ఆ ఐదుగురు తప్పుకున్నారా.? తప్పించారా.? బిగ్ బాస్‌కు ఫైనలై మిస్సైన కంటెస్టెంట్లు వీళ్లే.!

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అవుతున్నాయి. కానీ, వాటిలో కొన్నింటికి మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతుంది. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' ఒకటి. ఉత్తరాదిలో సూపర్ సక్సెస్ అయిన ఈ షో... కొన్నేళ్ల క్రితం మన తెలుగులోకీ ఎంట్రీ ఇచ్చింది. సరికొత్తగా ఉన్నప్పటికీ... మొదటి సీజన్‌ నుంచే క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నాలుగో సీజన్‌ను కూడా మొదలెట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లో షో కోసం ఫైనల్ అయిన ఐదుగురు కంటెస్టెంట్లు చివరి నిమిషంలో మిస్ అవడం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే....

అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేసిన బిగ్ బాస్

అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేసిన బిగ్ బాస్

తెలుగులో బిగ్ బాస్ మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సాధారణంగానే నాలుగో సీజన్ కూడా ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభించడంతో ఈ సీజన్ జరిగేది అనుమానమే అన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో అనుమానాలకు పుట్‌స్టాప్ పెడుతూ గత ఆదివారం (సెప్టెంబర్ 6) సీజన్ స్టార్ట్ అయింది.

అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఫోర్త్ సీజన్

అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఫోర్త్ సీజన్

మూడు సక్సెస్‌ఫుల్ సీజన్ల తర్వాత.. మరో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది బిగ్ బాస్. ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఈ సారి ఆయన వృద్ధుడి గెటప్‌లోనూ కనిపించి మెప్పించారు. దాదాపు మూడు గంటల పాటు ప్రసారం అయిన ప్రీమియర్ ఎపిసోడ్‌లో 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌ లోపలికి ఎంటర్ అయ్యారు.

ఈ సారి అంచనాలు... వివాదాలు లేకుండానే

ఈ సారి అంచనాలు... వివాదాలు లేకుండానే

బిగ్ బాస్ షో అంటేనే వివాదాలమయం అన్న టాక్ ఉంది. ఇప్పటి వరకు అన్ని భాషల్లోనూ జరిగిన సీజన్లలో ఇదే కనిపించింది. దీంతో షోకు సంబంధించిన సీజన్ ప్రారంభం అయ్యే ముందు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి. అయితే, ఊహించని విధంగా ఈ సారి ఎటువంటి వివాదాలు, గొడవలు జరగకుండానే సీజన్ ప్రారంభం అయింది. దీంతో అంచనాలు కూడా కనిపించడం లేదు.

ఒకేసారి పదహారు మంది..... ఇద్దరు మాత్రం

ఒకేసారి పదహారు మంది..... ఇద్దరు మాత్రం

నాలుగో సీజన్ పదిహేను వారాల పాటు జరగనుంది. ఈ మేరకు నాగార్జున కూడా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక, ఈ సీజన్ కోసం ప్రారంభ ఎపిసోడ్‌లో ఏకంగా పదహారు మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపించారు. అందులో ఇద్దరిని మాత్రం సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి షో నిర్వహకులే అందరినీ కలిపి ఎనిమిది జంటలుగా చేయడం విశేషం.

హౌస్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే

హౌస్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్లు వీళ్లే

మొదటి కంటెస్టెంట్ హీరోయిన్ మోనాల్ గజ్జర్ నుంచి వరుసగా సూర్య కిరణ్, దేవి నాగవల్లి, లాస్య మంజునాథ్, హీరో అభిజీత్ దుద్దల, జోర్దార్ సుజాత‌, మెహబూబ్ దిల్సే, అలేఖ్య హరిక, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, నోయెల్ సీన్, దివ్య వధ్య (దివి), అఖిల్ సార్థక్, గంగవ్వ హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. సైయద్ సోహాలి, యాంకర్ అరియానా గ్లోరీ మాత్రం సీక్రెట్ రూమ్‌కు వెళ్లారు.

 బిగ్ బాస్‌కు ఫైనలై మిస్సైన కంటెస్టెంట్లు వీళ్లే.!

బిగ్ బాస్‌కు ఫైనలై మిస్సైన కంటెస్టెంట్లు వీళ్లే.!

మొదటి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ షో గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం... ఈ సీజన్‌కు హౌస్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్లతో పాటు మరో ఐదుగురు కూడా సెలెక్ట్ అయ్యారట. వాళ్లే కొరియోగ్రాఫర్ రఘు.. ఆయన భార్య ప్రణవి, సింగర్ మంగ్లీ, యూట్యూబర్ మహాతల్లి.. ఆమె భర్త సుశాంత్. కానీ, వీళ్లు మాత్రం తుది జాబితాలో మిస్సయ్యారు.

ఐదుగురు తప్పుకున్నారా.? తప్పించారా.?

ఐదుగురు తప్పుకున్నారా.? తప్పించారా.?

పైన పేర్కొన్న ఐదుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టడం ఖాయమన్న టాక్ జోరుగా వినిపించింది. కానీ, ఊహించని విధంగా వాళ్లు గాసిప్పులకే పరిమితం అయ్యారు. ఇదిలాఉండగా... వీళ్లను కావాలనే హౌస్‌లోకి పంపించలేదా.? వీళ్లతో బిగ్ బాస్ ఏమన్నా ప్రయోగాలు ప్లాన్ చేస్తున్నాడా.? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X