త్వరలో 'సిఐడి విశ్వనాథ్' సీరియల్

దర్శకుడు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ - "సిఐడి విశ్వనాథ్ అనగానే ఇది క్రైమ్ బేస్డ్ అని అందరూ అనుకోవచ్చు. కానీ, ఇది క్రైమ్ బేస్డ్ కాదు. సస్పెన్స్‌తో వుంటుంది. క్రైమ్‌ని ఎంకరేజ్ చేసేదిలా వుండదు. టివి సీరియల్స్‌లో జనరల్‌గా వుండే కుట్రలు, కుతంత్రాలు ఇందులో వుండవు. ప్రేక్షకుల్లో ఎవేర్‌నెస్ పెంచేలా ఈ సీరియల్ వుంటుంది. ఈ పవర్‌ఫుల్ సిఐడి క్యారెక్టర్‌కి ఎవరైతే సూట్ అవుతారు అనుకున్నప్పుడు ఇంద్రనీల్‌గారు తప్ప మరో ఆప్షన్ మాకు కనిపించలేదు. ఈ కాన్సెప్ట్ విని ఆయన కూడా ఎంతో ఆనందంగా చేయడానికి ఒప్పుకున్నారు. వారానికి రెండురోజులు ఈ సీరియల్ ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమవుతుంది" అన్నారు.
నిర్మాత విసు తన్నీరు మాట్లాడుతూ - "శ్రీవారు, ఎవరు అనే రెండు సీరియల్స్‌ను గతంలో నిర్మించాను. ఈ సీరియల్ విషయానికి వస్తే సిఐడి అనే సీరియల్ ఆల్రెడీ ఓ ఛానల్‌లో వస్తోంది కదా మళ్ళీ ఇది ఎందుకు అనుకున్నాను. అయితే దర్శకుడు శ్రవణ్ చెప్పిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. తప్పకుండా ప్రేక్షకులు ఈ తరహా సీరియల్‌ని ఆదరిస్తారన్న నమ్మకం కలిగింది. వచ్చే నెల నుంచి ఈ సీరియల్ ఓ ప్రముఖ ఛానల్ ప్రసారమవుతుంది" అన్నారు.
ఇంద్రనీల్, విసు తన్నీరు, మహేశ్వరి, రవీంద్రసూరి నామాల, శ్రీగిరి, సుకన్య, శ్రీధర్ నానా, శివ తదితరులు నటిస్తున్న ఈ సీరియల్‌కు సంగీతం: రవికళ్యాణ్, కథ-మాటలు: రవీంద్రసూరి నామాల, నిర్మాత: విసు తన్నీరు, కాన్సెప్ట్-నిర్వహణ-దర్శకత్వం: శ్రవణ్‌కుమార్ వీర్లపాటి.


Click it and Unblock the Notifications











