బిగ్ బాస్ ఫినాలే గెస్ట్ కన్ఫార్మ్: వచ్చేది ఆ స్టార్ హీరోనే.. ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా!

దాదాపు వంద రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ నాలుగో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. అప్పుడే ప్రస్తుతం టాప్-5లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్ల నుంచి ఒకరిని విజేతగా ప్రకటించనున్నారు. డిసెంబర్ 20న అంగరంగ వైభవంగా జరగనున్న ఫినాలే ఎపిసోడ్‌కు జూనియర్ ఎన్టీఆర్ కానీ, చిరంజీవి కానీ ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ గెస్టు గురించి క్లారిటీ వచ్చేసింది. ఫైనల్ ఎపిసోడ్‌కు ఓ స్టార్ హీరోతో పాటు ముగ్గురు హీరోయిన్లు రాబోతున్నారని తెలిసింది. ఇంతకీ ఎవరా సెలెబ్రిటీలు? పూర్తి వివరాలు మీకోసం!

ఐదుగురు కంటెస్టెంట్లు.. అతడికే అవకాశం

ఐదుగురు కంటెస్టెంట్లు.. అతడికే అవకాశం

బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫినాలే వీక్‌లో ఉంది. ఆరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్‌లు టాప్ -5కి చేరుకున్నారు. గత ఆదివారం రాత్రి నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో కంటెస్టెంట్ల అభిమానులు ఓట్లు గుద్దేస్తున్నారు. మొత్తానికి ఈ సీజన్‌కు అభిజీత్‌ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

డిసెంబర్ 20న ఫినాలే.. నాలుగు గంటలు

డిసెంబర్ 20న ఫినాలే.. నాలుగు గంటలు

ఇప్పటికే వంద రోజులు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ నాలుగో సీజన్. ఇప్పుడు షోలో చివరి వారం నడుస్తోంది. ఇక, డిసెంబర్ 20 అంటే వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఈ ఎపిసోడ్ సాగనుంది. ఎంతో అంగరంగ వైభవంగా జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం బిగ్ బాస్ యూనిట్ ఎన్నో ప్లాన్లు సిద్ధం చేస్తోంది.

 మూడు సీజన్లకు ట్రోఫీ అందించింది వాళ్లే

మూడు సీజన్లకు ట్రోఫీ అందించింది వాళ్లే

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్‌ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు ప్రత్యేకించి స్పెషల్ గెస్టులు ఎవరూ రాలేదు. అప్పుడు ఆయనే విజేత అయిన శివ బాలాజీకి ట్రోఫీని అందించాడు. ఇక, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు మాత్రం విక్టరీ వెంకటేష్ వచ్చి కౌశల్‌కు షీల్డ్ ఇచ్చాడు. నాగ్ మూడో సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి విచ్చేసి విజేత రాహుల్‌కు ట్రోఫీ అందజేశాడు.

బిగ్ బాస్ గెస్టుపై ఊహాగానాలు మొదలు

బిగ్ బాస్ గెస్టుపై ఊహాగానాలు మొదలు

గత మూడు సీజన్లలో రెండింటికి స్పెషల్ గెస్టులు ఎంట్రీ ఇవ్వడంతో.. నాలుగో సీజన్‌కు కూడా ముఖ్య అతిథిగా ఎవరో ఒక హీరో వస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు సహా పలువురు స్టార్ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, దీనిపై బిగ్ బాస్ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

 ఆయననే ఫైనల్ చేసిన బిగ్ బాస్ యూనిట్

ఆయననే ఫైనల్ చేసిన బిగ్ బాస్ యూనిట్


తాజా సమాచారం ప్రకారం.. గత సీజన్ గ్రాండ్ ఫినాలేకు గెస్టుగా వచ్చి అలరించిన మెగాస్టార్ చిరంజీవే.. ఈ సారి కూడా రాబోతున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఆయనతో బిగ్ బాస్ యూనిట్ హామీ కూడా తీసుకుందని తెలిసింది. ప్రస్తుతం ‘ఆచార్య' షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరంజీవి.. ఆదివారం జరిగే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం డేట్ కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది.

ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా ఎంట్రీ

ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా ఎంట్రీ

ఫైనల్ ఎపిసోడ్‌కు హీరోయిన్లు మెహ్రీన్, లక్ష్మీ రాయ్, నివేదా పేతురాజ్ కూడా రాబోతున్నట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వీళ్లు ముగ్గురూ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని అంటున్నారు. వీళ్లతో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు కూడా డ్యాన్సులు, పాటలతో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఫినాలే అదిరిపోయేలా జరగనుందని టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X