ఆట సీజన్ 6లో కూలీ కొడుకు కడుపు కొట్టిన ఓంకార్.. కొరియోగ్రాఫర్ సన్నీ సంచలన ఆరోపణలు !
జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ అంతకు ముందు అనేక తెలుగు షోలకు యాంకర్ గా వ్యవహరించారు. ఇప్పుడు అంటే డాన్స్ షో పేరు చెబితే అయితే ఢీ షో గుర్తు వస్తుంది. కానీ దీని కంటే ముందే ఓంకార్ యాంకరింగ్ లో ఆట అనే షో వచ్చేది. అంతకు ముందు చాలా షోలు చేసినా, ఈ షోతోనే ఓంకార్ పాపులర్ అయ్యి.. అందరికీ ఓంకార్ అన్నయ్య అయిపోయాడు. ఆట, ఆట జూనియర్స్ పేరుతో ఆయన షోలు చేసేవాడు.
అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

ఓంకార్ అన్నయ్యగా మారి
ఈ షోలకు జడ్జ్ లుగా సుందరం మాస్టర్, అమ్మా రాజశేఖర్, శివశంకర్ మాస్టర్, పోసాని కృష్ణ మురళి ఇలా చాలా మంది జడ్జీలుగా వ్యవహరించేవారు. ఇక షో ద్వారా భరత్, సన్నీ, సందీప్ వంటి డాన్సర్లు బాగా పాపులర్ అయి ఇప్పుడు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ గా మారారు. అయితే వారిలో ఒకరైన సన్నీ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఓంకార్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే ?

నాకూ డబ్బులు ఇవ్వలేదు
ఆట 5, 6 రెండు సీనన్ల విన్నర్ అయిన తనకు ఆ షో నుండి పేమెంట్ రాలేదని అన్నారు.రెండు సీజన్లు విన్నర్‌గా గెలిచినా రూపాయి కూడా ప్రైజ్ మనీ ఇవ్వలేదని ఇదే విషయాన్ని జీ వాళ్లకి ఫోన్ చేసి అడిగితే అదేంటి ఇచ్చేశాం కదా వచ్చి చెక్ తీసుకున్నారు అని చెప్పారని పేర్కొన్నాడు. సన్నీ అంటే నేనే, గెలిచింది నేనయితే చెక్ ఎవరికీ ఇచ్చారని అడిగితె మేమైతే చెక్ ఇచ్చేశామని తేల్చి చెప్పారని చెప్పుకొచ్చాడు.

రైల్వే కూలీ కొడుకుని కూడా
సీజన్ 6కి నా కంటెస్టెంట్‌గా ఆరేళ్ల బాబుని ఇచ్చారని, వాడు మార్షల్ ఆర్ట్స్ సహా డ్యాన్స్ అంతా బాగా చేశాడని, చివరికి టైటిల్ కొట్టాడని అన్నారు. రెండు లక్షలు ప్రైజ్ మనీ అని, లక్ష కొరియోగ్రాఫర్‌కి లక్ష విన్నర్‌కి అన్నారని కానీ వాడికి కూడా ఎగ్గోట్టారని చెప్పుకొచ్చారు. వాళ్ల నాన్న రైల్వేలో కూలీ అయినా ఇంత వరకు కూడా ఆ ప్రైజ్ మనీ ఇవ్వలేదని సన్నీ పేర్కొన్నాడు.. వాడికి పెళ్లి ఏజ్ వచ్చేసింది కానీ.. ప్రైజ్ మనీ ఇవ్వలేదని అన్నారు.

సన్నీ దర్శకుడిగా
ఇక సన్నీ ప్రస్తుతం దర్శకుడిగా మారే పనిలో ఉన్నాడు. ఆయన గతంలో నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో సన్నీ దర్శకుడిగా ఒక సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా గత ఏడాది జరిగాయి. ఆ తర్వాత ఏమయిందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా గురించి మళ్ళీ వార్తలు రాలేదు. చూడాలి మరి ఏమవుతుందో ?


Click it and Unblock the Notifications











