Sahithi Shekar: వెండితెరపైకి శేఖర్ మాస్టర్ కూతురు.. యువ హీరోతో ఊహించని ఆఫర్?

ఒకప్పుడు డాన్స్ మాస్టర్స్ అంటే కేవలం తెరవెనుక మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం టెలివిజన్ అలాగే సోషల్ మీడియా కారణంగా చాలామంది టాలెంటెడ్ డాన్స్ మాస్టర్స్ ప్రేక్షకులకు దర్శనమిస్తున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన కొడుకు కూతురు కూడా ఆడియన్స్ కు బాగా తెలుసు. అయితే శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ శేఖర్ కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎంతో కష్టపడి..

ఎంతో కష్టపడి..

ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా చాలా కష్టపడి పైకి వచ్చిన వారిలో శేఖర్ మాస్టర్ ఒకరు. హైదరాబాదులో మొదట ఒక సైడ్ డాన్సర్ గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకునే వరకు వచ్చాడు. చాలా ఇంటర్వ్యూలలో శేఖర్ మాస్టర్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఎన్నో విషాద విషయాలను కూడా తెలియజేశాడు.

అందరి హీరోలతో..

అందరి హీరోలతో..

పెద్దగా కాంట్రవర్సీలకు వెళ్లకుండా వీలైనంతవరకు తన పని తాను చేసుకుంటూ వెళ్లే శేఖర్ మాస్టర్ కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక ఆయనతో వర్క్ చేయని స్టార్ హీరో లేడు. యంగ్ హీరో లేడు అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ వరకు దాదాపు అందరూ మెగా హీరోల తో వర్క్ చేశాడు. అలాగే అక్కినేని నందమూరి హీరోలతో కూడా మంచి బాండింగ్ ఉంది.

టెలివిజన్ షోలతో

టెలివిజన్ షోలతో

శేఖర్ మాస్టర్ కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా టెలివిజన్లో కూడా ఒక స్పెషల్ గెస్ట్ గా ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకున్నాడు. ఢీ షోలో జడ్జిగా ఉన్న ఆయన ఆ తర్వాత ఇతర స్పెషల్ ఈవెంట్స్ లలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వచ్చారు. ఇక ఆయన కూతురు సాహితీ శేఖర్ విన్నీ శేఖర్ ఇద్దరు కూడా ప్రత్యేకమైన గుర్తింపున అందుకున్నారు.

సాహితీ శేఖర్

సాహితీ శేఖర్

ముఖ్యంగా సాహితీ శేఖర్ కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె తన తమ్ముడితో మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ కు కూడా మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక అప్పుడప్పుడు వీరు చేసే స్పెషల్ డాన్స్ వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సాహితి శేఖర్ ఫోటోలకు కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో పాజిటివ్ కామెంట్స్ లైక్స్ వస్తూ ఉంటాయి.

 హీరోయిన్ గా..

హీరోయిన్ గా..

అయితే రీసెంట్ గా సాహితీ శేఖర్ కు ఒక సినిమా ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. తండ్రితోనే కొన్ని సినిమాలకు సంబంధించిన సాంగ్స్ రిహార్సల్స్ లో పాల్గొనే సాహితీ శేఖర్ నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ గానే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లుగా కథనాలు అయితే వెలువడుతున్నాయి. కానీ ఇంకా విషయంలో ఎవరు కూడా అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇవ్వలేదు.

 యంగ్ హీరో సినిమాలో..

యంగ్ హీరో సినిమాలో..

సాహితీ శేఖర్ నిజంగానే హీరోయిన్ గా నటిస్తుందా? లేక ఒక సైడ్ క్యారెక్టర్ పాత్రలో నటించబోతుందా? అనే విషయంలో క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆమెకు ఒక యంగ్ హీరో సినిమాలో ఆఫర్ అయితే వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ప్రాజెక్టు త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉందట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X