యాంకర్‌ సుమపై రచ్చ రవి దారుణమైన కామెంట్.. అలాంటి మాట అనేయడంతో సీరియస్

తెలుగు యాంకర్ సుమకు ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆమె లీడ్ యాంకర్ గా కొనసాగుతున్నారు. అయితే ఆమె చేస్తున్న షోలు అన్నిటికీ మంచి రేటింగ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆమె చేస్తున్న క్యాష్ ప్రోగ్రాం మంచి హిట్ గా నిలిచింది. అనేక సంవత్సరాల నుంచి షో విజయవంతంగా నడుస్తోంది. అయితే ఈ షోలో పాల్గొన్న రచ్చ రవితో సుమకు వాగ్వాదం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే

ప్రోమో ఆసక్తికరంగా

ప్రోమో ఆసక్తికరంగా

యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న 'క్యాష్‌' ప్రోగ్రామ్‌ విజయవంతంగా రన్‌ అవుతోంది. కొత్త కొత్త టాస్క్ లతో, ఆ షోని సరికొత్తగా మారుస్తూ ఎక్కడా బోర్ కొట్టని, విధంగా షోని డిజైన్ చేస్తూ ముందుకు తీసుకు వెళుతుంది . తాజాగా క్యాష్‌లో షాకింగ్‌ విషయాలు చోటు చేసుకుంన్నాయి. తాజాగా ఈ షో నుంచి విడుదలైన ప్రోమో ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.

మాటల యుద్ధం

మాటల యుద్ధం

తాజాగా ఈ షోలో జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి, కమెడియన్ భద్రం, అలీ తమ్ముడు ఖయ్యూమ్ వంటి వారు షోలో పాల్గొన్నారు. నాలుగు నిమిషాల పాటు ఉన్న ఈ ప్రోమోలో చాలా ఆసక్తికరమైన విషయాలు చూపించారు. యాంకర్‌ సుమకి, షోలో పాల్గొన్ననటుడు రచ్చ రవికి మధ్య సిల్లీగా మొదలైన మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారింది.

సుమ కూడా కాస్త ఘాటుగా

సుమ కూడా కాస్త ఘాటుగా

ప్రోమో చివరిలో తనని ఒకసారి గెలిపించండి అని సుమను రచ్చ రవి వేడుకున్నారు. అంతకు ముందు కూడా చాలా సార్లు ఇలా రిక్వెస్ట్ చేసినా నా మాట వినడం లేదు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశా ఒక్కసారైనా విన్నింగ్‌ ఎపిసోడ్‌ ఇచ్చావా అని సుమను ప్రశ్నించాడు. దీంతో సుమ కూడా కాస్త ఘాటుగా స్పందించింది. అంతటితో ఆగకుండా అక్కడ కూర్చొని ఎంత మందికి ఆన్సర్లు చెప్పావు అంటూ రవి మళ్ళీ ప్రశ్నించాడు.

రవి మీద ఫైర్

రవి మీద ఫైర్

ఆ మాట విని కోపం తెచ్చుకున్న సుమ నేను ఎవరికి చెప్పాను అంటూ కామెంట్ చేసింది. ఊర్కో అమ్మా అంటూ ఏదో పెద్ద కామెంట్‌ చేశాడు రచ్చ రవి. దీంతో ఆ డైలాగ్‌ బయటకు రాకుండా బీప్ వేశాడు. దీంతో ఓవరాక్షన్‌ చేయవద్దు అని రవి మీద ఫైర్ అయిన ఆమె అసలు ఏం అనుకుంటున్నారు మీరు. ప్రోమో కోసం ఏదేదో చేస్తున్నారు. స్టుపిడ్‌, ఇడియట్‌ అంటూ తన వద్ద ఉన్న ప్రోగ్రామ్‌ షీట్‌ ని కింద పడేసింది.

బూతుమాట కూడా

బూతుమాట కూడా

అలాగే ఏదో బూతుమాట కూడా అనేసింది. అది బీప్ వేసి కట్ చేశారు. రచ్చ రవి, యాంకర్‌ సుమ ల మధ్య జరిగిన సన్నివేశాలు చేస్తూ ఆడియెన్స్‌ సైతం షాక్‌ కి గురి అవుతున్నారు. అయితే సుమ, రచ్చ రవి మధ్య ఏం జరిగిందనేది తెలియాలంటే 23న ఈ టీవీలో సాయంత్రం ప్రసారం అయ్యే షో వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి చూడాలి ఈ షోలో అసలు ఏం జరిగింది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X