ప్రారంభానికి ముందే బిగ్ బాస్‌కు భారీ షాక్: షో నుంచి తప్పుకున్న ఇద్దరు కంటెస్టెంట్లు.!

By Manoj

ఏమాత్రం అంచనాలు లేకుండా తెలుగులోకి వచ్చినప్పటికీ... తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. సరికొత్త థీమ్‌తో రూపొందినప్పటికీ.. షో ఎప్పుడు వస్తుందా అని వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. అందుకే బిగ్ బాస్ నిర్వహకులు కూడా గ్యాప్ లేకుండా ప్రతి ఏడాది ఒక సీజన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నాలుగో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు సెలెబ్రిటీలు షో నుంచి తప్పుకోవడంతో ప్రారంభానికి ముందే బిగ్ బాస్‌కు భారీ షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే....

Recommended Video

Bigg Boss Telugu 4 : YouTuber Mahathalli & Husband Entry ! || Oneindia Telugu
వివాదాలున్నా... విజయం సాధించింది

వివాదాలున్నా... విజయం సాధించింది

బిగ్ బాస్ షో అంటేనే వివాదాలమయం అన్న నానుడి ఉంది. ఇది తెలుగు వాళ్లకు కొత్త అయినప్పటికీ... హిందీలో ఎప్పటి నుంచి ప్రసారం అవుతోంది. అక్కడ ఎన్నో వివాదాలూ తలెత్తాయి. అందుకే తెలుగులో ఇది సక్సెస్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందుకు అనుగుణంగానే ఇక్కడా కొన్ని గొడవలు జరిగాయి. అయినా బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అవుతోంది.

 బిగ్ బాస్ సక్సెస్‌లో ఆ ముగ్గురు కీలకం

బిగ్ బాస్ సక్సెస్‌లో ఆ ముగ్గురు కీలకం

తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షో సక్సెస్ అవడం వెనుక నిర్వహకుల కష్టం ఏమోగానీ... దానిని ముందుండి నడిపించిన ముగ్గురు హీరోలు మాత్రం కీలక పాత్ర పోషించారు. అసాధారణమైన ప్రతిభతో హోస్టింగ్‌కు సరికొత్త అర్థాలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, అక్కినేని నాగార్జున దీన్ని టాప్ ప్లేస్‌లో నిలిపారు.

 మూడు సీజన్లలోనూ వాళ్లదే విజయం

మూడు సీజన్లలోనూ వాళ్లదే విజయం

బిగ్ బాస్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఏడాది ఓ సీజన్ ప్రసారం అవుతోంది. ఇప్పటికి మూడు సీజన్లు పూర్తవగా.. అన్నింటిలోనూ మగవారే విజేతలుగా నిలిచారు. మొదటి సీజన్‌లో శివ బాలాబీ, రెండో దానిలో కౌశల్ మండా, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్ విజేతలుగా నిలిచారు. రెండో సీజన్‌లో గీతా మాధురి, మూడో దానిలో శ్రీముఖి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

నాలుగో సీజన్‌కు ముహూరం ఖరారు

నాలుగో సీజన్‌కు ముహూరం ఖరారు

బిగ్ బాస్ ప్రియులు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న రోజు రానే వస్తుంది. కరోనా నేపథ్యంలో సీజన్ ఉండదనుకుంటున్న సమయంలో తెలుగు ప్రేక్షకులకు నిర్వహకులు శుభవార్త చెప్పారు. అదే... ఈ సీజన్ సెప్టెంబర్ ఆరు నుంచి మొదలు కాబోతుందన్న వార్త. ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన టీజర్ కొద్ది రోజుల క్రితం విడుదలైంది.

వారం ముందే బిగ్ బాస్‌కు భారీ షాక్

వారం ముందే బిగ్ బాస్‌కు భారీ షాక్

వచ్చే వారం బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం కాబోతుంది. ప్రారంభ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా రెండు రోజుల్లో పూర్తి కానుంది. అందుకోసం షో నిర్వహకులు ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కు కంటెస్టెంట్లుగా ఎంపికైన ఇద్దరు అర్థాంతరంగా తప్పుకోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందట.

 షో నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు ఔట్.!

షో నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు ఔట్.!

గత సీజన్ మాదిరిగానే నాలుగో దానికి కూడా ఓ జంటను పంపించాలని బిగ్ బాస్ నిర్వహకులు భావించారని, ఇందులో భాగంగానే కొరియోగ్రాఫర్ రఘుతో పాటు ఆయన భార్య సింగర్ ప్రణవిని హౌస్‌లోకి పంపుతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ వ్యక్తిగత కారణాలతో షో నుంచి తప్పుకున్నారని ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ఇంకో జంట కూడా ఎంటర్ అవుతుంది

ఇంకో జంట కూడా ఎంటర్ అవుతుంది


రఘు - ప్రణవి జంట షో నుంచి తప్పుకున్నప్పటికీ... ఈ సీజన్‌లో మరో జంట పాల్గొనబోతుందనే టాక్ వినిపిస్తోంది. యూట్యూబర్ మహాతల్లి.. ఆమె భర్త కంటెస్టెంట్లుగా వస్తున్నారట. వీళ్లతో పాటు సింగర్లు హేమచంద్ర, మంగ్లీ, హీరోయిన్ పూనమ్ భజ్వా, యాంకర్ అరియానా గ్లోరీ, హీరో అభిజిత్ సహా పలువురు కంటెస్టెంట్లుగా వస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X