Bigg Boss 7 Telugu: షోలోకి ఆట సందీప్.. అతడు ఎలా సెలెక్ట్ అయ్యాడు? ఇండస్ట్రీలో ఏం చేశాడో తెలుసా?

సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. దేశంలోనే నెంబర్ వన్ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. తెలుగులోకి అస్సలు పరిచయం లేని కంటెంట్‌తో వచ్చిన ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు భారీ రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడోది కూడా ప్రారంభం అయిపోయింది. ఇక, ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు కూడా ఇందులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సీజన్‌లోకి ఆట సందీప్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడి పూర్తి వివరాలు తెలుసుకోండి!

ఏడో సీజన్ మరింత గ్రాండ్‌గా:బుల్లితెరపై బిగ్ బాస్ ప్రియులను ఉర్రూతలూగించేందుకు ఏడో సీజన్ ఎన్నో అంచనాల నడుమ ఆదివారం ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్ల ఆటపాటలతో ఈరోజు ఎపిసోడ్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు.

Choreographer Aata Sandeep Entered into Bigg Boss 7 Telugu

వాళ్లకే ఎక్కువ ఇంపార్టెన్స్‌తో:బిగ్ బాస్ షో అంటే ఎంత సక్సెస్‌ఫుల్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ సారి ప్రసారం అవుతున్న సీజన్ కోసం నిర్వహకులు ఫేమస్ అయిన కంటెస్టెంట్లనే ఎంపిక చేసుకున్నారు. బుల్లితెరపై సందడి చేసే నటీనటులు, యాంకర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారికి ప్రాముఖ్యతను ఇచ్చి.. వాళ్లతోనే ప్రయోగాలు చేయబోతున్నారు.

అడుగు పెట్టిన ఆట సందీప్:ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న బిగ్ బాస్ ఏడో సీజన్ తాజాగా ప్రారంభం అయింది. ఇందులోకి ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా అదిరిపోయే డ్యాన్సుతో స్టేజ్‌పై దుమ్ము లేపిన అతడు.. ఆ తర్వాత తనదైన మాటలతో హోస్టు నాగార్జుననే అవాక్కయ్యేలా చేశాడు. మొత్తానికి ఫేవరెట్లలో ఒకడిగానే హౌస్‌లోకి అడుగు పెట్టేశాడు.

Choreographer Aata Sandeep Entered into Bigg Boss 7 Telugu

అందుకే సెలెక్ట్ అయ్యాడట:ఆట సందీప్ కొరియోగ్రాఫర్‌గా ఎంత పాపులర్ అయ్యాడో.. సోషల్ మీడియా సెలెబ్రిటీగా మరంతగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అతడు తరచూ కొన్ని కాంట్రవర్శీల్లో చిక్కుకోవడంతో పాటు దూకుడైన స్వభావంతో కనిపించేవాడు. ఈ కారణంగానే బిగ్ బాస్ టీమ్ దృష్టిలో పడ్డాడట. అందుకే ఏడో సీజన్‌కు గానూ ఆట సందీప్‌ను వాళ్లు ఎంపిక చేశారని ఓ టాక్ వినిపిస్తోంది.

ఆ షోతోనే ఫేమస్ అయ్యాడు:డ్యాన్స్ మీద ఉన్న మక్కువతో చిన్న వయసులోనే డ్యాన్సర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన సందీప్.. ఎంతో మంది కొరియోగ్రాఫర్ల దగ్గర పని చేశాడు. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్‌లో వచ్చిన 'ఆట' షో ద్వారా వెలుగులోకి రావడంతో పాటు ఫుల్ ఫేమస్ అయ్యాడు. దీని తర్వాత అతడి క్రేజ్ అమాంతం పెరగడంతో పాటు సందీప్‌కు ఎన్నో అవకాశాలను కూడా అందించి పెట్టింది.

Choreographer Aata Sandeep Entered into Bigg Boss 7 Telugu

ఇండస్ట్రీలో ఏం చేశాడంటే:'ఆట' తర్వాత మరింత కష్ట పడిన సందీప్ కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలోనే 'లీడర్', 'పవనిజం' వంటి చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేశాడు. ఆ తర్వాత కూడా చాలా చిన్న పెద్ద చిత్రాలకు పని చేశాడు. అదే సమయంలో నటనను కూడా బయట పెడుతూ.. 'సూపర్ మచ్చి', 'ఇందువదన' వంటి చిత్రాలతో పాటు ఎన్నో షార్ట్ ఫిలింలు, సిరీస్‌లు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X