Don't Miss!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాకు కామన్ సెన్స్.. బుర్ర ఉంది.. నీ సంగతి నేను చూస్తా.. యాంకర్ ఓంకార్‌కు ఆలీ జబర్దస్త్ పంచ్
యాంకర్, టాలీవుడ్ డైరెక్టర్ ఓంకార్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న సిక్త్‌సెన్స్ సీజన్ 4 కలర్ఫుల్గా సాగడంతోపాటు ఎమోషనల్ అంశాలను టచ్ చేస్తూ ముందుకెళ్తున్నది. తాజా ఎపిసోడ్లో కమెడియన్ ఆలీ, నటి సంగీత అల్లరి చేయడమే కాకుండా భావోద్వేగాన్ని పండిచారు. ప్రస్తుత వారంలో అలీ, సంగీత చేసిన హల్చల్ ఏమిటంటే..
ఆలీ, సంగీత జంటగా
ఇటీవల ఆరంభమైన సిక్ట్సెన్స్ సీజన్ 4 మరింత ఆసక్తికరంగా సాగుతున్నది. ఈ వారం ఆలీని ఈ షోలోకి ఆహ్వానిస్తూ రాజమండ్రి బ్రూస్ లీ, కామెడీకే బాహుబలి.. మా అలీ గారు అంటూ ఓంకార్ వేదికపైకి ఆహ్వానించారు. ఈ షోలో మీకు పోటీగా వస్తున్న గ్లామర్ హీరోయిన్ ఎవరో తెలుసా అంటే.. ఎంజెలీనా జోలీని పిలుస్తున్నారా అంటే.. కాదు మీరే చూడంటూ సంగీతను ఆహ్వనించారు.
తల్లి గురించి ఆలీ ఎమోషనల్
సిక్త్‌సెన్స్ షోలో ఆలీ తన తల్లితో దిగిన ఫోటోను డిస్ప్లే చేయడంతో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడేదైనా సీన్ చూస్తే.. అమ్మ ఉంటే బాగుండని ఫీలింగ్ కలుగుతుంది. ఈ ప్రపంచంలో తల్లిని మించిన ప్రాపర్టీ ఏదీ లేదు. వెయి కోట్లు ఓ వైపు పెట్టి.. మరో వైపు తల్లిని పెడితే.. నేను తల్లినే కోరుకొంటాను. డబ్బు ఎప్పుడూ మనతో రాదు. తల్లి ప్రేమ మనతోనే ఉంటుంది అని ఆలీ చెప్పారు.
గత సీజన్లో 10 లక్షలతో...
సిక్త్‌సెన్స్ గత సీజన్లో ఆలీ భారీగా పారితోషికాన్ని అందుకొన్నారు. గతవారం సిక్త్సెన్స్ను ఉపయోగించి రూ.10 లక్షలు గెలుచుకొన్నారు. అయితే ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.10 లక్షలు గెలుచుకోకుండా అడ్డుకొంటాను. సంగీతతో కలిసి ఈ సారి మీ ప్రయత్నం చేయండి అంటూ అలీకి హోస్ట్ ఓంకార్ సవాల్ విసిరారు.
గాయపడిన పులి అంటూ ఓంకార్
సిక్త్‌సెన్స్ లాస్ట్ సీజన్లో ఆలీ గెలుచుకొన్న విషయాన్ని తెలియజేస్తూ.. నన్ను ఓడించి.. పది లక్షలు తీసుకెళ్లారు. గాయపడిన పులి.. ఇక ముందు అలాంటిది జరగనివ్వదు అని ఓంకార్ అంటే.. గాయపడింది పులి కాదు.. పిల్లి.. అంటే ఆలీ పంచ్ విసిరారు. అయితే ఈ సారి మాత్రం పది లక్షలు ఇవ్వనంటూ ఓంకార్ ఛాలెంజ్ చేశాడు.
|
ఓంకార్‌పై ఆలీ పంచ్
ఓంకార్ మాటలపై ఆలీ రియాక్ట్ అవుతూ... పది లక్షలు ఇవ్వనంటూ మీరు ఎలా అంటారు. మీరు ఎలా అడ్డుకొంటారో చూస్తాను. ఇంత కష్టపడుతాం. ఆడుతున్నాం. బుర్ర ఉపయోగిస్తున్నాం. మాకు కొంచెం కామన్ సెన్స్ ఉంది అంటూ ఆలీ పంచ్ వేశాడు. ఇలా సంగీత, ఆలీ, ఓంకార్ మధ్య గేమ్ సీరియస్‌గా, ఫన్‌గా సాగింది.