Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ షోలో ఊహించని ట్విస్ట్.. సడెన్‌గా శివాజి ఎలిమినేషన్, ఏమైందంటే?
Sivaji Health Update: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మహా అద్భుతంగా సాగుతోంది. గతంలో ఎప్పుడూ లేని టీఆర్పీతో ఈ సీజన్ దూసుకెళ్తోంది. తెలుగు సూపర్ సక్సెస్ అయిన ఈ షో రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. అధ్భుతమైన టాస్కులు, అంతకు మించిన ఎమోషన్లతో రసవత్తరంగా సాగుతుంది. తాజాగా ఈ షోలో ఎవరూ ఊహించని ఓ పరిణామం చోటు చేసుకుంది. దీంతో బిగ్ బాస్ ఎవరూ ఊహించని డిసీషన్ తీసుకొని అందరికీ షాకిచ్చారు. అయితే ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నిన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్కులు నిర్వహించాడు బిగ్ బాస్. ఇందులో ప్రతీ ఒక్కరూ చాలా గట్టిగా కెప్టెన్ అయ్యేందుకు ప్రయత్నించారు. కెప్టెన్ అయితే మరో వారం ఇమ్యూనిటీ రావడం, అలాగే స్పెషల్ పవర్స్ కూడా లభించడంతో అంతా ఈ టూస్క్ ను చాలా సీరియస్ గా తీసుకుంటారు. అయితే 9వ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హాల్ ఆఫ్ బాల్ ఆనే టాస్కు ఇచ్చారు. ఇందులో యావర్, గౌతమ్ కృష్ణ, భోలె షవాళి, శోభా శెట్టి, రతికా రోజ్ లను వీరసింహులు టీంగా మిగిలిన వారిని గర్జించే పులుల జట్టుగా పెట్టారు.

ఈక్రమంలోనే ఆ తర్వాత జరిగిన అనేక టాస్కుల్లో గెలిచి.. చివరకు కెప్టెన్సీ పోటీదారులుగా అయ్యేందుకు వీర సింహులు టీం గెలిచింది. కానీ వీరికి బదులుగా గర్జించే పులులు టీం ఆట ఆడాలని.. ఎవరు ఎవరి కోసం ఆట ఆడుతారో వారే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా శివాజి, అమర్ దీప్, ప్రియాంక జైన్, అశ్విని, భోలె షవాలిలు గేమ్ ఆడారు. అయితే ఇందులో చాలా అగ్రెసివ్ గా గేమ్ ఆడి అశ్విని, భోలె షవాళిలను అమర్ దీప్ బయటకు పంపించాడు. అయితే ఆట మధ్యలో శివాజి చేతికి మరోసారి గాయం అయింది. విషయం గుర్తించిన హౌస్ మేట్స్ అంతా.. గేమ్ ఆపేసి మరీ వెంటనే శివాజిని మెడికల్ రూంలోకి తీసుకెళ్లారు.
చెకప్ తర్వాతా శివాజి చక్కగానే బయటకు వచ్చారు. నొప్పి ఉన్నప్పటికీ.. ఆయన మందులు వేసుకుంటూ ఉండాలనుకున్నారు. కానీ ఆయనకు చేతి నొప్పి తీవ్రం అయిందని సమాచారం. ఆ నొప్పిని ఆయన భరించలేక ఎడ్చాడని... అది గమనించిన బిగ్ బాస్ షో నిర్వాహకులు మరోసారి అవసమైన చికిత్సలు చేయింనట్లు తెలుస్తోంది. కానీ ఆయనకు నొప్పి తగ్గకపోవడం, ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉందని వైద్యులు సలహా ఇచ్చారట. దీంతో బిగ్ బాస్ ఓ షాకింగ్ డెసీషన్ తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా శివాజిని ఇంటి నుంచి ఎలిమినేట్ చేసేశారని పుకార్లు వచ్చాయి. కానీ అవన్నీ అబద్ధం అని తేలిపోయింది. ప్రస్తుతం శివాజి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. చేయి నొప్పి ఉన్నప్పటికీ చాలా తక్కువగానే ఉందని బిగ్ బాస్ షో నిర్వాహకులు అప్ డేట్ ఇచ్చారు. ఇది చూస్తుంటే ఆయన హౌజ్ లో ఉండడం కన్ఫార్మ్ అని తెలుస్తోంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ లో టేస్టీ తేజతో పాటు శోభా శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











