twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాకు కామన్ సెన్స్.. బుర్ర ఉంది.. నీ సంగతి నేను చూస్తా.. యాంకర్ ఓంకార్‌కు ఆలీ జబర్దస్త్ పంచ్

    |

    యాంకర్, టాలీవుడ్ డైరెక్టర్ ఓంకార్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న సిక్త్‌సెన్స్ సీజన్ 4 కలర్‌ఫుల్‌గా సాగడంతోపాటు ఎమోషనల్ అంశాలను టచ్ చేస్తూ ముందుకెళ్తున్నది. తాజా ఎపిసోడ్‌లో కమెడియన్ ఆలీ, నటి సంగీత అల్లరి చేయడమే కాకుండా భావోద్వేగాన్ని పండిచారు. ప్రస్తుత వారంలో అలీ, సంగీత చేసిన హల్‌చల్ ఏమిటంటే..

    ఆలీ, సంగీత జంటగా

    ఆలీ, సంగీత జంటగా

    ఇటీవల ఆరంభమైన సిక్ట్‌సెన్స్ సీజన్ 4 మరింత ఆసక్తికరంగా సాగుతున్నది. ఈ వారం ఆలీని ఈ షోలోకి ఆహ్వానిస్తూ రాజమండ్రి బ్రూస్ లీ, కామెడీకే బాహుబలి.. మా అలీ గారు అంటూ ఓంకార్ వేదికపైకి ఆహ్వానించారు. ఈ షోలో మీకు పోటీగా వస్తున్న గ్లామర్ హీరోయిన్ ఎవరో తెలుసా అంటే.. ఎంజెలీనా జోలీని పిలుస్తున్నారా అంటే.. కాదు మీరే చూడంటూ సంగీతను ఆహ్వనించారు.

     తల్లి గురించి ఆలీ ఎమోషనల్

    తల్లి గురించి ఆలీ ఎమోషనల్

    సిక్త్‌సెన్స్‌ షోలో ఆలీ తన తల్లితో దిగిన ఫోటోను డిస్‌ప్లే చేయడంతో ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడేదైనా సీన్ చూస్తే.. అమ్మ ఉంటే బాగుండని ఫీలింగ్ కలుగుతుంది. ఈ ప్రపంచంలో తల్లిని మించిన ప్రాపర్టీ ఏదీ లేదు. వెయి కోట్లు ఓ వైపు పెట్టి.. మరో వైపు తల్లిని పెడితే.. నేను తల్లినే కోరుకొంటాను. డబ్బు ఎప్పుడూ మనతో రాదు. తల్లి ప్రేమ మనతోనే ఉంటుంది అని ఆలీ చెప్పారు.

     గత సీజన్‌లో 10 లక్షలతో...

    గత సీజన్‌లో 10 లక్షలతో...

    సిక్త్‌సెన్స్ గత సీజన్‌లో ఆలీ భారీగా పారితోషికాన్ని అందుకొన్నారు. గతవారం సిక్త్‌సెన్స్‌ను ఉపయోగించి రూ.10 లక్షలు గెలుచుకొన్నారు. అయితే ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.10 లక్షలు గెలుచుకోకుండా అడ్డుకొంటాను. సంగీతతో కలిసి ఈ సారి మీ ప్రయత్నం చేయండి అంటూ అలీకి హోస్ట్ ఓంకార్ సవాల్ విసిరారు.

    గాయపడిన పులి అంటూ ఓంకార్

    గాయపడిన పులి అంటూ ఓంకార్

    సిక్త్‌సెన్స్ లాస్ట్ సీజన్‌లో ఆలీ గెలుచుకొన్న విషయాన్ని తెలియజేస్తూ.. నన్ను ఓడించి.. పది లక్షలు తీసుకెళ్లారు. గాయపడిన పులి.. ఇక ముందు అలాంటిది జరగనివ్వదు అని ఓంకార్ అంటే.. గాయపడింది పులి కాదు.. పిల్లి.. అంటే ఆలీ పంచ్ విసిరారు. అయితే ఈ సారి మాత్రం పది లక్షలు ఇవ్వనంటూ ఓంకార్ ఛాలెంజ్ చేశాడు.

    ఓంకార్‌పై ఆలీ పంచ్

    ఓంకార్ మాటలపై ఆలీ రియాక్ట్ అవుతూ... పది లక్షలు ఇవ్వనంటూ మీరు ఎలా అంటారు. మీరు ఎలా అడ్డుకొంటారో చూస్తాను. ఇంత కష్టపడుతాం. ఆడుతున్నాం. బుర్ర ఉపయోగిస్తున్నాం. మాకు కొంచెం కామన్ సెన్స్ ఉంది అంటూ ఆలీ పంచ్ వేశాడు. ఇలా సంగీత, ఆలీ, ఓంకార్ మధ్య గేమ్ సీరియస్‌గా, ఫన్‌గా సాగింది.

    English summary
    Anchor Omkar's game show Sixth Sense season 4 is going with fun and emotions. Comedian Ali, Actor Sangeeta are the part of the show. Comedian Ali Challenges the Omkar in Sixth Sense season 4
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X