శేఖర్ మాస్టర్‌కు అమ్మాయిల పిచ్చా? ఈ పుకార్ల వెనుక నిజమేంటో తెలుసా?

రూపాన్ని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని గుణగణాలను అంచనా వేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరు పైకి సాఫ్ట్‌గా కనిపించినా వారి స్వభావం వేరు.. మరికొందరు పైకి గంభీరంగా కనిపించినా వారి మనసు వెన్నపూస. మన చుట్టూ ఇలాంటి వ్యక్తులు చాలా మందే ఉన్నా.. ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా పొరబాటు పడుతుంటాం. ఏదో ఊహించుకుని , వారి గురించి చెబుతుంటాం.

ఈ సంగతి పక్కనబెడితే.. కొరియోగ్రాఫర్ కమ్ డ్యాన్సర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరిగా అతి సాధారణ స్థాయి నుంచి కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫి చేసే రేంజ్‌కు వెళ్లాడు. కొందరికైతే ఆయన ఫేవరేట్ డ్యాన్స్ మాస్టర్. తమ సినిమాల్లో శేఖర్ ఉండాల్సిందేనని పట్టుబట్టి మరి అవకాశాలు ఇస్తుంటారు స్టార్స్. బుల్లితెరపైనా డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా చేస్తూనే స్టార్ హీరోలకు అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారు. అలా పెద్ద తెర, చిన్న తెరలు రెండు చోట్లా తన మార్క్ చూపిస్తున్నారు శేఖర్.

choreographer sekhar master made sensational comments on his affairs

కానీ ఈ జీవితం, ఈ స్టార్‌డమ్ శేఖర్ మాస్టర్‌కు రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దీని వెనుక ఎన్నో అవమానాలు, చీత్కారాలు, తినడానికి తిండి లేక పస్తులున్న రోజులు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్‌గా పట్టెడన్నం కోసం ఎదురుచూసిన పరిస్ధితి తనకు ఇంకా గుర్తుందని శేఖర్ మాస్టర్ పలు వేదికలపై చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. 75 రూపాయలు ఇస్తే తనకు రూ.కోటి దొరికినంత ఆనందం కలిగేదని ఒకానొక సందర్భంలో ఆయన చెప్పారు.

తనకు డ్యాన్స్ , సినిమా తప్పించి ఏం తెలియదని.. డ్యాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్లిపోతాడో, ఆయన వెళ్లిపోతే మాకు ఎక్కడ పని దూరమవుతుందోనని భయపడుతూ బతికేవాళ్లమని శేఖర్ మాస్టర్ చెప్పేవారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ తను ఉన్న చోట ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చేస్తారు శేఖర్ మాస్టర్. అయితే సినీరంగంలో ఉన్న వారిపై పుకార్లు, గాసిప్స్, నిరాధారమైన ఆరోపణలు కామన్. అలాగే శేఖర్‌పైనా ఎన్నో ఊహాగానాలు వినిపించాయి.

choreographer sekhar master made sensational comments on his affairs

శేఖర్ మాస్టర్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని, ఎంతో మందితో అఫైర్లు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. తనపై వస్తున్న తప్పుడు కథనాలు, కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుల్లితెరలపై కొన్ని రియాలిటీ షోలలో పాల్గొనే సమయంలో తనకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువని అందరూ మాట్లాడుకునేవారని, ఇది రాను రాను శేఖర్ మాస్టర్‌కే అమ్మాయిల పిచ్చి అన్నట్లుగా మార్చేశారని చెప్పారు.

అనసూయ, రష్మీలతో సరదాగా డ్యాన్స్ చేస్తుంటే అక్కడున్న వాళ్లు ఈలలు , కేకలు వేసేవారని శేఖర్ మాస్టర్ అన్నారు. ఓసారి ఇలాగే డ్యాన్స్ చేస్తే ముచ్చటపడిన శ్రీముఖి తనకు ముద్దు పెట్టిందని దీనిపై రకరకాలుగా రాసేశారని ఆయన తెలిపారు. వీటిలో తన ప్రమేయం లేకపోయినా .. లేనిపోనివి అంటగడుతున్నారని శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: anasuya bharadwaj sreemukhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X