twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లితెర అభిమానులకు షాక్.. ముగింపు దశలో ఆ సీరియల్.. 21 ఏళ్ల నుంచి దిగ్విజయంగా!

    |

    Recommended Video

    CID Serial To Go Off Air After 21 Years

    సాయంత్రం అయిందంటే చాలు గృహిణులు, కుటుంబ సభ్యులు ఇంటిల్లిపాది మొత్తం తమ అభిమాన సీరియల్స్ కోసం టీవీ ఆన్ చేసి ఎదురుచూస్తుంటారు. తదుపరి ఎపిసోడ్ లో ఏంజరగబోతోంది అనే ఉత్కంఠ వారిలో నెలకొని ఉంటుంది. కుటుంబ నేపథ్యంలో సాగే సీరియల్స్ కు మాత్రమే కాక పౌరాణికాలు, క్రైమ్ సీరియల్స్ కు కూడా మంచి ఆదరణ ఉంటుంది. ఆ కోవకు చెందినదే సిఐడి. సిఐడి సీరియల్ గురించి వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

    క్రైమ్ నేపథ్యంలో

    క్రైమ్ నేపథ్యంలో

    ని టివి సిఐడి సీరియల్ ని ప్రసారం చేస్తోంది. తాజాగా ఈ సీరియల్ అభిమానులకు నిర్మాత బ్యాడ్ న్యూస్ వెల్లడించారు. సిఐడి సీరియల్ అక్టోబర్ 29 తో ముగియనునట్లు వెల్లడించారు. దీనితో సిఐడి అభిమానులలో నిరాశ నెలకొంది. క్రైమ్ దర్యాప్తు నేపథ్యంలో ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది.

    21 ఏళ్ల నుంచి

    21 ఏళ్ల నుంచి

    ఇండియాలో అత్యధిక కాలం నుంచి ప్రసారం అవుతున్న సీరియల్ గా సిఐడి పేరుగాంచింది. గత 21 ఏళ్ల నుంచి దిగ్విజయంగా సిఐడి ప్రసారం జరుగుతుందంటే దీనికి ఉన్న క్రేజ్ అర్థం అవుతుంది. ఇప్పటివరకు 1500 పైగా ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. 1997 లో ప్రారంభమైన ఈ సీరియల్ త్వరలో ముగియబోతోంది.

    షాక్ అయ్యా

    షాక్ అయ్యా

    సిఐడి సీరియల్ ముగియనుందనే వార్తపై ఇన్స్పెక్టర్ దయా పాత్ర పోషించిన దయానంద్ స్పందించారు. ఇటీవల నిర్మాత బిపి సింగ్ తనతో మాట్లాడుతూ సిఐడిని ముగించనున్నట్లు తెలిపారు. నాకు ఈ వార్త షాకింగ్ గా అనిపించింది. అభిమానులంతా సిఐడిని ఆపకూడదని కోరుకుంటున్నారు. టిఆర్పి రేటింగ్స్ ఇప్పటికీ బాగానే ఉన్నాయి.

     గగ్గోలు పెడుతున్న ఫాన్స్

    గగ్గోలు పెడుతున్న ఫాన్స్

    ఈ వార్త తెలియగానే సోషల్ మీడియాలో సిఐడి అభిమానుల రచ్చ మొదలైంది. సేవ్ సిఐడి, డోంట్ ఎండ్ సిఐడి వంటి హ్యాష్ ట్యాగ్స్ తో సోని సంస్థని రిక్వస్ట్ చేస్తున్నారు. సిఐడి అనేది మా జీవితాల్లో భాగంగా మారిపోయింది. దయచేసి ముగించవద్దు అంటూ వేడుకుంటున్నారు.

    English summary
    CID To Go Off Air After 21 Years. CID will now take an intermittent break starting October 28," a statement from the channel said
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X