twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లితెర మెగాస్టార్ పై కమెడియన్ సీరియస్.. నీకు, మీ ఫ్యామిలీకి యాటిట్యూడ్ అంటూ అవమానంగా!

    |

    బుల్లితెర నటీనటులకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే వారు సీరియల్స్ ద్వారా ఎప్పుడూ ఆడియెన్స్ పలకరిస్తూ ఉంటారు. ఇక సీరియల్స్ లో జరిగే కథ, కథనాలను తమ ఇల్లల్లో జరిగే వాటిగా పోల్చుకుంటూ నటీనటులపై అభిమానం పెంచుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ హవా ఎలా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటితో పాపులర్ అయన వాళ్లలో నటుడు ప్రభాకర్ ఒకరు. బుల్లితెర మెగాస్టార్ గా ఎదిగిన అతనికి ఇటీవల అవమానం జరిగింది. స్టేజీపైనా ఆయన గురించి, ఆయన ఫ్యామిలీ గురించి కమెడియన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    యాహు అనే షో ద్వారా..

    యాహు అనే షో ద్వారా..

    యాహు అనే షోతో పాపులర్ అయిన ప్రభాకర్ ఆ తర్వాత ఈటీవీలో పలు సీరియల్స్ చేశారు. పలు పాపులర్ షోస్ కి క్రియేటివ్ హెడ్ గా పనిచేశారు. అలాగే సీరియల్స్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా చెపట్టారు. నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఆయనకు మంచి అనుభవం ఉంది. సీరియల్స్ నుంచి ఫేమస్ అయ్యాక పలు సినిమాల్లో కూడా నటించారు ప్రభాకర్.

    బుల్లితెర మెగాస్టార్ గా..

    బుల్లితెర మెగాస్టార్ గా..

    శ్రీకాంత్-పోసాని కృష్ణమురళి కాంబినేషన్ లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన సినిమా మంచి విజయం సాధించిందన్న విషయం తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు బుల్లితెర ప్రభాకర్. ఆ తర్వాత వరుసపెట్టి సీరియల్స్ చేసి పూర్తిగా బిజీ అయిపోయారు ప్రభాకర్. అంచెలంచెలుగా ఎదిగిన ప్రభాకర్.. బుల్లితెరకు మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల వదినమ్మ సీరియల్ లో నటించారు.

    ట్రోలింగ్ ను పాజిటివ్ గా..

    ట్రోలింగ్ ను పాజిటివ్ గా..

    ఇక ఇటీవలే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆ సినిమా అనౌన్స్ మెంట్ కార్యక్రమంలో చంద్రహాస్ తనదైన యాటిట్యూడ్ తో నిల్చోవడం, పోజులివ్వడంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ ట్రోలింగ్ పై కూడా ప్రభాకర్ స్పందిస్తూ పాజిటివ్ గా తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఎలాగోలా మా అబ్బాయి అందరికి తెలుస్తున్నాడు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రభాకర్.

    కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ తరఫున..

    కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ తరఫున..

    తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో పాల్గొన్నారు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్. ఇందులో కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ తరఫున ఆయన హాజరయ్యారు. ఈ సీరియల్ టీమ్ తోపాటు ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు అనే మరొక సీరియల్ నటీనటులు వచ్చారు. వీరిలో బిగ్ బాస్ తెలుగు 6 బ్యూటి వాసంతి కృష్ణన్ ఉండటం విశేషం. ఈ సీరియల్ నటీనటులతో యాంకర్ శ్రీముఖి గేమ్స్ ఆడిపిస్తుందని తెలిసిన విషయమే.

    ముగ్గురు అమ్మాయిలను ఎత్తుకున్నాడు..

    ముగ్గురు అమ్మాయిలను ఎత్తుకున్నాడు..

    తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను కమెడియన్ అవినాష్ ఎత్తుకున్నాడు. అప్పుడు పెళ్లయిన తర్వాత మీ ఆవిడను ఎన్నిసార్లు ఎత్తుకున్నావ్ అని అవినాష్ ను అడిగింది యాంకర్ శ్రీముఖి. దీనికి అవినాష్ చెప్పలేకపోయాడు. దీంతో అవినాష్ భార్య అనూజకు కాల్ చేసి అడిగింది శ్రీముఖి. ఆమె 3 లేదా 4 సార్లు అని సమాధానం ఇస్తే.. ప్రోగ్రామ్ లో ఇప్పటివరకు ముగ్గురు అమ్మాయిలను ఎత్తుకున్నాడు అని శ్రీముఖి చెప్పింది.

    మీ అబ్బాయికు ఎందుకంతా యాటిట్యూడ్.

    మీ అబ్బాయికు ఎందుకంతా యాటిట్యూడ్.

    శ్రీముఖి అలా చెప్పడంతో అది ప్రఫెషన్ లో భాగంగానే అన్నట్లుగా అని అవినాష్ భార్య అంటే.. వాడి ప్రఫెషనే అది అని చెప్పండి అని ప్రభాకర్ పంచ్ వేశారు. తర్వాత డ్యాన్స్ లు, గేమ్స్ తో సందడిగా సాగింది. ఆఖరులో ఎందుకురా నీకు అంత యాటిట్యూడ్ అని అవినాష్ ను ప్రభాకర్ అంటే.. మీ అబ్బాయికు ఎందుకంతా యాటిట్యూడ్ అని తిరిగి ప్రశ్నించాడు అవినాష్. దీంతో ప్రభాకర్ తో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

    యాటిట్యూడ్ నాకు లేదు అర్థమైందా..

    యాటిట్యూడ్ నాకు లేదు అర్థమైందా..

    తర్వాత అన్న నా రా ఒక్క నిమిషం ఇటు రండి ఇటు రండి అని అవినాష్ పిలిచాడు. దీంతో యాటిట్యూడ్ తగ్గించుకో అని సీరియస్ గా అన్నాడు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్. తర్వాత కొద్దిసేపు షాక్ అయిన అవినాష్.. ఆ యాటిట్యూడ్ నాకు లేదు అర్థమైందా అని అవినాష్ అన్నాడు. దీనికి మరి ఎవరికీ ఉందిరా అని ప్రభాకర్ అడిగితే.. మీకు, మీ ఫ్యామిలీకి ఉంది అర్థమైందా అని సీరియస్ గా షాకింగ్ కామెంట్స్ చేశాడు అవినాష్. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు ప్రభాకర్.

    English summary
    Comedian Avinash Shocking Comments On Bullitera Megastar Prabhakar About His Family In Aadivaaram With Star Maa Parivaaram Programme Promo..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X