twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమలో పడ్డ ఢీ ఫేమ్ జావేద్ మాస్టర్, బర్త్ డే రోజే క్లారిటీ.. అమ్మాయి ఎవరంటే?

    |

    ఢీ షోలో డాన్సర్ గా పరిచయమై చాలా మంది ఫేమస్ అయ్యారు. చాలా మంది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లుగా రాణిస్తున్నారు. అలాగే డ్యాన్స్ మాస్టర్ లుగా మారి మరికొంత మందికి లైఫ్ ఇస్తున్నారు. అలాంటి వారిలో జావేద్ మాస్టర్ ఒకరు. ఇప్పుడు సినిమాల్లో కాస్త బిజీగా ఉన్న ఆయన పుట్టిన రోజు ఈరోజు. ఈ క్రమంలో ఆయన ప్రేయసి ఎవరో తెలిసేలా పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే

    డ్యాన్స్ మీద పిచ్చితో వచ్చి

    డ్యాన్స్ మీద పిచ్చితో వచ్చి

    గుంటూరు నుంచి సినిమాల్లో రాణించాలని ఆసక్తితో హైదరాబాద్ వచ్చి అనుకోకుండా ఢీ షోలో అవకాశం సంపాదించి ఫేమస్ అయ్యాడు జావేద్ ఖాన్ మాస్టర్. అక్సాఖాన్ సహా కొంత మంది కంటెస్టెంట్స్ కి జావేద్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించేవారు. ఇక ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన చాలా వివరాలు వెల్లడించారు.

    మొహమాటమే కొంప ముంచింది

    మొహమాటమే కొంప ముంచింది

    ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినా సరే ఇంకా జావేద్ మాస్టర్ ఎదగలేదు, ఆయనకు కొన్ని లక్షల అప్పు ఉంది అని తాను విన్నానని యాంకర్ ప్రశ్నించగా అది నిజమేనని మాస్టర్ ఒప్పుకున్నాడు. తనకు మొహమాటం ఎక్కువ కావడంతో ఎవరు సాంగ్ చేయమని అడిగినా చేస్తానని డబ్బులు విషయంలో పట్టుబట్టి అడగలేను అని చెప్పుకొచ్చాడు..

    ఇష్టమైన కార్ కూడా

    ఇష్టమైన కార్ కూడా

    ఇక ఆ కారణం వలనే తాను ఇప్పటి దాకా కొన్ని లక్షల నష్టపోయినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కారు కూడా అమ్మి వేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. తనకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారు అమ్మేసిన సమయంలో బాధ కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు.

    బర్త్ డే స్పెషల్

    బర్త్ డే స్పెషల్

    అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రేయసిగా ప్రచారం జరుగుతున్న ఒకామె ఆయనకు విష్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై బాయ్, ఐ లవ్ యూ టు ది మూన్ అండ్ బాక్ అంటూ ఆమె పేర్కొన్నారు. ఆమె పేరు ప్రదీప్తినాద్ రెడ్డి కాగా ఆమె జావేద్ టీం మెంబర్ అని అంటున్నారు.

    నిజమేంటి?

    నిజమేంటి?

    అయితే ఆ విషయాల మీద ఎలాంటి క్లారిటీ లేదు కానీ, ఆమె విషెస్ చెప్పడంతో జావేద్ మాస్టర్ కూడా లవ్ సింబల్స్ తో ఆమెకు రిప్లై ఇచ్చారు. వీరి మధ్య ఏమున్నది అనే దాని మీద క్లారిటీ లేదు కానీ, కొందరు మాత్రం నైస్ కపుల్ అంటూ కామెంట్ చేయడం మనం చూడొచ్చు. ఇక ఇప్పటికే యష్ మాస్టర్ లాంటి వారు ఒకింటి వారు కాగా జావేద్ కూడా త్వరలోనే శుభవార్త చెబుతాడు ఏమో చూడాలి మరి.

    English summary
    Javed Khan, is a well-known choreographer for Dhee shows. on the eve of his birthday, a clue came about his love life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X