Bigg Boss Telugu 7: స్పా బ్యాచ్ మధ్య గొడవలు.. శోభాను కాలితో తన్నిన అమర్.. తిరిగి కొట్టిన ప్రియాంక!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా రోజురోజుకూ అందరికీ షాకిచ్చే ట్విస్ట్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ముఖ్యంగా 14వ వారం నామినేషన్స్ తర్వాత నుంచి సీరియల్ బ్యాచ్ అంతా ఒకవైపు.. మిగతా వాళ్లంతా ఒకవైపు ఉంటున్నారు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్ లు ఒకేచోట కూర్చుని ఉంటున్నారు. అలాగే సీరియల్ బ్యాచ్ కు చెందిన అంబటి అర్జున్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి లు ఓ వైపు ఉంటున్నారు. వాళ్లో చోట వీళ్లో చోట కూర్చొని ఎవరికి వారే యమునా తీరే అంటున్నట్లు ఉంటున్నారు.
బిగ్ బాస్ ప్రారంభం అయినప్పటి నుంచి సీరియల్ బ్యాచ్ కు చెందిన వాళ్లు గ్రూపుగా గేమ్ ఆడుతున్నారు. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ లు నామినేషన్లతో పాటు ప్రతీ గేమ్ ను కలిసే ఆడుతున్నారు. షో ప్రారంభం అయినప్పటి నుంచి ఒక్కటిగా ఉన్న వీళ్లు.. ఫ్యామిలీ వీక్ తర్వాత కాస్త వేర్వేరుగా ఉన్నారు. కొంచెం కొంచెం గొడవలు పెట్టుకున్నప్పటికీ అంత పెద్దగా మాత్రం కాలేవు. కలిసి గేమ్ ఆడుతున్నారని అనిపిస్తుందని కుటుంబ సభ్యులు చెప్పగా.. కాస్తా వేర్వేరుగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత కొంత కాలానికే మళ్లీ కలిసి గేమ్ ఆడారు.

ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ లో తమ ఎదుటి బ్యాచ్ అయిన స్పా బ్యాచ్ వాళ్లకు చుక్కలు చూపించారు. వాళ్ల ముగ్గురిలోనే టార్గెట్ చేస్తూ మరీ నామినేట్ చేశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా తాజా ఎపిసోడ్ లో వీరి మధ్య గొడవ చెలరేగింది. ఇందాకే విడుదల అయిన ప్రోమో చూస్తుంటే ఆ విషయం అర్థం అవుతోంది. ముఖ్యంగా శోభాశెట్టి కోసం వాళ్ల అమ్మ తీసుకొచ్చిన టెడ్డీ బేర్ తో ఆడుకుంటూ కనిపించింది. దాన్ని అమర్ దీప్ వద్దకు తీసుకెళ్లి.. అతడు మొహానికి ఆనిస్తూ కామెడీ చేసింది. ఈక్రమంలోనే ఫుల్ ఫైర్ అయిన అమర్ దీప్ శోభాను, ఆమె చేతిలో ఉన్న బొమ్మన కాలితో తన్నాడు.
అది చూసి కోపం తెచ్చుకున్న ప్రియాంక జైన్ తన చేతిలో ఉన్న మరో బొమ్మతో అమర్ దీప్ ను ఆట పట్టించింది. కాస్త కోప్పడి కొట్టింది. దానికి మరింతగా ఫైర్ అయిన అమర్ దీప్ ఆమెను కొట్టి బొమ్మను తీసి నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత ఇలా చేయకండి అంటూ ఫైర్ అయ్యాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు చాలా హర్ట్ అయిన ప్రియాంక జైన్ కూడా అరవడం ప్రారంభించింది. నువ్వు జోక్ చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటా అంటూ ఫైర్ అయింది. అందుకు అమర్ దీప్ పడేసింది మిమ్మల్ని కాదుగా బొమ్మనేగా అంటూ మరింత రచ్చ చేశాడు.
కానీ ప్రియాంక జైన్ మాత్రం అమర్ చేసిన పనికి విపరీతంగా ఫీల్ అయింది. ఇలా చేయడం చాలా తప్పు అంటూ గట్టిగా అరిచింది. ఇక అక్కడే ఉన్న శోభాశెట్టి కూడా అమర్ దీప్ దే తప్పని చెప్పుకొచ్చింది. ఇలా చేయకూడదని వివరించింది. కానీ అందుకు అమర్ దీప్ మాత్రం అంగీకరించలేదు. ఈక్రమంలోనే ఈ బొమ్మ వల్లే కదా గొడవ వచ్చింది దీన్ని పడేస్తానంటూ ప్రియాంక జైన్ వద్ద చెబుతూ బాధ పడింది. కానీ ప్రియాంక మాత్రం అది బొమ్మ వల్ల కాదు అతడి వల్లే అంటూ వివరించింది. ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూస్తే తప్పు పూర్తిగా తెలిసేలా లేదు. స్పా బ్యాచ్ మధ్ ఇంత పెద్ద గొడవ కావడం మాత్రం ఇదే మొదటి సారి.


Click it and Unblock the Notifications











