twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's EMK Sept 22th Show: ఎన్టీఆర్‌ను ఆకట్టుకొన్న కరీంనగర్ ఎక్సైజ్ ఆఫీసర్.. చివరకు ఎంత గెలిచాడంటే?

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మరో కంటెస్టెంట్ అద్బుతమైన ప్రతిభను చాటారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన కే చిరంజీవి ఉన్నత చదువులు చదవి ఎక్సైజ్ శాఖలో ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో తనదైన శైలిలో రాణించారు. 640000 గెలుచుకొన్న ఆయన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేక వెనుదిరిగాడు. ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ కోసం ప్రశ్న ఇదే..

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ కోసం ప్రశ్న ఇదే..

    ఒక కప్పు కాఫీ తయారీకి అవసరమయ్యే పద్దతిని వరుస క్రమంలో అమర్చండి

    A) గింజలు దంచడం
    B) పండ్లను తుడవడం
    C) మొక్క పెంచడం
    D) కాచడం

    Answer: C, B, A, D

    పైన ఇవ్వబడిన ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నకు అతివేగంగా చిరంజీవి సమాధానం చెప్పారు. కేవలం 4.5 సెకన్లలో జవాబు చెప్పడంతో హాట్ సీట్‌ మీదకు చేరుకొన్నారు. చిరంజీవికి ఎన్టీఆర్ స్వాగతం చెప్పడంతో ఆటను ప్రారంభించారు. కొంపెల్లి చిరంజీవి సిద్దిపేటకు చెందిన కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నారు.

    1000 రూపాయల ప్రశ్న మీకోసం

    1000 రూపాయల ప్రశ్న మీకోసం

    వీటిలో కుల్ఫీ అనేది దేనిలో ఒక రకం?
    a) ఐస్ క్రీం
    b) బిర్యానీ
    c) రైస్
    d) రోటి

    Answer: ఐస్ క్రీం

    2000 రూపాయల ప్రశ్న మీకోసం

    2000 రూపాయల ప్రశ్న మీకోసం

    ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంకెల మొత్తాన్ని కలిపి చెప్పడాన్ని ఏమంటారు
    a) గుణకారము
    b) భాగహారము
    c) కూడిక
    d) తీసివేత

    Answer: కూడిక

    3000 రూపాయల ప్రశ్న మీకోసం

    3000 రూపాయల ప్రశ్న మీకోసం

    వీటిలో ఏ వాయిస్ అసిస్టెంట్ యొక్క పేరుకు తెలుగులో సంపద అనే అర్ధం కూడా వస్తుంది?
    a) అలెక్సా
    b) సిరి
    c) కొరానా
    d) సీలియా

    Answer: సిరి

    5000 రూపాయల ప్రశ్న మీకోసం

    5000 రూపాయల ప్రశ్న మీకోసం

    సంప్రదాయంగా భారతీయ వేణువును దేనితో తయారు చేస్తారు?
    a) రాయి
    b) వెదురు
    c) పైబర్ గ్లాస్
    d) గాజు

    Answer: వెదురు

    10000 రూపాయల ప్రశ్న మీకోసం

    10000 రూపాయల ప్రశ్న మీకోసం

    ఇన్సిసార్లు, కెనైన్స్, మోలార్లు వీటిలో ఏ రకాలు?
    a) కణజాలాలు
    b) కండరాలు
    c) పళ్లు
    d) ఎముకలు

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో చిరంజీవి లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. ఆడియెన్స్ పోల్ ఆప్షన్ ఉపయోగించుకోవడంతో ప్రేక్షకులు పళ్ళుకు ఎక్కువ మంది ఓటు వేశారు. దాంతో ఆయన కూడా పళ్ళు ఆప్షన్ ఎంచుకొన్నారు. దాంతో ఆ సమాధానం కరెక్ట్ కావడంతో 10000 గెలుచుకొన్నారు.

    Answer: పళ్లు

    20000 రూపాయల ప్రశ్న మీకోసం

    20000 రూపాయల ప్రశ్న మీకోసం

    ఈ ఒలంపిక్ ఆటలలో అన్ని వేళలా గ్లవ్స్ ధరించాల్సిన ఆట ఏది?
    a) బాడ్మింటన్
    b) బాక్సింగ్
    c) స్విమ్మింగ్
    d) టెన్నిస్

    Answer: బాక్సింగ్

    40000 రూపాయల ప్రశ్న మీకోసం

    40000 రూపాయల ప్రశ్న మీకోసం

    ఈ వీడియో క్లిప్‌లో మహాదృష్ణ పాత్రను పోషించిన నటుడు ఎవరు?
    a) రావు గోపాలరావు
    b) కోట శ్రీనివాసరావు
    c) సాయి కుమార్
    d) అమ్రీష్ పురి

    Answer: అమ్రీష్ పురి

    80000 రూపాయల ప్రశ్న మీ కోసం

    80000 రూపాయల ప్రశ్న మీ కోసం

    FSSAI అనే భారతీయ సంస్థ దేని భద్రత మరియు నియంత్రణకు సంబంధించినది?
    a) ఇంధనం
    b) ఎరువు
    c) ఆహారం
    d) ఫ్యాషన్

    Answer: ఆహారం

    160000 రూపాయల ప్రశ్న మీ కోసం

    160000 రూపాయల ప్రశ్న మీ కోసం

    నావికులను మార్గనిర్దేశకంగా ఉపయోగపడే పోలారిస్ నక్షత్రాన్ని భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఏ పేరుతో పిలుస్తారు?
    a) అశ్విని
    b) రోహిణి
    c) అరుంధతి
    d) ధ్రువ

    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో చిరంజీవి తన రెండో లైఫ్‌ను ఉపయోగించుకొనేందుకు సిద్దపడ్డారు. ఆయన వీడియో కాలర్ లైఫ్ లైన్ ఉపయోగించుకొన్నారు. తన స్నేహితుడికి ఫోన్ చేసి ప్రశ్నను వినిపించారు. అయితే ధ్రువ సమాధానంపై అనుమానం ఉండటంతో చిరంజీవి 50:50 ఉపయోగించుకొన్నారు. స్క్రీన్‌పై అశ్విని, ధ్రువ మిగిలాయి. ధ్రువ సమాధానం చెప్పి 160000 గెలుచుకొన్నారు.

    Answer: ధ్రువ

    320000 రూపాయల ప్రశ్న కోసం

    320000 రూపాయల ప్రశ్న కోసం

    వీరిలో స్వాతంత్ర్య భారతదేశానికి న్యాయశాఖ మంత్రి ఎవరు?
    a) బీఆర్ అంబేద్కర్
    b) సర్దార్ వల్లభాయ్ పటేల్
    c) జవహర్ లాల్ నెహ్రూ
    d) రాజేంద్ర ప్రసాద్

    Answer: బీఆర్ అంబేద్కర్

    పై ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడంతో ఎన్టీఆర్ చెక్ రాసి తన వద్ద పెట్టుకొన్నారు.

    640000 రూపాయల ప్రశ్న కోసం

    640000 రూపాయల ప్రశ్న కోసం

    ఆగస్టు 2021లో వీటిల దేనిని లద్దాఖ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించారు?
    a) మంచు చిరుతపులి
    b) హంగుల్
    c) కృష్ణ జింక
    d) హిమాలయన్ ధార్

    Answer: మంచు చిరుతపులి

    Recommended Video

    Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
    120000 రూపాయల ప్రశ్న కోసం

    120000 రూపాయల ప్రశ్న కోసం

    విరాట్ కోహ్లీ ఏ క్రికెట్ జట్టుతో తన మొదటి సీనియర్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడారు?
    a) బంగ్లాదేశ్
    b) వెస్ట్ ఇండీస్
    c) ఆస్ట్రేలియా
    d) శ్రీలంక

    పై ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడంతో ఆయన గేమ్ నుంచి క్విట్ అవ్వాలని నిర్ణయించుకొన్నారు. దాంతో 640000 గెలుచుకొని గేమ్ నుంచి వైదొలిగారు.

    Answer: శ్రీలంక

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show September 22nd Episode: Karim Nagar's Excise inspector K Chiranjeevi participated in EMK. He won the 640000 in the game.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X