆమె గురించి చెప్పొద్దని నాగార్జునను ఆపిన చిరు.. తెగ సిగ్గు పడిపోయారు. ఆ సమయంలో ‘ఐ లవ్ యూ ఓ హారిక' తన పాటను ప్లే చేయించి షాకిచ్చారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
    సుదీర్ఘ అనుబంధం ఉందంటూ కామెంట్

    సుదీర్ఘ అనుబంధం ఉందంటూ కామెంట్

    చిరంజీవి నటించిన ‘ఛాలెంజ్' సినిమాలో హీరోయిన్ పేరు హారిక. దానిపై ఉన్న పాటను దేత్తడి హారిక కోసం పాడిన చిరంజీవి.. దీనితో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు.. దీంతో ఆనందంతో పొంగిపోయింది దేత్తడి భామ. అలా కాసేపు అలరించిన మెగాస్టార్ చిరంజీవి.. ‘నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చి ఉన్నత స్థాయికి వెళ్లాలని మనసారా కోరుకుంటున్నా' అంటూ హారికను ఆశీర్వదించారు.

    English summary
    Bigg Boss is the Telugu language version of the reality TV series Bigg Boss, which itself is an adaptation of the Dutch series Big Brother. It airs on Star Maa and streams on digital platform Hotstar. Season 1 was hosted by Jr NTR premiered on 16 July 2017.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X