దీప్తి, నూతన్ కోల్డ్‌వార్.. నా ముందు నటించొద్దు.. డ్రామాలు వెయ్యొద్దని ఫైర్
బిగ్‌బాస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నూతన్ నాయుడు ఆచితూచి అడుగులేస్తున్నాడు. కౌశల్‌తోపాటు కొందరితోనే చనువుగా ఉంటూ కనిపిస్తున్నాడు. గత కొద్దిరోజులుగా దీప్తి నల్లమోతు, నూతన్ మధ్య ఓ కోల్డ్‌వార్ నడుస్తున్నది. ఇద్దరి మధ్య మాటల రగడ జరుగుతున్నది. బిగ్‌బాస్‌లో వారిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఒకరికొకరు క్లోజ్‌గా ఉండే ప్రయత్నం చేస్తుండగానే వారి మధ్య మాటలు జోరందుకుంటున్నాయి.

నీతో మాట్లాడేది అందుకే
62 రోజు ప్రసారమైన ఎపిసోడ్‌లో దీప్తి నల్లమోతు, నూతన్ నాయుడు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. దీప్తి నామినేషన్‌లో ఉండటం వలన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడమనే భావనలో మునిగిపోయింది. ఇంటి సభ్యులతో మంచిగా ఉండేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో నూతన్‌తో మాట్లాడుతూ.. ఎలిమినేట్ అయితే ఇంటి సభ్యులను వీడిపోవాల్సి ఉంటుంది. అందుకే అందరితో కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఆ కారణంగానే నీతో మాట్లాడాలనుకొని వచ్చాను అని దీప్తి చెప్పింది.

నీవు వివాదం చేస్తున్నావు
దీప్తితో నూతన్ మాట్లాడుతూ.. నేను ఏదైనా మాట్లాడితే వివాదంగా చేస్తున్నావు. ఏదైనా చెబితే నువ్వే మాట్లాడుతున్నావు. నన్ను మాట్లాడనివ్వడం లేదు అని అంటున్నావు. నీవు చాలా కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో ఉన్నావు. దానిని బయటకు వచ్చేలా చేద్దామంటే.. సరిగా స్పందించడం లేదు. గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నావు. సరేనని వదిలేస్తే ఓడిపోతాననే భయంలో ఉన్నావు అని అన్నావు.

నూతన్‌పై దీప్తి సెటైర్లు
నూతన్ మాటలపై స్పందిస్తూ.. స్క్రిప్టు బాగా ఉంది అని దీప్తి సెటైర్ వేసింది. నేనేదో మాట్లాడమంటే నీవు ఏదో మాట్లాడుతున్నావు. నీకైనా ఏమైనా అర్ధం అయిందా అని దీప్తి అన్నారు. బిగ్‌బాస్ గెలువాలని ఉందా? అని నూతన్ ప్రశ్నించగా దానిపై దీప్తి వాగ్వాదం సృష్టించింది.

నా ముందు నటించకు
దీప్తి మాటలకు చిర్రెత్తుకొచ్చిన నూతన్.. నటించాలని ఉంటే నా ముందు నటించకు. నటనకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటితే చాలా దారుణంగా ఉంటుంది అని ఝలక్ ఇచ్చాడు. నూతన్ ధాటికి దీప్తి లేచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోతుండగా టాలెంట్ అంటే ఇదే అని మరో సెటైర్ వేశాడు.

నూతన్ నీకు దండం పెడుతా
ఇక నామినేషన్ సందర్భంగా దీప్తి, నూతన్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఎవరు నామినేట్ కావాలనే విషయంపై ఇద్దరు వాదులాడుకొన్నారు. ఓ దశలో దండం పెడుతాను. ఇంతటి ఆ చర్చను ఆపేద్దామా అని దీప్తి వేడుకొన్నది. అందుకు సమాధానంగా నేను కూడా నీకు దండం పెట్టిన సందర్బాలు ఉన్నాయి అని అన్నారు.

అందరి ముందు డ్రామాలొద్దు
నూతన్‌తో చర్చ మితిమీరడంతో గీతా, శ్యామలను పిలిచి అభిప్రాయం తీసుకొందామన్న ప్రతిపాదనకు నూతన్ అభ్యంతరం చెప్పారు. అందరు ముందు దండం పెడుతూ డ్రామాలు ఆపడం ఆపేయండి అంటూ దీప్తికి నూతన్ చురకలు అంటించాడు. వీరి మధ్య గత కొద్దిరోజులుగా కోల్డ్ వార్ జోరందుకొన్నది. ఈ నేపథ్యంలో ఈ వార్ ఎక్కడి వరకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











