Alitho All In One: సరికొత్త షోతో వస్తున్న ఆలీ.. ఫస్ట్ ఎపిసోడ్ సెలబ్రిటీస్ ఎవరంటే?
తెలుగులో ఇప్పటికీ అనేకమైన టాక్ షోలు వచ్చాయి. సుమారు 15 ఏళ్ల క్రితం నుంచే తెలుగులో వివిధ టాక్ షోలు సందడి చేశాయి. మంచు లక్ష్మీ లక్ష్మీ టాక్ షో, ఆలీతో సరదాగా, సౌందర్య లహరి, నంబర్ వన్ యారి, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, జయప్రదం, సామ్ విత్ జామ్ వంటి అనేకమైన టాక్ షోలు అలరించాయి.
ఇందులో కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరించిన అలీతో సరదాగా టాక్ షో మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు మరో షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అలీ. గేమ్స్, డ్యాన్స్, మాటలు ఇలా అన్నీ ఉండే రియాలిటీ షో అంటూ చెబుతున్నాడు. మరి ఆ షో ఏంటనే విషయంలోకి వెళితే..

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ఆలీ మొన్నటి వరకు హోస్ట్ గా నిర్వహించిన టాక్ షో అలీతో సరదాగా. ఈ షోకి సెలబ్రిటీలను అతిథులుగా ఆహ్వానించి తనదైన స్టైల్ లో ప్రశ్నలు వేస్తూ ఆసక్తికర సమాధానాలు రప్పించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కార్యక్రమం విశేషంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ కార్యక్రమాన్ని కొన్నాళ్ల క్రితం నిలిపివేశారు. దీంతో అలీ కొత్తగా ఏదైనా ప్లాన్ చేస్తున్నారని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇంకాస్తా డిఫరెంట్ గా సరికొత్త రియాలిటీ షోతో రానున్నాడు కమెడియన్ ఆలీ.
ఆలీ తాజాగా హోస్ట్ చేయనున్న షో 'ఆలీతో ఆల్ ఇన్ వన్' (Alitho All In One). తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇంటులో అలీ భాయ ఎక్కడ అంటూ కొంతమంది స్టేజ్ మీద హడావిడి చేస్తుంటారు. దీంతో అలీ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఆటలు, పాటలు, డ్యాన్స్, గేమ్స్ ఇలా అన్ని రకాలు ఉన్న షోనే 'అలీతో ఆల్ ఇన్ వన్' అని అలీ చెప్పారు. అంటే ఇందులో అన్ని రకాల ఎంటర్టైన్ మెంట్స్ ఇస్తామని అలీ చెప్పారు.
'ఆలీతో ఆల్ ఇన్ వన్' కార్యక్రమంలోనూ సెలబ్రీటీలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ షో మొదటి ఎపిసోడ్ కు బిగ్ బాస్ ఫేమ్ సిరి, సీరియల్ హీరో, నటుడు అమర్ దీప్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ వచ్చి సందడి చేశారు. వారికి రకరకాల టాస్క్స్ ఇచ్చి ఫన్ క్రియేట్ చేశాడు అలీ. అవన్నీ సరదాగా ఉంటూ నవ్వించాయి.
ఈ షోలో మాటలు, పాటలు, డ్యాన్స్, గేమ్స్ ఇలా అన్ని కవర్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మధ్యలో ఆలీ డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. ఈ పాటలో సిద్ధు జొన్నలగడ్డ గెటప్పులో ఆలీ కనిపించి అట్రాక్ట్ చేశారు. ఎంటర్టైన్ మెంటే ప్రధానంగా సాగే ఈ షో ఈటీవీలో ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











