టీవి షోలో చిరంజీవి..వివరాలు

By Srikanya

హైదరాబాద్: మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ నాగార్జున చేస్తున్న టీవీ షో అదరకొడ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇంకా ఏ స్టార్స్ టీవి కు రాబోతున్నారు అనే చర్చ అంతటా మొదలైంది. అసలు చిరంజీవి ...ఈ షో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా మొదట్లో వచ్చింది. అయితే నాగార్జున ఈ షో చేయటానికి ఉత్సాహం చూపించటంతో ఆయన్ను ఫైనల్ చేసి, రేటింగ్స్ సంపాదిస్తున్నారు. నాగార్జున సక్సెస్ ఫుల్ గా టీవీ షోలతో లాంచ్ అయిన నేపధ్యంలో చిరంజీవి కూడా టీవి షోల వైపు ఉత్సాహం చూపిస్తాడా అంటే ..పూర్తిగా ఆయన టీవీ షో నిర్వహించే ప్రయత్నం చేయరు కానీ ఓ పాపులర్ టీవి షోలో ఆయన కనపించనున్నారని సమాచారం.

ఆ షో మరేదో కాదు..రాఘవేంద్రరావు నిర్వహిస్తున్న సౌందర్యలహరి పోగ్రామ్ లో చిరంజీవి కనిపించనున్నారని తెలుస్తోంది. ఈటీవి లో ప్రసారమవుతున్న ఈ పోగ్రామ్ లో చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం. ఈ మేరకు చిరంజీవి, రాఘవేంద్రరావులతో పోగ్రామ్ ఎపిసోడ్ షూట్ చేసారని అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పోగ్రామ్ చాలా బాగా వచ్చిందని, జూలై 27న ఈ పోగ్రామ్ టెలికాస్ట్ అయ్యే అవకాసముందని అంటున్నారు. ఈ షో లో చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల గురించి ప్రస్దావనతో నడుస్తుంది. 'సౌందర్యలహరి' ప్రతి ఆదివారం రాత్రి 9గం.30 నిమిషాలకు ఈటీవీలో ప్రసారం అవుతోంది.

Chiru in KRR's TV Show

సినీతారలతో రాఘవేంద్రరావు గారికి ఉన్న అనుబంధం, పాటల చిత్రీకరణ కోసం చేసిన కసరత్తులు, సెట్లో జరిగిన మధురమైన సంఘటనలూ... ఒక్కటేమిటి? అన్నీ... 'సౌందర్యలహరి'లో ప్రేక్షకులతో పంచుకుంటున్నారు దర్శకేంద్రుడు. హీరోలు, హీరోయిన్స్ , హాస్యనటులు, సంగీత దర్శకులు, గీత రచయితలు, నిర్మాతలు... ఇలా ఎంతోమంది రాఘవేంద్రరావుతో కలసి ప్రయాణం చేశారు. వీరందరి అనుభవాల మాలిక ఈ కార్యక్రమం. 'రాఘవేంద్రరావు అంటే ఏమిటి?' అని వాళ్లని అడిగితే ఒకొక్కరూ ఒక్కోరకంగా స్పందిస్తారు. అందులో చిలిపి వర్ణణలకు లెక్కేలేదు. అవన్నీ తెలుసుకొనే ప్రయత్నం.. 'సౌందర్యలహరి'. మొత్తం 26 ఎపిసోడ్స్ ను రూపొందించారు.

రాఘవేంద్రరావు గారు మాట్లాడితే.. అదో అపురూప జ్ఞాపకాల సంగమం అవుతుంది. ఆ మాటల్ని రాసుకొని దాచుకొంటే విలువైన పుస్తకం అవుతుంది. ఎందుకంటే ఆయన వెనుక 50 ఏళ్ల ప్రయాణం ఉంది. నాలుగు దశాబ్దాల దర్శకత్వ ఘనత ఉంది. వంద సినిమాల చరిత్ర ఉంది. ఏ హీరోయిన్ ని ఏ కోణంలో చూపిస్తే అందంగా కనిపిస్తుందో ఆయనకు బాగా తెలుసు. సన్నివేశం ప్రేక్షకుల గుండెలకు హత్తుకోవాలంటే ఎలాంటి మాయ చేయాలో ఆయనకు తెలుసు. ఇవన్నీ మనతో పంచుకొంటే... ఎంత బాగుంటుంది అన్న ఆలోచనే ఈ పోగ్రాం వెనక ఉన్న ప్లానింగ్ అంటున్నారు 'ఈటీవీ' వారు. అందుకే 'సౌందర్యలహరి' ఆవిష్కృతమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X