»   » మెగాస్టార్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు-4’ క్లోజ్ అయింది!... నెక్ట్స్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు-4’ క్లోజ్ అయింది!... నెక్ట్స్ ఎవరో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా మాటీవీలో కొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీజన్ 4 ముగిసింది. బుధవారం (మే 24) ఈ కార్యక్రమానికి సంబంధించిన చివరి ఎపిసోడ్ ప్రసారం అయింది.

చివరి ఎపిసోడ్‌కు 'దాదా ఫాల్కే అవార్డు' గ్రహీత, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ్ తన సీని జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఆశించిన స్థాయిలో స్పందన ఉందా?

ఆశించిన స్థాయిలో స్పందన ఉందా?

మీలో ఎవరు కోటీశ్వరుడు మెగాస్టార్ హోస్ట్ చేయబోతున్నారనగానే అప్పట్లో ఈ కార్యక్రమంపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే మెగాస్టార్ తో షోలు ప్రారంభం అయిన తర్వాత అంచనాలను అందుకునే స్థాయిలో ఈ కార్యక్రమం సక్సెస్ కాలేదు.

నాగార్జునకే ఎక్కువ రేటింగ్

నాగార్జునకే ఎక్కువ రేటింగ్

మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసిన దానికంటే.... అంతకు ముందు నాగార్జున హోస్ట్ చేసిన కార్యక్రమాలకే ఎక్కువ టీఆర్పీ రేటింగులు వచ్చాయి.

మెగాస్టార్ ను రిపీట్ చేస్తారా? లేక మరొకర్ని తీసుకొస్తారా?

మెగాస్టార్ ను రిపీట్ చేస్తారా? లేక మరొకర్ని తీసుకొస్తారా?

చాలా తక్కువ టీఆర్పీ రేటింగ్స్ వచ్చిన నేపథ్యంలో మరో సీజన్ కోసం మెగాస్టార్ చిరంజీవిని రిపీట్ చేస్తారా? లేక మరెవరైనా స్టార్ ను తీసుకొస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

తరపైకి మహేష్ బాబు పేరు?

తరపైకి మహేష్ బాబు పేరు?

అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు షో నిర్వాహకులు నెక్ట్స్ సీజన్ కోసం మహేష్ బాబుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఉయ్యాల వాడలో బిజీ

ఇక ఉయ్యాల వాడలో బిజీ

మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4 ముగిసింది కాబట్టి మెగాస్టార్ తన తర్వాతి సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' మూవీ షూటింగులో బిజీ కాబోతున్నారు.

English summary
Megastar Chiranjeevi's debut on small screen has received mixed response. He took the reins of popular reality show "Meelo Evaru Koteeswarudu" from Nagarjuna and hosted season 4. The season has finally come to an end. Chiranjeevi bid good-bye to this show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu