twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ పండుగపై సెన్సేషనల్ కామెంట్స్.. ఇంకెప్పుడూ ఇలా జరగదని మాటిస్తున్నా .. ధన్‌రాజ్ కామెంట్స్

    |

    బుల్లితెరపై కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు ధన్ రాజ్, వేణు, హైపర్ ఆది వంటివారు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, అదిరింది షోలో కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్, కించపరిచేలా వ్యాఖ్యలు వస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు అలాంటి వాటి వల్ల కమెడియన్స్‌కు చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. వేణుపై ఏకంగా కొందరు దాడి కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోల్లో వీరు చేసే స్కిట్స్ ఒక్కోసారి వివాదాంగా మారుతుంటాయి. అలా తాజాగా ధన్‌రాజ్ చేసిన ఓ స్కిట్‌పై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

    అదిరింది ప్రోగ్రాంలో..

    అదిరింది ప్రోగ్రాంలో..

    గత ఆదివారం అదిరింది ప్రోగ్రాంలో ధన్ రాజ్ చేసిన స్కిట్, అందులోని కామెంట్స్ సెన్సేషనల్ అవుతున్నాయి. మామూలుగానే ధన్ రాజ్ అంటేనే డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు పెట్టింది పేరు. అది జబర్దస్త్ అయినా, అదిరింది అయినా ధన్ రాజ్ సెటైర్స్, డైలాగ్స్ మాత్రం అంతే స్థాయిలో ఉంటున్నాయి.

    డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రచ్చ..

    డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రచ్చ..

    ఆ మధ్య స్వామిజీ, శిష్యుల మీద స్కిట్ వేశాడు. శిష్యులడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చే స్వామిజీలా ధన్ రాజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మనిషి వందేళ్లు బతకాలంటే ఏం చేయాలని శిష్యులడిగితే కొట్టుకోవాలి.. అంటూ డబుల్ మీనింగ్ డైలావ్ వేసి.. వెంటనే కవర్ చేశాడు. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి అని మాట మార్చేశాడు.

    దీపావళి పండుగపై..

    దీపావళి పండుగపై..

    తాజాగా అలాంటి స్కిట్ వేసిన ధన్ రాజ్ దీపావళి పండుగపై కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటారని అడిగితే.. దీప అనే అమ్మాయి, అలీ అనే అబ్బాయి పెళ్లి చేసుకోవడంతో అంటూ ధన్ రాజ్ సమాధానమిచ్చాడు.

    హిందూ సంఘాలు ఫైర్..

    హిందూ సంఘాలు ఫైర్..


    దీపావళి పండుగపై ఇలాంటి కామెంట్స్ చేయడంతో హిందూ సంఘాలు ఫర్ అయ్యాయి. సోషల్ మీడియాలో ధన్ రాజ్‌పై విపరీతంగా ట్రోల్స్ చేశాయి. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో ధన్ రాజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

    నవ్వించే ప్రయత్నం..

    నవ్వించే ప్రయత్నం..

    ‘దీపావళి పండుగపై కావాలని కామెంట్ చేయలేదు.. నవ్వించే ప్రయత్నంలోనే అలా అన్నాను. ఎవరైన బాధపడి ఉంటే నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ ఇలాంటివి చేయను. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఇకపై నా స్కిట్స్ గానీ, మాటలు గానీ ఉండవు.. అలా అని నేను మాటిస్తున్నా' అని ధన్ రాజ్ స్పష్టం చేశాడు.

    English summary
    Comedian DhanRaj Controversial Comments On Diwali In Adhirindi. Comedian DhanRaj Vulgar Dialogues In Adirindi. Adirindi Latest Promo Goes Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X