శేఖర్ మాస్టర్ కాంప్లిమెంట్‌, స్టేజ్‌పైనే సిగ్గు మొగ్గలేసిన స్టార్ యాంకర్ .. ఇక ఆగలేనంటూ

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ డ్యాన్సర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరిగా అతి సాధారణ స్థాయి నుంచి కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫి చేసే రేంజ్‌కు వెళ్లాడు. కొందరు హీరోలకు ఆయన ఫేవరేట్ డ్యాన్స్ మాస్టర్. ప్రస్తుతం టాలీవుడ్‌లో శేఖర్ మాస్టర్ మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్. సినిమాలతో పాటు బుల్లితెరపైనా పలు షోలకు జడ్జిగా చేస్తూ రెండు చోట్లా తన మార్క్ చూపిస్తున్నారు శేఖర్.

ఈ స్టార్‌డమ్ శేఖర్ మాస్టర్‌కు రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దీని వెనుక ఎన్నో అవమానాలు, చీత్కారాలు, తినడానికి తిండి లేక పస్తులున్న రోజులు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్‌గా పట్టెడన్నం కోసం ఎదురుచూసిన పరిస్ధితి తనకు ఇంకా గుర్తుందని శేఖర్ మాస్టర్ పలు వేదికలపై చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు 75 రూపాయలు ఇస్తే తనకు రూ.కోటి దొరికినంత ఆనందం కలిగేదని చెప్పారు. తనకు డ్యాన్స్ , సినిమా తప్పించి ఏం తెలియదని ఎన్నోసార్లు ఎడిపించారు శేఖర్ మాస్టర్.

choreographer sekhar master complements to anchor anasuya Bharadwaj at Kiraack Boys vs Khiladi Girls Grand Finale event

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ తను ఉన్న చోట ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చేయడంలో శేఖర్ మాస్టర్ ముందుంటారు. యాంకర్లు, కంటెస్టెంట్స్‌పై జోకులు వేయడం, పంచ్‌లు విసరడం, సరదాగా ఆటపట్టిస్తుంటారు. వాళ్లు కూడా ఆ కామెంట్స్‌ను స్పోర్టీవ్‌గా తీసుకుంటారు తప్పించి సీరియస్ అయిన దాఖలాలు లేవు. ముఖ్యంగా స్టార్ యాంకర్ అనసూయపై శేఖర్ మాస్టర్ సెటైర్లు వేస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉండటంతో వీరిద్దరూ స్టేజ్‌పై చెలరేగిపోతుంటారు.

choreographer sekhar master complements to anchor anasuya Bharadwaj at Kiraack Boys vs Khiladi Girls Grand Finale event

మా టీవీలో ప్రసారమవుతున్న 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకు ఈ వారంతో ఎండ్ కార్డ్ పడింది. అనసూయ ఖిలాడీ బ్యూటిస్‌కి , కిర్రాక్ బాయ్స్‌కి శేఖర్ మాస్టర్ లీడర్స్‌గా ఉంటే.. మన రాములమ్మ శ్రీముఖీ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొన్నామధ్య ఓ టాస్క్‌లో శేఖర్ మాస్టర్ షర్ట్ విప్పితే.. అనసూయ టాప్ విప్పి ఎందులో అయినా అమ్మాయిలే తగ్గేదేలే అని ప్రూవ్ చేసింది. ఈ షో స్టార్టింగ్ నుంచి అనసూయతో పులిహోర కలుపుతూ ఆమెను ఇంప్రెస్ చేస్తున్నాడు శేఖర్. వీటికి మధ్యలో శ్రీముఖి కౌంటర్లతో ఆడియన్స్‌కి కావాల్సినంత వినోదం లభిస్తోంది.

https://www.instagram.com/stories/itsme_anasuya/3442448475324182116/?hl=en

గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఫైనల్ నాడు కూడా అనసూయను శేఖర్ మాస్టర్ వదిలిపెట్టలేదు. ఎపిసోడ్ ప్రారంభమవ్వగానే అమ్మాయిలు , అబ్బాయిలు కలర్‌ఫుల్ డ్రెస్సులో ఎంట్రీ ఇవ్వగా.. అనసూయని సైకిల్‌పై ముందు కూర్చోబెట్టుకుని వచ్చాడు శేఖర్. అనంతరం జడ్జి సీట్లో కూర్చొని.. ఏ మాటకి ఆ మాట నువ్వు స్టేజ్ మీదకొస్తేనే స్టేజ్ అందంగా ఉంటుంది అనడంతో రంగమ్మత్త సిగ్గు మొగ్గలేస్తూ మెలికలు తిరిగింది. శేఖర్ మాస్టర్‌కి థ్యాంక్స్ చెబుతూ.. మీ పక్కన జడ్జి సీట్‌లో కూర్చోవడానికి వెయిట్ చేస్తున్నానని అనసూయ రిప్లయ్ ఇస్తుంది. ఈ క్లిప్‌ను ఈ స్టార్ యాంకర్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

More from Filmibeat

Read more about: sekhar master anasuya bharadwaj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X