ముద్దుల వర్షం కురిపించిన రష్మి.. కరోనా అంటూ టాప్ కమెడియన్ పరుగో పరుగు
కరోనావైరస్ కారణంగా సినీ, టెలివిజన్ పరిశ్రమల షూటింగులు గత మూడు నాలుగు నెలలుగా స్తంభించిపోయాయి. యాక్టర్లు, యాంకర్లు, హీరో, హీరోయిన్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఇప్పుడిప్పుడే టెలివిజన్ రియాలిటీ షోలు మొదలుపెడుతున్నారు. తెలుగులో అత్యంత ప్రజాదరణ ఉన్న కమెడియన్ అలీ నిర్వహించే టాక్ షో షూటింగ్ కూడా ఇటీవల ప్రారంభించి దాని ప్రోమోను రిలీజ్ చేయగా ప్రస్తుతం విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఆ ప్రోమో వివరాల్లోకి వెళితే..

లాక్‌డౌన్ తర్వాత జోరుగా షూటింగులు
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత పలు టెలివిజన్ షోలు, సీరియల్స్ షూటింగులు మొదలయ్యాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులు జరుపుతున్నారు. జబర్దస్త్, అదిరింది. ఢీ ఛాంపియన్, ఢీ జోడి, అలీ టాక్ షో, పరివార్ లీగ్ 2 లాంటి షోల షూటింగులతో టాలీవుడ్‌లో హడావిడి పెరిగింది. కొన్ని షూటింగుల్లో కరోనావైరస్ కేసులు గుర్తించినా.. పలు జాగ్రత్తలతో షూట్స్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

అలీ టాక్‌షోలో రష్మీ, సుడిగాలి సుధీర్
టెలివిజన్‌లో హోస్ట్‌గా అలీ నిర్వహించే కార్యక్రమానికి తాజాగా సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌ను ఆహ్వానించారు. రష్మీ, సుధీర్ ఉంటేనే అదో క్రేజ్.. అలాంటి క్రేజ్‌కు అలీ తోడైతే మరింత జోష్ పెరగడం అత్యంత సహజం. అలాంటి జోష్ తాజా టాక్ షో ప్రోమోలో కనిపించింది. లాక్‌డౌన్ తర్వాత చేపట్టిన టాక్ కాబట్టి అలీ కూడా మంచి ఉత్సాహంతో ఉరకలేస్తూ కనిపించారు.

అలీకి కౌగిలింతలు, ముద్దులతో
యాక్టర్ అలీ కనిపించగానే రష్మీ గౌతమ్ ఆనందంతో కౌగిలించుకోవడానికి పరుగెత్తింది. దాంతో వద్దమ్మా అంటూ దూరంగా వెళ్లిపోయాడు. 2020లో అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంది అంటూ రష్మీ గౌతమ్‌కు అలీ సూచించాడు. అయినా రష్మీ అలానే అలీని పరుగులు పెట్టించింది.

దూరంగా ఉండే ఫ్లయింగ్ కిసెస్
ఆ తర్వాత అలీ అందకుండా పరిగెత్తుతుంటే పరిస్థితిని అర్ధం చేసుకొని గాలిలోనే కిస్సులు ఇచ్చేసింది. దూరంగా నించుకొన్న ఆలీ.. రష్మీ గాలిలో ముద్దులు పెడుతుంటే చెంపలు చూపిస్తూ ముద్దులను స్వీకరించాడు. అలా షోలో కూడా సోషల్ డిస్టెన్స్ అంటూ ఆలీ జాగ్రత్తపడ్డారు. ఈ సీన్ చూసి సుడిగాలి సుధీర్ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ కనిపించారు.
Recommended Video

అలీ పంచులు.. రష్మీ, సుధీర్ హంగామాతో
ఇక రష్మి, సుడిగాలి సుధీర్‌తో నిర్వహించిన టాక్ షోలో అల్లరి రేంజ్ మాములుగా లేదనే ఫీలింగ్ కనిపించింది. అలీ సెటైర్లు, పంచులతో ఇరగదీస్తే.. రష్మీ, సుడిగాలి సుధీర్ కెమిస్ట్రీ చిలిపి పనులు జాలీగా మార్చేశాయి. ఈ టాక్ షో త్వరలోనే ప్రసారం కానున్నది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోతో రష్మి, సుధీర్ ఎపిసోడ్ వినోదానికి దూరమైన ప్రేక్షకుల్లో మరింత జోష్‌ను నింపడంతో ఖాయంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











