అఖిల్ ప్లేబాయ్.. పైకి అరవింద్ స్వామి.. లోన నిత్యానందస్వామిలా.. ఆది పంచ్ పేలింది!

Recommended Video

Hyper Aadi Speech @Mr.Majnu Pre-Release Event | Filmibeat Telugu

అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మిస్టర్ మజ్ను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో ఇటీవల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సినీ ప్రముఖులతోపాటు కమెడియన్ ఆది పాల్గొన్నాడు. ఆయన జబర్దస్త్ షోలోనే కాదు.. ఏ వేదికపైనా కూడా తన వాగ్దాటితో ఆకట్టుకొంటున్నారు. తాజాగా మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆది మరోసారి తన మాటల చతురతను ప్రదర్శించాడు. ఆయన ఎలాంటి మాటల బాణాలు వదిలాడంటే..

అఖిల్ ప్లేబాయ్ నటించాడు

అఖిల్ ప్లేబాయ్ నటించాడు

మిస్టర్ మజ్ను ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇప్పటికే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత అఖిల్ క్యారెక్టర్ గురించి అభిమానుల్లో ఓ అవగాహన ఏర్పడిదనుకొంటాను. ఈ చిత్రంలో అఖిల్ ప్లేబాయ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు.

 పైకి అరవింద స్వామిలా.. లోన నిత్యానందస్వామి

పైకి అరవింద స్వామిలా.. లోన నిత్యానందస్వామి

మీలో ఎంత మంది ప్లేబాయ్‌లు ఉన్నారని ఆది ప్రశ్న అడుగగా.. ఎవరూ లేరని ప్రేక్షకులు సైగలు చేయగా వారికి కౌంటర్ ఇచ్చాడు. పైకి చూస్తే అరవింద స్వామిలా కనిపిస్తారు.. లోన మాత్రం నిత్యానందస్వామి నాట్యం చేస్తుంటాడు అని సెటైర్ వేశాడు. మీ లాంటి ప్లేబాయ్‌లందరికీ బాబాయ్‌లా అఖిల్ కనిపిస్తాడు.

హీరో అఖిల్ గ్లామర్ అంతే

హీరో అఖిల్ గ్లామర్ అంతే

మజ్ను సినిమా కోసం విదేశాల్లో షూట్ చేశాం. అక్కడందరూ తెల్ల పోరీలే. మనం కరువు పడినట్టు కళ్లర్పాకుండా వారిని చూస్తుంటే.. అక్కడి తెల్లపోరీలు అఖిల్‌ను చూసేశారు. అఖిల్ గ్లామర్ అంటే అది. మన్మధుడి కొడుకు అంటే మన్మధుడే మరి ఆది అన్నాడు.

శివ సినిమా చూసిన తర్వాత

శివ సినిమా చూసిన తర్వాత

ఇక మన్మధుడు నాగార్జున గురించి చెప్పుకోవాలి. శివ సినిమా చూసిన తర్వాత నేను చైన్ లాగే ప్రయత్నం చేశాను. గట్టిగా లాగితే సైకిల్ పైకి లేచింది గానీ.. చైన్ తెగిరాలేదు. చివరకు గ్రీజు చేతులకు అంటడం తప్ప మరోటి కాలేదు. అలాంటి సీన్ చేయాలంటే నాగార్జున గారికే సాధ్యం అని ఆది తెలిపాడు.

వెంకీ అట్లూరికి ఆ అనుభవం ఉందేమో

వెంకీ అట్లూరికి ఆ అనుభవం ఉందేమో

మిస్టర్ మజ్ను చిత్రం అందరూ చూడాలి. చాలా బాగుంటుంది. తొలి ప్రేమతో దర్శకుడు వెంకీ అట్లూరి ప్రేక్షకులందర్ని మాయ చేశాడు. ఈ సినిమా ప్లేబాయ్ లాంటి లవ్ స్టోరి. అలాంటి ఎక్సీపిరియెన్స్ ఉంటేనే సినిమా తీయడం సాధ్యం. అలాంటి ఎక్సీపీరియెన్స్ వెంకీ అట్లూరికి ఉండి ఉందేమో అని ఆది అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X