అక్సాఖాన్ ని ల్యాప్‌టాప్ తో కొట్టా… అందుకే అన్ని లక్షల అప్పులు… నిజాలు బయటపెట్టిన జావేద్ మాస్టర్

ఢీ షోలో డాన్సర్ గా పరిచయమై చాలామంది ఫేమస్ అయ్యారు. మరీ ముఖ్యంగా అక్సా ఖాన్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా లోని స్వింగ్ జరా సాంగ్ తో ఫేమస్ అయింది. ప్రస్తుతానికి ఈ భామ ఒక పక్క ఢీ షోతో పాటు జబర్దస్త్ లోని హైపర్ ఆది టీంలో కూడా అడపాదడపా మెరుస్తూ జనానికి దగ్గరవుతోంది. అలాగే ఈ భామ తన సినిమాల్లో కూడా నటిస్తున్నానని చెప్పుకుంటుంది. అయితే ఇప్పటి దాకా ఎలాంటి సినిమా రిలీజ్ అవ్వలేదు అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే గతంలో ఈమెకి కొరియోగ్రాఫర్ గా ఉన్న జావెద్ మాస్టర్ లాప్ టాప్ తో కొట్టాడట, ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ వివరాల్లోకి వెళితే..

కొంటె చూపులతో కవ్విస్తోన్న సమంత (బర్త్‌డే స్పెషల్ ఫొటోలు)

 వాళ్లు అందరూ చెల్లెళ్ళు

వాళ్లు అందరూ చెల్లెళ్ళు

గుంటూరు నుంచి సినిమాల్లో రాణించాలని ఆసక్తితో హైదరాబాద్ వచ్చి అనుకోకుండా ఢీ షోలో అవకాశం సంపాదించి ఫేమస్ అయ్యాడు జావీద్ ఖాన్ మాస్టర్. ఆయన అక్సాఖాన్ సహా కొంతమంది కంటెస్టెంట్స్ కి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించేవారు. అయితే కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో తాను ఒక సారి అక్సా ఖాన్ ను కొట్టానని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.. తనతో పనిచేసే వాళ్లు అందరూ తనకు చెల్లెళ్ళు లాంటి వాళ్లని అయితే డ్యాన్స్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడిని అని ఆయన చెప్పుకొచ్చారు.

కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు

కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు

సినిమా రంగం అలాగే డాన్స్ ఫీల్డ్ లో కూడా కొరియోగ్రాఫర్ కు కంటెస్టెంట్ లు కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తారట నిజమే కదా అని యాంకర్ ప్రశ్నించగా అందుకు సమాధానంగా జావేద్ మాస్టర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ పుకార్లే అని చెప్పుకొచ్చిన ఆయన తన వద్ద చాలా మంది లేడీస్ అసిస్టెంట్ గా పని చేస్తారని వాళ్లను గారు అని తాను సంబోధిస్తూ ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు.

అక్సా ఖాన్ ను కొట్టా

అక్సా ఖాన్ ను కొట్టా

అలాగే తన వద్ద అక్సాఖాన్ కంటెస్టెంట్ గా చేరుతున్న సమయంలో తాను ఆమెకు అభయమిచ్చాను అని, నేను ఒక చెల్లెలు గాని నిన్ను భావిస్తానని ఆమెకు చెప్పాను అని జావెద్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో డాన్స్ కనుక సరిగా చేయకపోతే కొడతానని కూడా ఆమెకు చెప్పానని ఆయన అన్నారు. దీంతో సదరు యాంకర్ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నిజంగానే కొట్టారా ? అని ప్రశ్నించగా కొట్టానని అన్నారు. అయితే నేరుగా కొట్టలేదు కానీ లాప్టాప్ తీసి నేలకు వేసి కొట్టానని అక్సా ఖాన్ మీద కోపంతోనే అలా చేసినా, ఆమెను నేరుగా కొట్టలేదని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Irrfan Khan పై కొడుకు Babil Khan ఎమోషనల్.. నాన్నకు ప్రేమతో..!! || Oneindia Telugu
అందుకే లక్షల అప్పు

అందుకే లక్షల అప్పు

ఇక ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినా సరే ఇంకా జావెద్ మాస్టర్ ఎదగలేదు, ఆయనకు కొన్ని లక్షల అప్పు ఉంది అని తాను విన్నానని యాంకర్ ప్రశ్నించగా అది నిజమేనని మాస్టర్ ఒప్పుకున్నాడు. తనకు మొహమాటం ఎక్కువ కావడంతో ఎవరు సాంగ్ చేయమని అడిగినా చేస్తానని డబ్బులు విషయంలో పట్టుబట్టి అడగలేను అని చెప్పుకొచ్చాడు.. బహుశా దాని వల్ల తాను ఇప్పటిదాకా కొన్ని లక్షల నష్టపోయినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే లాక్ డౌన్ సమయంలో కారు కూడా అమ్మి వేయాల్సి వచ్చిందని. తనకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారు అమ్మేసిన సమయంలో బాధ కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X